- Home
- Entertainment
- Krishna Mukunda Murari: కోడలు పెట్టిన పరీక్షలో నెగ్గిన భవాని.. చూడకూడని సన్నివేశాన్ని చూసిన ముకుంద!
Krishna Mukunda Murari: కోడలు పెట్టిన పరీక్షలో నెగ్గిన భవాని.. చూడకూడని సన్నివేశాన్ని చూసిన ముకుంద!
Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండే కష్ట సుఖాలను తెలిపే కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఎవరితోనీ మాట్లాడకూడదు అని ఆంక్షలు పెట్టినా ఏదో ఒక వంకతో ఎవరితోనో ఒకరితో మాట్లాడుతుంది కృష్ణ అని అంటుంది ముకుంద. అది తన తప్పు కాదు మురారి తప్పు. కృష్ణని బాగా వెనకేసుకొస్తున్నాడు, ఇంతకుముందు అలా ఉండేవాడు కాదు పెద్దమ్మే లోకంగా ఉండేవాడు అంటూ మురారిని మందలిస్తారు ఈశ్వర్ ప్రసాద్.
నేను కృష్ణ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు మురారిని తప్పు పడుతున్నారు, ఎలా అయినా టాపిక్ మార్చేయాలి అనుకుంటుంది ముకుంద. మరోవైపు కృష్ణ భవానికి ట్రీట్మెంట్ ఇస్తుంది. టాబ్లెట్స్ వేసుకొని జ్యూస్ తాగండి అని బోర్డు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరూ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వస్తాడు. అక్కడ ఉన్నా సెలైన్ బాటిల్, ఇంజక్షన్ బాటిల్స్ చూసి నాకన్నా ముందు ఎవరో ట్రీట్మెంట్ ఇచ్చారు.
మళ్లీ నన్ను ఎందుకు రమ్మన్నారు అంటాడు. మీరు చూస్తేనే మాకు సాటిస్ఫాక్షన్ డాక్టర్ అని ఈశ్వర్ అనటంతో ఆ టాబ్లెట్లని చూసిన డాక్టర్ ఇవి ఎవరు రాశారు అని అడుగుతాడు. ఒక జూనియర్ డాక్టర్ రాసింది అంటుంది ముకుంద. ఒక సీనియర్ డాక్టర్ లానే ట్రీట్ చేసింది ఈ మందుల్నే కంటిన్యూ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఫ్యామిలీ డాక్టర్. మరోవైపు గదిలో ఉన్న నందిని దగ్గరికి వచ్చి మా పెద్దమ్మకి ట్రీట్మెంట్ చేసినందుకు థాంక్స్ అంటాడు మురారి.
అది నా డ్యూటీ, అయినా మీరు చేసిన సాయం ముందు నేను చేసిన సాయం ఎంత అంటుంది కృష్ణ. నేనేం సాయం చేశాను అని మురారి అనటంతో మంచి మనసున్న వాళ్లకి ఎప్పుడూ చేసిన సాయం గుర్తుండదని మా నాన్న చెప్పేవారు, నాకు ఇప్పుడు అదే గుర్తొస్తుంది అంటూ నందినీకి చేసిన హెల్ప్ గురించి చెప్తుంది కృష్ణ. నందిని ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అంటాడు మురారి.
బాగానే ఉండి ఉంటుంది, గౌతమ్ సర్ ప్రేమ ఆమెని తిరిగి మాములు మనిషిని చేస్తుంది అని నమ్మకంగా చెప్తుంది కృష్ణ. ప్రేమ ఒక మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది అని నందిని చూశాక తెలిసింది అంటుంది కృష్ణ. నా ప్రేమ నీకు కనిపించడం లేదు అనుకుంటాడు మురారి. ఈలోగా కిందపడిన వాటిని తీయడం కోసం ఇద్దరూ ఒకేసారి కిందికి వంగుతారు. అలా తలలు గుద్దుకుంటే మరోసారి గుద్దుకోవాలి అంటూ తన తలని గట్టిగా కృష్ణ తలకి గుద్దుతాడు మురారి.
ఇంత గట్టిగా గుద్దుతారా మూడోసారి కూడా గుద్దుకోవాలి అంటుంది కృష్ణ. అలా అయితే నన్ను పట్టుకో అంటాడు మురారి. అతనిని పట్టుకోలేక పోనీలెండి మీరు బాగా భయపడిపోతున్నారు అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాను అంటుంది కృష్ణ. అంత లేదు నువ్వు నన్ను పట్టుకోలేకపోతున్నావు, నేను నీకు అందని కదా అంటూ వేళాకోళం ఆడతాడు మురారి.
ఆ మాటలకి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది కృష్ణ. నచ్చిన వాళ్ళతో ఓటమి కూడా గెలుపే అవుతుంది. మీరు ఎప్పుడూ ఓడిపోకూడదు అనుకుంటూ తన ఓటమిని ఒప్పుకుంటుంది కృష్ణ. నువ్వు ఓటమిని ఒప్పుకుంటున్నావా అంటూ ఆశ్చర్యపోతాడు మురారి. కృష్ణని గెలవడం అంటే సెలబ్రేషనే అంటూ కృష్ణని ఎత్తుకొని డాన్స్ చేస్తాడు మురారి. మరోవైపు కోలుకున్న భవానితో కృష్ణ ఎంత వద్దని చెప్తున్నా వినకుండా మీకు ట్రీట్మెంట్ చేసింది.
మీ దగ్గర మంచి దానినని నిరూపించుకోవాలనేమో అంటుంది ముకుంద. అంతలో కోపంగా తననే చూస్తున్న రేవతిని చూసి మాట మార్చేస్తుంది ముకుంద. తనవల్లే మీకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే క్యూర్ అయింది. తనతో మాట్లాడతారా అని అడుగుతుంది ముకుంద. ఏంటి మాట్లాడేది తను ట్రీట్మెంట్ ఇస్తే ఎందుకు కోలుకున్నానా అనిపిస్తుంది అంటూ కోప్పడుతుంది. తను ట్రీట్మెంట్ చేస్తున్నందుకు మీరు కరిగిపోయారా లేదా అని టెస్ట్ చేశాను, కరగలేదు అనుకుంటూ సంతోషపడుతుంది ముకుంద. మరోవైపు భర్తకి టాబ్లెట్లు ఇచ్చి ఇవి వేసుకోండి తగ్గిపోతుంది అంటుంది కృష్ణ. ఈ తలనొప్పి టాబ్లెట్లతో తగ్గేది కాదు అంటాడు మురారి.
కానీ కృష్ణ చెప్పడంతో వేసుకుంటాడు. ఇప్పుడు మీ పెద్దమ్మ కి ఫోన్ చేయండి ముందు ఉన్నంత కోపం ఇప్పుడు ఉండదు మాటలతో మనసుని కరిగించవచ్చు అని మురారి కి నచ్చచెప్పి భవానికి ఫోన్ చేయిస్తుంది కృష్ణ. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు కట్ చేసేస్తుంది భవాని. భవానిమీద కోప్పడి, తన కూతురి మంచి కోసమే కదా మనం ప్రయత్నించాము, ఊరుకుంటుంటే మరీ ఓవర్ చేసేస్తున్నారు అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో నువ్వు ఏమేమి అడగాలనుకుంటున్నావో అవన్నీ వెళ్లి మా పెద్దమ్మని అడుగు అంటాడు మురారి. అలాగే అంటూ ఆవేశంగా అడుగు ముందుకు వేసి తుపాకీ గురిపెట్టిన భవాని గుర్తుకు రావటంతో కంగారుగా వెళ్లి మురారి మీద పడిపోతుంది కృష్ణ. అది చూసిన ముకుంద కోపంతో రగిలిపోతుంది.