- Home
- Entertainment
- Krishna Mukunda Murari: కూతురికి మరో పెళ్లి చేస్తానంటున్న శ్రీనివాస్.. మురారితో ఛాలెంజ్ చేసిన ముకుంద!
Krishna Mukunda Murari: కూతురికి మరో పెళ్లి చేస్తానంటున్న శ్రీనివాస్.. మురారితో ఛాలెంజ్ చేసిన ముకుంద!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భర్తని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మురారి డల్ గా ఉన్నాడు అంటూ అతనికి దిష్టి ఇస్తుంది కృష్ణ. దిష్టి తీయడంలో కూడా తింగరి తనమే అంటూ నవ్వుతుంది భవాని. తన గదికి వెళ్తున్న మురారిని తదేకంగా చూస్తూ ఉంటుంది ముకుంద. కానీ ఆమెని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు మురారి. మరోవైపు ముకుంద తండ్రి శ్రీనివాస్ ఇంటికి అతని తమ్ముడు మరదలు పెళ్లి పిలుపులు కి వస్తారు.
మాటల్లో ముకుంద గురించి అడుగుతుంది మరదలు. తన మటుకు తనని బాగానే వదిలేశారు అక్కయ్య పుట్టింటి ఫంక్షన్ లకి తిరుగుతూ ఉంటుంది.. మీరు బిందాస్ గా ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటారు మధ్యలో నష్టపోయేది ఆడపిల్ల జీవితమే అంటూ నిష్టూరంగా మాట్లాడుతుంది శ్రీనివాస్ మరదలు. నా కన్నకూతురు గురించి నేను ఆలోచించకుండా ఉంటానా అంటాడు శ్రీనివాస్.
దాని మాటలు పట్టించుకోవద్దు కానీ ఆడపిల్ల కదా అన్నయ్య ఒకసారి ఆలోచించు అని శ్రీనివాస్ కి చెప్పి వెళ్ళిపోతారు అతని తమ్ముడు మరదలు. మరోవైపు భవాని ప్రయాణానికి సిద్ధమవుతుంది. అందరూ డల్ గా ఉండటంతో నేనేమి పర్మినెంట్గా ఫారిన్ లో సెటిలైపోవటానికి వెళ్లిపోవడం లేదు అని నవ్వుతుంది. అందరికీ జాగ్రత్తలు చెప్తుంది. నువ్వు అందరితోని కలివిడిగా ఉండు అప్పుడు ఒంటరితనం ఉండదు అంటుంది భవాని.
అలా ఎన్నాళ్ళు అంటూ గుమ్మంలోంచి మాటలు వినిపించేసరికి అందరూ అటువైపు చూస్తారు. అలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండమంటారు అంటూ లోపలికి వస్తాడు శ్రీనివాస్. భర్త లేకపోయినా కూతుర్ని అత్తింట్లో ఉంచినందుకు మా బంధువులు మాకు గడ్డి పెడుతున్నారు మా పిల్లని నాతో పంపించేయండి అంటాడు శ్రీనివాస్. భర్త లేకపోయినా గౌరవంగా అత్తింట్లోనే ఉంది కదా అయినా ఈ ఇంటి పెద్ద కోడల్ని అంత సులువుగా పంపించలేము.
రేపటి రోజున ఆదర్శ్ వచ్చి నా భార్య ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అంటుంది భవాని. లేని బిడ్డ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఉన్న నా బిడ్డ గురించి నేను ఆలోచించాలి కదా. ఇప్పటివరకు వెయిట్ చేసింది చాలు ఇక మా అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్లి ఈ పెళ్లి చెల్లదు అంటూ కోర్టులో కేసు వేస్తాను. ఆదర్శ్ ఎలాగో లేడు కాబట్టి విడాకులు త్వరగానే వస్తాయి మా అమ్మాయికి మళ్లీ పెళ్లి చేస్తాను అంటాడు శ్రీనివాస్.
అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కన్యదానం చేసిన తర్వాత తన బాధ్యతలన్నీ మావి ఇక రాడు అనుకున్నప్పుడు మేమే మా కోడలికి పెళ్లి చేస్తాము అంటుంది భవాని. అయినా మా ఇంట్లో మీ అమ్మాయి సుఖంగా ఉంది కాబట్టే ఇంకా మా ఇంట్లో ఉంది ఇక్కడ ఇబ్బందిగా ఉందని తనని చెప్పమనండి అలా చెప్తే ఇప్పుడే మీ అమ్మాయిని తీసుకెళ్ళి పోవచ్చు అంటుంది రేవతి.
ఆడపిల్ల తండ్రిగా ఆయన భయాలు ఆయనకి ఉంటాయి కానీ ఇప్పటికిప్పుడు తీసుకువెళ్లిపోతాను అంటే కుదరదు కాస్త సమయం కావాలి అంటుంది భవాని. ఎంత సమయం కావాలో మీరే చెప్పండి అప్పటివరకు మీ గుమ్మం వైపు కూడా రాను అంటాడు శ్రీనివాస్. అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను వచ్చిన వెంటనే మీకు కబురు పెడతాను అప్పుడు ముకుంద అభిప్రాయం తెలుసుకొని ఆమెకి ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా చేద్దాము అంటుంది భవాని. కూతురికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శ్రీనివాస్.
ఏడుస్తున్న ముకుందని దగ్గరికి తీసుకొని నీకు ఎప్పటికీ అన్యాయం జరగదు అంటూ ధైర్యం చెబుతుంది భవాని. అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత తన గదిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ సీరియస్ గా ఉంటాడు మురారి. అంతలోనే వెనకనుంచి వచ్చి అరుస్తుంది కృష్ణ.ఒక్కసారిగా తుళ్ళిపడిన మురారి ఏం చేస్తున్నావు ఇంట్లో జరిగిందానికి నువ్వు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా అంటూ కోప్పడతాడు.
తరువాయి భాగంలో మన ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు తీసేశావు అంటూ మురారిని నిలదీస్తుంది ముకుంద. నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి నాన్సెన్స్ అంటాడు మురారి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు అంటూ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటూ చాలెంజ్ చేస్తుంది ముకుంద. ఆ మాటలు విన్న ప్రసాద్ కొడుకు షాక్ అవుతాడు వెళ్లి రేవతిని తీసుకొచ్చి ముకుంద, మురారిలని చూపిస్తాడు. వాళ్ళ మాటలు విన్న రేవతి కూడా షాక్ అవుతుంది.