Krishna Mukunda Murari: కృష్ణ ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్న మురారి.. నిజం చెప్పేశానంటూ షాకిచ్చిన ముకుంద?
Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తన భర్త మనసులో మరొక ఆడది ఉందని తెలుసుకుని బాధపడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో డైరీ చదువుతూ ఉంటాడు మురారి. కృష్ణని అందరూ టింగరి పిల్ల అంటారు కానీ నాకు ఆ తింగరి తనమే నచ్చుతుంది. తనలో ఇంకా పసిపిల్ల మనస్తత్వం పోలేదు. మరో పేజీలో మధుకర్ రీల్స్ కోసం కృష్ణ డైలాగ్స్ చెప్పింది కానీ ఆమె తన మనసుని ఆవిష్కరించిందేమో అని అనిపించింది అని డైరీలో ఉన్నది చదువుతాడు మురారి. అదే నిజమైతే బాగున్ను అనుకుంటాడు. అదే సమయంలో కృష్ణ బాధతో వాకిట్లోకి వస్తుంది.
అప్పుడే వర్షం ప్రారంభమవటంతో పూర్తిగా తడిసిపోతుంది. నేను మొదటిసారి ప్రేమలో పడ్డాను కానీ నా ప్రేమకి ఆయుష్షు తక్కువ. కొన్ని గంటల్లోనే చచ్చిపోయింది అంటూ ఏడుస్తుంది కృష్ణ. మళ్లీ నేను అనాధని అయిపోయాను నాకు ఈ లోకంలో ఎవరు లేరు ఏసిపి సర్.నీ మనసులో ఇంకొక అమ్మాయికి ఇస్తాను ఉందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను ఈ ఇంట్లో ఏ హక్కుతో ఉండాలి. ఒప్పందం ప్రకారం గడువు తీరిన వెంటనే వెళ్లి పోవాలా అంటూ ఏడుస్తుంది.
నా అనేవాళ్ళు లేని లోకంలో అనాధగా మిగిలిపోవాలా అసలు ఏం చేయాలి అంటూ బాధపడుతుంది. ఇంతలో మురారి, కృష్ణని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు. మీరు వెళ్ళండి ఏసీపీ సర్. నేను ఈ వర్షంలో తడవాలి అప్పుడే నా మనసు తేలిక అవుతుంది అప్పుడు లోపలికి వస్తాను అంటుంది కృష్ణ. అసలు ఏమైంది అంటాడు మురారి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు నా దగ్గరే సమాధానం తెలియని ప్రశ్నలు బోలెడు ఉన్నాయి అంటుంది కృష్ణ.
నాకు తెలియకుండా నేను నిన్ను ఏమైనా బాధ పెట్టానా అంటాడు మురారి. అయ్యుండవచ్చు ఎందుకంటే మీరు పోలీస్ కాదు పెద్ద దొంగ అంటుంది కృష్ణ. ఒక్కసారిగా షాకైన మురారి ఏమంటున్నావు అంటూ అయోమయంగా అడుగుతాడు. మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోండి అంటుంది కృష్ణ. నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాను అంటాడు మురారి. ఆ మాటలకి ఏడుస్తుంది కృష్ణ. ఎందుకిలా చేస్తున్నావు నాకు భయం వేస్తుంది అంటాడు మురారి.
నాకు కూడా మొదటి సారి భయమేస్తుంది. ఒంటరిగా ఈ చీకట్లో ఈ క్రూర మృగాల మధ్య ఒంటరిగా నడవాలంటే భయం వేస్తుంది అంటూ ఏడుస్తుంది. కృష్ణని దగ్గరికి తీసుకొని నువ్వు ఒంటరి దానివి ఎందుకు అవుతావు. ఆ క్రూర మృగాల మధ్య నుంచి కాపాడటానికి నేను ఉన్నాను అని ధైర్యం చెప్తాడు మురారి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఏసీపీ సార్ అని చెప్పటంతో ఆమెని జాగ్రత్తగా తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు మురారి.
ఆ తరువాత డైరీ రాసుకుంటూ కృష్ణ మనసులో నేను ఉన్నాను అని చెప్తుందేమో అని ఎదురు చూశాను కానీ తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది. ఏం జరుగుతుందో నా ఊహకు కూడా అందడం లేదు. ఏది ఏమైనా కృష్ణ నాకు దూరం కాకూడదు అని రాసుకుంటాడు మురారి. సీన్ కట్ చేస్తే దేవుడికి దండం పెట్టుకుంటూ నేను ఏసీపి సర్ కి భార్యగా ఉండాలా లేకపోతే ఏమి జరగనట్టు ఈ ఇంటి కోడలుగా ఉండాలా ఈ సమస్యకి పరిష్కారం చూపించు. ఏసీపి సర్ ప్రేమించిన అమ్మాయి ఎవరో నాకు చూపించు అని వేడుకుంటుంది కృష్ణ.
కృష్ణని అలా చూసిన ముకుంద ఎందుకు కృష్ణ డల్ గా ఉంది అని మనసులో అనుకుంటుంది. మీ సమస్య ఏంటి ఎందుకు డల్ గాఉన్నావు. నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అంటుంది ముకుంద. ముందు మీ సమస్యకి నువ్వు పరిష్కారం వెతుక్కో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. ఈ తింగరి పిల్ల ఏదో దాచిపెడుతుంది అనుకుంటుంది ముకుంద. మరోవైపు మురడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది కృష్ణ.
రాత్రి ఎందుకలా చేసావో ఇప్పుడైనా చెప్పు అంటాడు మురారి. వర్షంలో కాగితం పడవలు వదలాలి అనిపించింది అందుకే అంటుంది కృష్ణ. నాకు నీలో ఈ తింగరి తనమే నచ్చుతుంది అంటాడు మురారి. నా తింగరితనం నచ్చుతుంది కానీ నా మనసు నచ్చలేదన్నమాట అనుకుంటుంది కృష్ణ. తరువాయి భాగంలో రేవతి అత్తయ్యకి మన ప్రేమ గురించి చెప్పేసాను అని చెప్పి మురారికి షాక్ ఇస్తుంది ముకుంద.