‘ముఫాసా’ గర్జన : ‘విడుదల 2’ని మట్టి కరిపించిన లయన్ కింగ్
విజయ్ సేతుపతి నటించిన 'విడుతలై 2' చిత్రం కంటే 'ముఫాసా: ది లయన్ కింగ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించింది. ముఫాసా చిత్రం పిల్లలను బాగా ఆకట్టుకుంది, క్రిస్మస్ సెలవులు కూడా దాని విజయానికి దోహదపడ్డాయి.
Mufasa: The Lion King, Viduthalai 2
భాక్సాఫీస్ దగ్గర కొన్ని సార్లు ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూంటాయి. ఊహించని విషయాలు ముందుకు వస్తూంటాయి. వెట్రిమారన్ వంటి దర్శకుడు,విజయ్ సేతపతి వంటి స్టార్ నటుడు చేసిన విడుదల 2 చిత్రాన్ని ‘ముఫాసా: ది లయన్ కింగ్’ దాటేయటం చిత్రమే కదా. ఈ రెండు సినిమాలు క్రిందటి వారం రిలీజ్ అయ్యాయి. అందరూ డబ్బింగ్ సినిమా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ని మించి స్టైయిట్ చిత్రం విడుదల 2 విజయకేతనం ఎగరేస్తుందని భావించారు. అయితే రివర్స్ లో జరిగింది.
2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ (Mufasa The Lion King ) రూపొందింది. ఇది సింబా తండ్రి ‘ముఫాసా’ కథ. ‘ముఫాసా’ వంటి పవర్ఫుల్ పాత్రకి స్టార్స్ తో డబ్బింగ్ చెప్పడంతో దీనిపై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 20 న భారీ పోటీలో రిలీజ్ అయిన ‘ముఫాసా’ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి..తెలుగులోనూ ‘ముఫాసా’ సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది.
ఇక ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తమిళనాడులో అద్భుతమైన బాక్సాఫీస్ పరుగు తీస్తోంది. విజయ్ సేతుపతి నటించిన విడుతలై 2 తో క్లాష్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రారంభంలో యావరేజ్ రెస్పాన్స్‌తో ప్రారంభమైంది. కానీ వారం రోజులలో ఊహించని విధంగా మంచి హోల్డ్‌తో పెద్ద జంప్‌ను చూసింది. క్రిస్మస్ సెలవుదినం కూడా ఈ చిత్రానికి బాగా సహాయపడింది. న్యూ ఇయర్ హాలిడే అడ్వాంటేజ్‌తో మరో వారాంతం వరకు ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నారు.
విడుతలై 2 తమిళనాడులో కూడా 7.5 కోట్లకు పైగా గ్రాస్‌తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇది ఫస్ట్ వీకెండ్ లో కూడా డీసెంట్‌గా జరిగింది, అయితే ప్రేక్షకులు ముఫాసా: ది లయన్ కింగ్‌ని ఎంచుకోవడంతో వారం రోజుల్లో పెద్ద డ్రాప్‌ను కనపడింది. సోమవారం నుండి, ముఫాసా: ది లయన్ కింగ్ విడుతలై 2పై ఆధిక్యాన్ని ప్రదర్శించటం మొదలెట్టాడు, క్రిస్మస్ దానిని మరింత ముందుకు తీసుకువెళ్లింది.
విడుతలై 2 పోటీలో షాకింగ్‌గా గా తమిళనాడులో 50 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా దాటడం కష్టం అని ట్రేడ్ అంటోంది. ముఫాసా: లయన్ కింగ్ ఫైనల్ రన్‌లో ఒక్క తమిళనాడులోనే 50 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ చిత్రం బాగా నచ్చటంతో కలిసి వచ్చింది. ‘ది లయన్ కింగ్’.. నాలుగేళ్ల కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దానికి ప్రీక్వెల్‌గా రూపొందిన తాజా చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King). పెద్దగా ఈ సినిమాకి ప్రమోషన్ లేకపోయినా.. బాగా వర్కవుట్ అవుతోంది.
‘ముఫాసా’ (Mufasa The Lion King) చిత్రం తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే 4 రోజుల్లో ఈ సినిమా రూ.3.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కేవలం తెలుగు వెర్షన్ తోనే ఇంత మొత్తం రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. మహేష్ ని వెండితెర మీద మరో మూడేళ్ళ పాటు చూసే అవకాశం లేనందున, ఆయన అభిమానులు ఈ సినిమా విడుదలకి భారీ స్థాయిలో సెలెబ్రేషన్స్ చేసుకోవాలని అనుకున్నారు.ప్లానింగ్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే సుదర్శన్ థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ అదిరిపోయే రేంజ్ లో సెలెబ్రేషన్స్ చేసారు.