బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్, మాస్ హీరో జోడీగా మరాఠి భామ
ఒక్క సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. ఇక వరుసగా ఆఫర్లు అంది పుచ్చుకుంటూ.. వస్తోంది బ్యూటీ. తాజాగా ఆమె మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

Photo Courtesy: Instagram
సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచింది మృణాల్ ఠాకూర్. ఈసినిమాలో సీతగా అలరించిన ఈ బ్యూటీ.. ఆతరువాత తన అసలు హాట్ హాట్ రూపాన్ని బయట పెట్టింది. సినిమాల కోసం ఏం చేయడానికైన రెడీ..ఎంత బోల్డ్ గా అయినా కనిపిస్తానంటోంది మృణాల్.
అయితే సీతారామం సినిమా తరువాత ఎన్నో సినిమాలు.. ఎంతో మంది నిర్మాతలు తన గుమ్మం తొక్కినా.. తొందరపడలేదు బ్యూటీ. ఆలోచించి అడుగులువేస్తోంది. తన కెరీర్ కు బూస్టప్ ఇచ్చి.. టాలీవుడ్ లో తనను నిలబెట్టే సినిమాలు మాత్రమే ఒప్పుకుంటుంది మృణాల్. పాయల్ రాజ్ పుత్ లాంటి హీరోయిన్లు చేసిన పొరపాటు చేయకుండా జాగ్రత్త పడుతోంది.
Photo Courtesy: Instagram
ఈక్రమంలోనే సీతారామం తరువాత కాస్త గ్యాప్ ఇచ్చిన బ్యూటీ.. నాని జోడీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం నాని30లో నటిస్తోంది. ఈమూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇక ఆతరువాత కూడా చాలా ఆఫర్లను పక్కన పెట్టిన మృణాల్.. విజయ్ దేవరకొండ జోడీగా నటించనుంది. రౌడీ హీరోతో మృణాల్ కాంబినేషన్ అంటే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడొచ్చు..
Photo Courtesy: Instagram
విజయ్ దేవరకొండ జోడీగా నటించనుంది. రౌడీ హీరోతో మృణాల్ కాంబినేషన్ అంటే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడొచ్చు..
ఇక తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ అమ్మడు మరో పెద్ద సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. రవితేజ హీరోగాి గోపీంచద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా రూపొందబోతోంది. గతంలె వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. మరో సినిమాకు ప్లాన్ చేశారీ టీమ్.
వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో హ్యాట్రిక్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే... ఇక వీరి కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమా ఇది కావడంతో... ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుండగా.. ఈసినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారని న్యూస్ వినిపించిగా.. మళ్ళీ ఈనిర్ణయంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.
Mrunal thakur
పూజా హెగ్డేను మళ్ళీ తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం మాస్ మహారాజ్ జోడీగా మృణాల్ ఠాకూర్ పేరును దాదాపు ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. పవర్‌పుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.