MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: శౌర్యని చూసి మోనిత షాక్.. కార్తీక్ కి గతం గుర్తు చేసిన వంటలక్క!

Karthika Deepam: శౌర్యని చూసి మోనిత షాక్.. కార్తీక్ కి గతం గుర్తు చేసిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

4 Min read
Author : Navya G
| Updated : Sep 27 2022, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..మోనిత,మన ఇంటి ముందు కార్ ని ఆపుతుంది. కారు దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు డిక్కి నుంచి ఎవరో దిగినట్టు అనిపించి వెనక్కి వచ్చి చూసేసరికి సౌర్య వుంటుంది.శౌర్య ను చూసి ఆశ్చర్యపోతుంది మొనిత.  అప్పుడు శౌర్య, మోనితని చూసి, మీ కార్ అని తెలీక వెనకాతల ఎక్కాను లేకపోతే ముందే కూర్చునేదాన్ని అని అనగా మోనిత ఆశ్చర్యపోయి, ఇది కావాలని ఫాలో అయిందా అని అనుకుంటుంది. నువ్వెందుకు అమ్మ ఇక్కడున్నావు? నానమ్మ వాళ్ళ దగ్గర లేవా అని  అడగగా, అమ్మానాన్నలు బతికే ఉంటారు అన్న చిన్న ఆశతో ఈ ఊర్లోనే తిరుగుతున్నాను ఆంటీ.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఎప్పటికైనా అమ్మానాన్నలు కనబడితే వాళ్లతో పాటు ఇంటికి వెళ్దామని ఉన్నాను అని అంటుంది. అప్పుడు మోనిత, వినడానికి బాధగా ఉన్నా మీ అమ్మానాన్నలు ఇంక లేరమ్మ, నేను ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నాను కానీ నమ్మక తప్పదు అని అనగా, నేను వెతుకుదాము అని చిన్న ఆశ వున్న ప్రతిసారి ఎవరో ఒకరు యాక్సిడెంట్ జరిగింది కదా చనిపోయి ఉంటారు అని అంటున్నారు అని సౌర్య అంటుంది.అప్పుడు మోనిత, యాక్సిడెంట్ జరిగిందని చనిపోవడం కాదమ్మా నా చేతులారా నేనే ఆ డెడ్ బాడీస్ కి పోస్టుమార్టం చేశాను.
 

38

 వాళ్లు ఇంక లేరు, రారు అని ఏడుస్తూ నటించగా శౌర్య మనసులో, మోనిత ఆంటీ అబద్ధం ఎందుకు చెప్తారు? నిజంగా అమ్మానాన్నలు ఇంకా లేరా అని మోనిత దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. అప్పుడు మోనిత మనసులో, లేకపోతే నీకు నిజం ఎలా చెప్తానే, మీ అమ్మ నన్ను పిక్కని తింటుంది చాలదా నువ్వు కూడా తోడవ్వాల!అవునూ దీప ఇక్కడే ఉందా అని చూసేసరికి దీపా ఇంటికి తాళం వేసి ఉంటుంది. హమ్మయ్య అది లేదు ఇప్పుడు కార్తీక్ చూసిన పడలేదు ఇది కార్తీక్ ని ఇది చూడకుండా ఉంటే చాలు అని అనుకొని ఇంక నీ సమయం ఇక్కడ వృధా చేసుకోవడం మంచిది కాదమ్మా.
 

48

రాని వాళ్ల గురించి ఎదురు చూసుకుసుకుంటూ నీ వాళ్ళని నువ్వు దూరం చేసుకోలేవు కనుక హైదరాబాద్ పంపిస్తాను అమ్మ బస్సు ఎక్కిస్తాను వెళ్ళిపో అని అంటుంది మోనిత. అప్పుడు శౌర్య, లేదాంటీ నాకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి వెళ్తాను అని సౌర్య అనగా మోనిత అక్కడికి దింపుతుంది. ఆ తర్వాత సీన్లో కార్తీక్, ఈ నాటకం ఎప్పుడు మొదలవుతాది నేను వెళ్ళిపోతాను అని అంటాడు.కానీ దీప వాళ్ళ అన్నయ్య బలవంతం మీద కూర్చుంటాడు. వెనకాతల ఆడవాళ్లు మాట్లాడుకుంటూ బ్యానర్ చూసి, కార్తీకదీపం అంటే కార్తీక్, దీపల ప్రేమ కదా అయ్యుంటుందా!
 

58

 కింద ఇది ఒక భార్య జీవితంలో జరిగిన అసలైన కదా అని రాసింది అని అనగా కార్తీక్ కోపంతో దీప దగ్గరికి వెళ్లి ,కార్తీకదీపం అంటే ఏంటి కార్తీక్, దీప నా!కింద భార్య కదా అన్నావు అంటే నువ్వు నా భార్యవని ఇప్పటివరకు నా వెనకాతలు తిరిగావు ఇప్పుడు ఊరందరికీ తెలిసేలా చేయాలా అని అంటాడు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య, కార్తీక్ అంటే మీరు కాదు బాబు దీప వాళ్ళ భర్త పేరు కూడా కార్తీక్ ఇది మీ గురించి ఎందుకు అనుకుంటున్నారు దీప తన భర్త విషయంలో జరిగిన కథ ఇది దయచేసి కూర్చోండి అని కూర్చోబెడతాడు.ఆ తర్వాత సీన్లో సౌందర్య ఆనందరావు, హిమ తిరిగి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు సౌందర్య, హిమతో,దారిలో రెస్టారెంట్ ఉంది ఆపమంటావా! 

68

ఈమధ్య ఇది, ఆ రౌడీ కలిసి ప్రసాదాలు తింటూ బతుకుతున్నారటండి అని అంటుంది .అప్పుడు ఆనందరావు హిమతో,దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది అమ్మ అని అనగా, శౌర్య ఇంక మనతో తిరిగి రాదు మన ఆశలన్నీ నిరాశలే అని అంటుంది. అప్పుడు సౌందర్య, కదా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు వెళ్లి నీ చదువు మీద దృష్టి పెట్టు నేను సౌర్యని ఎలాగైనా ఇంటికి తెప్పించే ప్రయత్నాలు చేస్తాను. నేను నీకు హామీ ఇస్తున్నాను ఎప్పటికైనా శౌర్య ఇంటికి తిరిగి వస్తుంది అని అంటుంది. ఆ తర్వాత సీన్లో కార్తీక దీపం నాటకం మొదలవుతుంది. అప్పుడు దీప శివునికి పూజ చేస్తూ కార్తీకదీపం పాట పాడుతుంది.

78

అప్పటికే కార్తీక్ ఇబ్బందిగా వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ దీప వాళ్ళ అన్నయ్య మనసులో, త్వరగా నాటకం అయితే బాగుండు లేకపోతే సగంలోనే కార్తీక్ వెళ్లిపోతాడేమో అని భయం వేస్తుంది అని అంటాడు. ఇంతలో నాటకం మొదలవుతుంది. నాటకం మొదలవుగానే దీప వాళ్ళ అమ్మ దీప ని, నీకు నీ జాతకానికి ఇంక నీకు ఎప్పటికీ పెళ్లి అవ్వదు.నీ నల్ల మొఖాన్ని ఎవడు చేసుకుంటాడే అని తిడుతుంది.అప్పుడు దీప వాళ్ళ నాన్నకి కార్తీక్ ఫోన్ చేసి, నాకు మీ కూతురు అంటే ఇష్టం నేను మీ అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ నాకు పిల్లలు పుట్టరు ఈ విషయం మీ అమ్మాయికి చెప్పండి నచ్చితేనే పెళ్లి అని అనగా దీపకు నచ్చి పెళ్లి చేసుకుంటుంది. 

88

ఆ పెళ్లిని సౌందర్య అడ్డుకున్న సరే కార్తీక్, దీప మీద సౌందర్య చేయపడనివ్వకుండా కాపాడుతాడు. వాళ్ళందర్నీ ఎదిరించి సమస్యలన్నీ అయిన తర్వాత వాళ్లు హనీమూన్ కి వెళ్ళగా అక్కడ విహారి అనే ఒక కవి పరిచయం అవుతాడు. హనీమూన్ అయిపోయిన తర్వాత దీప గర్భవతి అని తెలిసినప్పుడు కార్తీక్ ఆశ్చర్యపోతాడు.అప్పుడు మోనిత,ఈ పని విహారీ వలన అయ్యుంటుందా అని అనగా కార్తీక్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు కార్తీక్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఈ బిడ్డకి కారణం నేను కాదు. ఈ బిడ్డ నా వాడు కాదు అని అంటాడు. అప్పుడు దీప కోపంతో, నన్ను కాదనుకున్నారు ఇంత నీచమైన స్థితికి దిగజారుతారని నేను అనుకోలేదు. నాకు ఇంట్లో విలువ లేనప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఉండను అని అంటుంది. అప్పటికే కార్తిక్ కి ఏదో గుర్తొస్తున్నట్టు స్పష్టమైన మోకాలు కనిపిస్తూ తలనొప్పిగా ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హాయ్ చెప్పడమే తప్పైందా? ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి వద్దని పారిపోయిన జంట కథ
Recommended image2
Rajinikanth: అతని పేరు చెప్పగానే భయంతో వణికిపోయిన రజినీకాంత్, చేతిలో సిగరెట్ పడేసి ఏం చేశాడంటే? తనికెళ్ల భరణి చెప్పిన సీక్రెట్..
Recommended image3
Richest Indian Actor: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? టాప్ 5 లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved