- Home
- Entertainment
- Karthika Deepam: మోనిత కొత్త ప్లాన్.. నా భార్య జోలికి వస్తే చంపేస్తానంటూ వంటలక్కకు డాక్టర్ బాబు వార్నింగ్?
Karthika Deepam: మోనిత కొత్త ప్లాన్.. నా భార్య జోలికి వస్తే చంపేస్తానంటూ వంటలక్కకు డాక్టర్ బాబు వార్నింగ్?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప దేవుడితో ఇప్పుడు వరకు బతకడం కోసం వంటలు చేశాను, ఇప్పుడు నా ప్రేమను దక్కించుకోవడం కోసం చేయాల్సి వస్తుంది అని అనుకుంటుంది. అప్పుడు తనకి డాక్టర్ వాళ్ళ అమ్మగారు, "ఇదే మంచి సమయం అనుకొని మోనిత పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేస్తుందేమో" అన్న మాటలు గుర్తొచ్చి మోనిత మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నా ఉండొచ్చు దాన్ని ఎలాగైనా జరగకుండా ఆపాలి అని అనుకుంటుంది దీప.
ఆ తర్వాత సీన్లో మో కార్తీక్ దగ్గరికి వెళ్లి కార్తీక్ బయటికి వెళ్ళొచ్చు కదా కొద్దిసేపు అని అంటుంది. దానికి కార్తీక్ ఇది నువ్వేనా ఎప్పుడూ ఇంట్లో ఉండి ఒకేసారి స్వేచ్ఛ చేస్తే నాకు అనుమానం వస్తుంది అని అంటాడు కార్తీక్. అప్పుడు సరే కానీ కార్తీక్ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి.మనం బొంబాయి బయలుదేరుతున్నాము అని అంటుంది మో. ఎందుకు అని కార్తీక్ అడగగా మన ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కార్తీక్ అని అనగా అప్పుడు కార్తీక్ మరి నాకు తెలుగు ఎందుకు ఇంత బాగా వచ్చు అని అడుగుతాడు.
అప్పుడు మొనిత మీ తాత నాన్నలు తెలుగులో కూడా పండితులే తెలుగు వాళ్ళమే కాని అక్కడ సెటిల్ అయ్యాము అని అంటుంది మోనిత. సర్లే కాని నాకు ఆకలేస్తుంది అని అంటాడు కార్తీక్. ఈ రెండు రోజులు బయట ఉన్న వంతలక్క దగ్గర నుండి తెప్పించుకుందాము అని మోనిత అంటుంది. అప్పుడు మోనిత దీప దగ్గరికి వెళ్లి ఏం దీపం కార్తీక్ నుంచి నన్ను దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉన్నావు కదా! నేను ఏమీ భయపడను అని అంటుంది. దానికి దీప నువ్వు ఏం భయపడనట్లు అయితే నిన్ను నువ్వు ఎందుకు అంత వనికావు ఎక్కడ డాక్టర్ బాబుకి నా బిర్యాని తిని గతం గుర్తొస్తుందా అని.
నువ్వు ఇలా భయపడుతున్నంతకాలం నా గెలుపు మీద నాకు ఎలాంటి సందేహము లేదు అని అంటుంది దీప. దానికి మోనిత మనసులో, రేపే ముంబై వెళ్ళిపోతున్నావు కదా అప్పటివరకు నువ్వేం చేయగలవు అని అనుకోని సర్లే కార్తీక్ కి నీవంటలే కావాలట తెమ్మన్నాడు ఉప్మా మాత్రం చేయొద్దు అని అంటుంది మోనిత. ఉప్మా ఎందుకు చేయకూడదు నేను అదే చేస్తా అని చెప్తుంది దీప. ఆ తర్వాత సీన్లో వారణాసి సౌర్య ఆటోలో వెళతాడు.ఎక్కడికి వెళ్తున్నాం వారణాసి అని అడుగుతుంది శౌర్య హాస్పిటల్ లో ఈ లగేజ్ ఇవ్వాలి అమ్మ తర్వాత అక్క గురించి వెతుకుదాం అని వారణాసి అంటాడు.
వద్దులే వారణాసి మనకు తెలిసిన చోట్ల కాదు తెలియని చోటలు కూడా వెతకాలి.వాళ్లు సరిగ్గా ఏ ప్రదేశంలో ఉన్నారో మనకు తెలియదు కదా ఏమో హాస్పిటల్ దగ్గరైన కనిపించ వచ్చి కదా అంటుంది శౌర్య. అప్పుడు వారణాసి మనసులో వాళ్ళు లేరని నీకు ఎలా చెప్తే అర్థమవుతుందని అనుకుంటాడు.తర్వాత సీన్ లో దీప, దగ్గరికి కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తుంది.అప్పుడు కార్తీక్ వంటలక్క అని చెప్పి చూశావా నాకు నీ పేరు బానే గుర్తుంది అని అంటాడు. కానీ నన్ను హిమా వంటలక్క అని పిలుస్తుంది మీరు దీప అని పిలండి చాలు అని అనగా సరే వచ్చేసారి నుంచి అలాగే పిలుస్తాను కనీసం ఏదో ఒక పేరైనా గుర్తుంచుకున్నాను కదా అని అంటాడు కార్తీక్.
అప్పుడు దీప మోనిత ని డాక్టర్ అమ్మ అనగా మోనితకి చాలా కోపం వస్తుంది ఎందుకలా పిలుస్తున్నావు నాకు అది నచ్చదు అని అంటుంది. దానికి కార్తిక్ పోనీలే డాక్టర్ చదువుకుండానే డాక్టర్ పిలిపించుకుంటున్నాను కదా అని అంటాడు. ఇంతకీ వంటలు ఏంటి అని కార్తీక్ అడగగా మీకోసం జీడిపప్పు ఉప్మా చేశాను డాక్టర్ బాబు అని అంటుంది దీప. కార్తిక్ కి ఏదో గుర్తొచ్చినట్టు ఆలోచిస్తాడు. మోనిత భయపడుతుంది అంతలో నాకు వడ్డించు అని మోనిత అనగా నీకు ఇడ్లీలు తెచ్చాను తిను అని అంటుంది.మోనిత వాటిని తిని వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు దీప,ఇది కచ్చితంగా కావాలనే కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నది, ఇప్పటివరకు బానే ఉంది కదా ఏం చేయబోతుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!