- Home
- Entertainment
- కలిసిన కాసేపటికే కార్డిచ్చి రమ్మన్నాడు.. వెళ్తే వెరేలా ఉండేది.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన `తాజ్ మహల్` నటి
కలిసిన కాసేపటికే కార్డిచ్చి రమ్మన్నాడు.. వెళ్తే వెరేలా ఉండేది.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన `తాజ్ మహల్` నటి
సీనియర్ నటి మోనికా బేడీ తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. దర్శకుడు రాకేష్ రోషన్.. తనని కలవగానే కార్డిచ్చి రమ్మన్నాడట. అప్పుడు వెళ్లి ఉంటే తన కెరీర్ వేరేలా ఉండేదని చెప్పింది మోనికా బేడి.

`తాజ్ మహల్` సినిమాతో తెలుగుకి పరిచయమైంది మోనికా బేడి. ఆమె నాలుగైదు సినిమాలు తెలుగులో నటించింది. కానీ హీరోయిన్‌గా సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా ఓ మోస్తారు హీరోయిన్‌గా రాణించింది. తెలుగు, కన్నడ, హిందీ, పంజాబీ, బెంగాలీ, నేపాలి చిత్రాలు సైతం చేసింది. కానీ ఈ అమ్మడికి స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుందీ భామ.
కానీ తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. దర్శకుడు రాకేష్ రోషన్.. తనని కలవగానే కార్డిచ్చి రమ్మన్నాడట. అప్పుడు వెళ్లి ఉంటే తన కెరీర్ వేరేలా ఉండేదని చెప్పింది మోనికా బేడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో మోనికా బేడీ చెబుతూ, దర్శకుడు సుభాష్ ఘైతోపాటు రాకేష్ రోషన్.. హోలీ పార్టీలో తన వద్దకు వచ్చారట. అయితే రాకేష్ రోషన్ నటుడనే విషయం తెలుసు, కానీ దర్శక, నిర్మాత అని తెలియదు. ఆయన వచ్చి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి రేపు ఓ సారి వచ్చి కలవమని చెప్పాడట.
అయితే అది తనకు అర్థం కాలేదని, తను రమ్మన్నదాంట్లో అర్థం వేరే అనుకుని అనుమానించి ఆ కార్డుని చించేసిందట. కొన్ని నెలల తర్వాత తన మేనేజర్.. ఎందుకు రాకేష్‌ని కలవడలేదని అడిగినట్టు, అతను `కరణ్ అర్జున్` సినిమా తీస్తున్నాడని, అందులో హీరోయిన్‌గా నిన్నే అనుకున్నాడని తెలిపారు. సల్మాన్ సరసన మమత కులకర్ణి నటిస్తుందని, ఆ రోల్ నువ్వు చేయాల్సిందని చెప్పాడట. దీంతో తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని చెప్పింది. అప్పటికిగానీ తాను చేసిన తప్పు అర్థం కాలేదని వెల్లడించింది మోనికా బేడి. ఆ రోజు వెళ్లి ఉంటే తన లైఫ్ మరోలా ఉండేదని చెబుతూ ఆవేదన చెందింది.
మరో ఆఫర్ గురించి చెబుతూ, దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ కూడా తన కొడుకుతో తీస్తున్న సినిమాకి తనని సంప్రదించారని, అప్పుడు చాలా సంతోషించి, వెంటనే ఓకే చేసిందట. కానీ ఆ సినిమా పూర్తయ్యేంత వరకు మరే సినిమా చేయకూడదని కండీషన్స్ పెట్టారు. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేయించుకున్నారని, కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదని, దీంతో ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నట్టు చెప్పింది మోనికా బేడీ.
తెలుగులో ఈ బ్యూటీ `తాజ్ మహల్`తోపాటు `సోగ్గాడి పెళ్లాం`, `సర్కస్ సత్తిపండు`, `శివయ్య`, `చూడాలని వుంది`, `స్పీడ్ డాన్సర్` వంటి చిత్రాల్లో నటించింది. హిందీలో `జంజీర్`, `జానమ్ సమ్జా కరో`, `జోడీ నెం 1` వంటి సినిమాల్లో నటించింది. `బిగ్ బాస్ 2` సీజన్లోనూ మెరిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంది. 1999 నుంచి ఇండియన్ గ్యాంగ్‌స్టర్, టెర్రరిస్ట్ అబు సలీమ్‌తో ప్రేమయాణం సాగించింది. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ కాబడింది. ఇది ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 2007 నుంచి ఆయనకు దూరంగా ఉంటూ వచ్చింది.