MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మళ్ళీ ఆ డైరక్టర్ నే చిరు నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ఓకే చేసారా?.. మెగాస్టార్‌ ప్లానేంటి?

మళ్ళీ ఆ డైరక్టర్ నే చిరు నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ఓకే చేసారా?.. మెగాస్టార్‌ ప్లానేంటి?

విశ్వంభర  సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. చిరంజీవి నెక్ట్స్ మూవీ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాతో పాటే చిరు తనయ సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా వుంటుందని ప్రకటించారు.

3 Min read
Author : Surya Prakash
Published : May 20 2024, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెగాస్టార్ చిరంజీవి ఈ వయస్సులోనూ వరస ప్రాజెక్టులతో పరుగెడుతున్నారు.  గత ఏడాది వాల్తేరువీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండింటిలో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక భోళాశంకర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నెక్ట్స్ సినిమా అప్డేట్ వచ్చింది. దాదాపు ప్రాజెక్టు ఓకే అయ్యిపోయినట్లే అని తెలుస్తోంది. ఎవరా దర్శకుడు. 

27

చిరంజీవి  సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక సినిమాలు ఆచితూచి చేస్తున్నారు. గత ఏడాది భోళా శంకర్ రిజల్ట్  దారుణంగా ఉండటంతో ఆయన మరింత జాగ్రత్త పడాలనే డెసిషన్ తీసుకున్నారు.  మోహర్ రమేష్ కు అవకాశం ఇచ్చినా కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ.. ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో మెగాస్టార్ తన తదుపరి సినిమాలతో ఫోకస్ పెట్టాడు.

37

ఈ క్రమంలోనే చాలా కథలు విన్నా చివరకు కళ్యాణ్ రామ్ తో బింబిసార వంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్టతో  సినిమాని ఓకే చేసి ముందుకు వెళ్లారు. విశ్వంభర టైటిల్ తో  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. విశ్వంభరగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ముగ్గురు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక అధికారికంగా ఎవరు అనేది చెప్పలేదు కానీ... పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. 

47

అదే సమయంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. చిరంజీవి నెక్ట్స్ మూవీ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాతో పాటే చిరు తనయ సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా వుంటుందని ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణని (Soggade Chinni Nayana) అనుకున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో గానీ ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇవ్వలేదు. ఆ తర్వాత  మారుతి సినిమా ఓకే అయినట్లు కథనాలు వచ్చాయి. అయితే అందులోనూ నిజం లేదని తేలిపోయింది. అయితే ఇప్పుడు మరో దర్శకుడు సీన్ లోకి వచ్చారు. 

57

ఆ డైరక్టర్ మరెవరో కాదు మోహన్ రాజా. ఈ దర్శకుడు రెండేళ్ల క్రితం చిరంజీవితో గాడ్ ఫాధర్ చిత్రం చేసారు. ఈ దర్శకుడుతో చిరంజీవి సినిమా చేయటానికి ఉత్సాహంగా ఉన్నారని ఇప్పటికే కథ ఓకే అయ్యిందని తెలుస్తోంది. బివియస్ రవి కథ అందిస్తున్న ఈ చిత్రం వర్క్ గత కొంతకాలంగా జరుగుతోంది. రీసెంట్ గా ఫైనల్ నేరేషన్ చిరంజీవి విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే చిరంజీవి కుమార్తె సుస్మిత ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
 

67

ఇక మోహన్ రాజ్ ‘హనుమాన్ జంక్షన్’‌తో టాలీవుడ్‌కు పరిచయయ్యారు.. ఆ తరవాత ఆయన మళ్లీ చేసిన  తెలుగు సినిమా గాడ్ ఫాధర్.   ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా మలయాళంలో 2019లో విడుదలైన చిత్రం ‘లూసిఫర్’. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయమైన సినిమా ఇది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో రీమేక్ చేస్తే యావరేజ్ అయ్యింది.

77
Chiraneevi

Chiraneevi

లూసిఫర్ సినిమాను తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు. చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను వీక్షించేశారు. అలాంటి సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే అందరిలో ఓ అనుమానం. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేసిన సినిమాను పేరుతో మళ్లీ రీమేక్ చేయడమేంటి అని ప్రశ్నించారు. ఆ తరవాత ఈ సినిమాను మలయాళంలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారంటే చాలా మంది నవ్వుకున్నారు. మలయాళీలు అయితే ట్రోలింగ్ కూడా చేశారు. అయితే కంటెంట్ పరంగా సినిమా యావరేజ్ అయ్యిందేమో కానీ తీసే విషయంలో మాత్రం మోహన్ రాజా పక్కా మాస్ డైరక్టర్ లాగ ఎలివేషన్స్ ఇవ్వటం చిరంజీవికి నచ్చిందిట.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
Recommended image2
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్
Recommended image3
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved