- Home
- Entertainment
- Mohanbabu: మోహన్ బాబు నటించిన రాడ్డు రంభోలా మూవీ ఏంటో తెలుసా? కలెక్షన్ కింగ్ ఓపెన్ స్టేట్‌మెంట్
Mohanbabu: మోహన్ బాబు నటించిన రాడ్డు రంభోలా మూవీ ఏంటో తెలుసా? కలెక్షన్ కింగ్ ఓపెన్ స్టేట్‌మెంట్
మోహన్‌బాబు ఎన్నో సూపర్ హిట్స్ చేశారు, ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆయన కెరీర్‌లో ఒక రాడ్డు రంభోలా మూవీ కూడా ఉందట. తాజాగా ఆ సినిమా ఏంటో బయటపెట్టాడు కలెక్షన్ కింగ్.

మరోసారి విలన్‌గా మారిన మోహన్ బాబు
కలెక్షన్ కింగ్‌గా రాణించిన మోహన్ బాబు ఇప్పుడు కొంత గ్యాప్‌తో క్యారెక్టర్స్ చేస్తున్నాడు. నాని `పారడైజ్`లో విలన్‌గా మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో రానుంది. మోహన్ బాబు తన కెరీర్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఐదు వందలకుపైగా చిత్రాలు చేశారు. తిరుగులేని స్టార్‌గా రాణించారు. అద్భుతమైన నటుడిగా మెప్పించారు. ఆయన డైలాగ్ డెలివరీ చాలా స్పెషల్ అని చెబితే అతిశయోక్తి కాదు. డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి కమాండ్ ఉన్న నటుడిగా మోహన్ బాబు పేరు తెచ్చుకున్నారు.
మోహన్ బాబు కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా
ఇప్పుడు మళ్లీ విలన్‌గా సందడి చేయబోతున్న మోహన్‌బాబు తాను నటించిన సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్క నటుడు, హీరో కెరీర్‌లో మంచి సినిమాలుంటాయి, చెత్త సినిమాలుంటాయి. అయితే అత్యంత చెత్త సినిమాలు కూడా ఉంటాయి. అలా ఏదో ఒక మూవీని చెత్త సినిమాగా భావిస్తుంటారు. మోహన్ బాబు ఈ విషయంపై స్పందించారు. తాను చేసిన చిత్రాల్లో చెత్త మూవీ ఏంటో వెల్లడించారు. తాను చూసుకోవడానికి కూడా ఇష్టపడనని చెప్పారు. అంతే కాదు ఆ సినిమా చేశాక తన భార్య వారం రోజులు తనతో మాట్లాడలేదట. అంటే అది ఏ రేంజ్‌లో చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే,
పటాలం పాండు రాడ్డు రంభోలా మూవీ
మోహన్ బాబు తన చెత్త సినిమా గురించి చెబుతూ, `పటాల పాండు` అనే మూవీ తాను నటించిన చిత్రాల్లో అత్యంత రాడ్డు రంభోలా మూవీ అని చెప్పారు. ఈ సినిమా చూసి తన భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదని చెప్పారు. అలాంటి ఘోరాతి ఘోరమైన మూవీ అని చెప్పారు మోహన్ బాబు. బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో నటించిన వారిలో తనకు నచ్చని వారు ఎవరనే ప్రశ్న బాలయ్య అడగ్గా, ఎవరి మనసు నొప్పించే ప్రశ్న వద్దు అని దాటవేశారు.
పటాలం పాండు గురించి
ఇక `పటాలం పాండు` మూవీ విషయానికి వస్తే, ఇందులో మోహన్ బాబు, సుభాషిణి జంటగా నటించారు. ఎస్ డీ లాల్ దర్శకత్వం వహించారు. గొల్లపూడి మారుతీరావు మాటలు రాయగా, చక్రవర్తి సంగీతం అందించారు. రవిచిత్ర ఫిల్మ్స్ నిర్మించారు. ఈ మూవీ అత్యంత డిజాస్టర్‌గా నిలిచిందట. కనీసం టీ డబ్బులు కూడా రాలేదని సమాచారం. ఇది 1981లో విడుదల కావడం గమనార్హం.

