MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rajesh Sharma: ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు, రేవంత్ రెడ్డికి కంప్లైంట్.. అసలేం జరిగింది ?

Rajesh Sharma: ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు, రేవంత్ రెడ్డికి కంప్లైంట్.. అసలేం జరిగింది ?

ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం రాజేష్ శర్మ ప్రభాస్ ఫౌజీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అసలు రాజేష్ శర్మకి ఏమైంది అనే విషయంలో గందరగోళం నెలకొంది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 09 2026, 09:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్ మూవీ
Image Credit : Asianet News

ప్రభాస్ మూవీ

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా సెట్‌లో నటుడు రాజేష్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) డిమాండ్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విష పురుగు కుట్టడం వల్లే ఇలా
Image Credit : Social Media

విష పురుగు కుట్టడం వల్లే ఇలా

ఈ సీనియర్ నటుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని AICWA ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "షూటింగ్ షెడ్యూల్ సమయంలో రాజేష్ శర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన కోల్‌కతా వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇంత తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీసిన పరిస్థితులు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై వెంటనే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగాలి" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Related Articles

Related image1
Lenin Movie: లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయమేనా ?
Related image2
Rajamouli: అందుకే రాజమౌళి, మంచు మనోజ్ లకు చుక్కలు.. ఆ దేవతలతో పెట్టుకున్నారు, వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు
35
క్లారిటీ ఇచ్చిన రాజేష్ శర్మ అసిస్టెంట్
Image Credit : Asianet News

క్లారిటీ ఇచ్చిన రాజేష్ శర్మ అసిస్టెంట్

రాజేష్ శర్మ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు ఇంకా ప్రమాదం తొలగిపోలేదని AICWA వెల్లడించింది."తాజా మెడికల్ అప్‌డేట్ ప్రకారం ఈ ఘటన తీవ్రత మరింత ఆందోళనకరంగా మారింది. రాజేష్ శర్మ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నందున, 'ఫౌజీ' షూటింగ్ సమయంలో ఈ ఆరోగ్య సమస్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరపడం చాలా అవసరం" అని AICWA నొక్కి చెప్పింది.

రాజేష్ శర్మ ఆసుపత్రి పాలవడంతో ప్రభాస్ మూవీ సెట్ లోనే ఏదో జరిగింది అనే పుకార్లు వ్యాపించాయి. కానీ రాజేష్ శర్మ అసిస్టెంట్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆసుపత్రిలో చేరింది ప్రభాస్ మూవీ సెట్ లో ఏదో సంఘటన జరగడం వల్ల కాదు అని.. ఆయన డైయాబెటిస్ కి చికిత్స తీసుకుంటున్నారు అని తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న డయాబెటిస్ కి రాజేష్ శర్మ చికిత్స తీసుకోవడం కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారట. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు అని తెలిపారు.

45
సినిమా సెట్స్‌లో పరిస్థితులపై ఆందోళన
Image Credit : Asianet News

సినిమా సెట్స్‌లో పరిస్థితులపై ఆందోళన

కానీ AICWA మాత్రం ఇది సినిమా సెట్ లో జరిగిన సంఘటన అన్నట్లుగానే స్పందించారు. సినిమా సెట్స్‌లోని పని పరిస్థితులపై కూడా ఈ అసోసియేషన్ ప్రశ్నలు లేవనెత్తింది. "ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్, వర్కర్‌కు సురక్షితమైన, పరిశుభ్రమైన, వైద్య సదుపాయాలున్న వాతావరణాన్ని కల్పించడం సినీ పరిశ్రమ చట్టపరమైన, నైతిక బాధ్యత. కానీ దేశవ్యాప్తంగా చాలా షూటింగ్ లొకేషన్లలో పరిశుభ్రత లోపించడం, సరైన పారిశుధ్యం లేకపోవడం, అసురక్షిత పని వాతావరణం, అత్యవసర వైద్య సదుపాయాలు కొరవడటంపై మేం పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. వేలాది మంది కార్మికులు రోజూ గంటల తరబడి సెట్స్‌లో గడుపుతారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి" అని AICWA పేర్కొంది.

55
తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
Image Credit : X/revanth_anumula

తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

ఈ ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని AICWA కోరింది. "ఈ విచారణలో నటుడు రాజేష్ శర్మ అనారోగ్యానికి కచ్చితమైన కారణం ఏంటో తేల్చాలి. సెట్‌లో భద్రత, పరిశుభ్రత, అత్యవసర వైద్య నిబంధనలు పాటించారా లేదా అని పరిశీలించాలి. నిర్మాత, ప్రొడక్షన్ హౌస్ లేదా ఇతర బాధ్యుల వైపు నుంచి ఏదైనా నిర్లక్ష్యం ఉంటే గుర్తించాలి" అని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, ఈ విషయంపై 'ఫౌజీ' చిత్ర నిర్మాతలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Lenin Movie: లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయమేనా ?
Recommended image2
Rajamouli: అందుకే రాజమౌళి, మంచు మనోజ్ లకు చుక్కలు.. ఆ దేవతలతో పెట్టుకున్నారు, వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved