- Home
- Entertainment
- Soundarya: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది.. తప్పు మీద తప్పు చేసింది, కర్మ ఎవరినీ వదలదు.. డైరెక్టర్ బోల్డ్ కామెంట్
Soundarya: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది.. తప్పు మీద తప్పు చేసింది, కర్మ ఎవరినీ వదలదు.. డైరెక్టర్ బోల్డ్ కామెంట్
Soundarya: సౌందర్య ఎంత గొప్ప నటి అనేది తెలిసిందే. అయితే ఆమెకి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయటపెట్టాడు దర్శకుడు. పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పిందట. ప్రముఖ దర్శకుడు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.

అద్భుతమైన నటనకు కేరాఫ్ సౌందర్య
సౌందర్య పేరు చెబితే మనకు ఆమె అద్భుతమైన నటన, ఆమె చీరకట్టు, సాంప్రదాయానికి ఆమె వేసిన పెద్ద పీఠ గుర్తుకొస్తాయి. అన్నింటికి మించి మంచి నటనతో మనల్ని అలరించిన తీరు గుర్తొస్తుంది. ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినా సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో తన సినిమాలతో పదిలంగానే ఉంది. సౌందర్య గ్రీన్ యాక్ట్రెస్. కాలంతో సంబంధం లేకుండా, అన్ని జనరేషన్ ఆడియెన్స్ ఆమెని ఆరాధిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి తరం కూడా ఆమె సినిమాలు చూశారంటే ఫిదా అవ్వాల్సిందే.
కక్కుర్తి పడి ప్రాణాలు తీసుకుంది
అంతగా ఆకట్టుకున్నా, తన సినిమాలతో అలరిస్తూనే ఉన్న సౌందర్య గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆమె కెరీర్ చివర్లో చేసిన తప్పులు ఇప్పుడు షాకిస్తున్నాయి. సౌందర్య 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలీకాఫ్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బీజేపీ కోసం ఆమె ప్రచారం చేసింది. అయితే రెండు, మూడు లక్షలకు కక్కుర్తి పడి ఆమె తన ప్రాణాలు తీసుకుందని ఇటీవల ప్రముఖ సంచలన దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన మరో సంచలన, షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. సౌందర్య గురించి ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి వార్త విని ఉండరంటే అతిశయోక్తి కాదు.
జగపతిబాబు, వెంకటేష్‌లకు సంబంధించిన వార్తలు
సౌందర్యకి సంబంధించి ఇతర హీరోలతో ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. ప్రధానంగా జగపతిబాబు, వెంకటేష్‌తో వినిపించాయి. జగపతిబాబుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని, ఆయన ఆమెతో పిల్లల్ని కనాలనుకున్నారనే వార్త వైరల్ అయ్యింది. దీనిపై జగపతిబాబు చాలా సార్లు స్పందించారు. అందులో నిజం లేదని, ఆమె మంచి స్నేహితురాలు అని, వారి ఫ్యామిలీతోనూ తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అదే సమయంలో వెంకటేష్‌ని కూడా సౌందర్య మ్యారేజ్ చేసుకోవాలనుకుందని, రామానాయుడు బెదిరించారనే మరో రూమర్ కూడా ఉంది. వీటిలో నిజాలేంటనేది తెలియదు.
సౌందర్య చివర్లో తప్పులు చేసింది
కానీ గీతా కృష్ణ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. సౌందర్య పెళ్లి తర్వాత గాడి తప్పిందని షాకిచ్చాడు. ఒక్కటి కాదు రెండు కాదు చాలా తప్పులు చేసిందని, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లిందన్నారు. `శ్రీరాములయ్య` సినిమా చేశాక ఆమె గాడి తప్పిందని ఆయన కామెంట్ చేశారు. ఆ రాజకీయ నాయకుడు కూడా సౌందర్యని ఇబ్బంది పెట్టినట్టు ఆయన వెల్లడించారు. ఇలా సౌందర్య కెరీర్ గాడి తప్పిందన్నారు. కర్మ ఎవరిని వదలదు అంటారుగా, సౌందర్య విషయంలోనూ అదే జరిగిందేమో అంటూ ఆయన షాకిచ్చాడు.
సౌందర్య లేకపోవడం పెద్ద లోటు
సౌందర్య చాలా మంచి అమ్మాయి అని, మంచి నటి అని, ఆమెతో సినిమా చేయకపోవడం తన దురదృష్టం అని, కానీ ఆమె నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. వెంకటేష్‌తో మంచి మంచి సినిమాలు చేసిందని, సహజమైన అందం ఆమె సొంతమని వెల్లడించారు. ఆమెని చూస్తే మనింటి అమ్మాయిలా, మన పక్కింటి అమ్మాయిలా ఉంటుందని తెలిపారు. ఆమె ఇప్పుడు లేకపోవడం ఇండస్ట్రీకి పెద్ద లోటు అని ఆయన వెల్లడించడం విశేషం.

