MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Total Collections: షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్‌ చరణ్‌ నష్టాలు సేమ్‌

Peddi Total Collections: షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్‌ చరణ్‌ నష్టాలు సేమ్‌

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `పెద్ది` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ నటనకు ప్రశంసలందుకున్న ఈ మూవీ ఇప్పుడు భారీ నష్టాలతో ముగుస్తుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 09 2026, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిశ్రమ స్పందనతో రన్‌ అయిన పెద్ది మూవీ
Image Credit : Asianet News

మిశ్రమ స్పందనతో రన్‌ అయిన పెద్ది మూవీ

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` సినిమా రూపొందింది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, జగపతిబాబు, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీస్‌, సుకుమార్‌ రైటింగ్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. వెంకట సతీష్‌ కిలారు నిర్మాత. `గేమ్‌ ఛేంజర్‌` వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ చేసిన చిత్రమిది. గత జూన్‌ 4న ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అలానే కలెక్షన్లు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
థియేట్రికల్‌గా క్లోజింగ్‌కి చేరుకున్న పెద్ది మూవీ
Image Credit : Asianet News

థియేట్రికల్‌గా క్లోజింగ్‌కి చేరుకున్న పెద్ది మూవీ

`పెద్ది` మూవీ ప్రారంభంలో జోరు చూపించింది. మొదటి వారం రెండో వారంలో మంచి వసూళ్లని రాబట్టింది. మూడో వారం నుంచి డ్రాప్‌ అయ్యింది. దీనికితోడు సమంత నటించిన `మా ఇంటి బంగారం` రావడంతో `పెద్ది`కి గట్టి దెబ్బ పడింది. కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇక ఈ మూవీ ఇంకా థియేటర్లో రన్‌ అవుతుంది. కాకపోతే ఆల్మోస్ట్ క్లోజింగ్‌కి చేరుకుంది. కొన్ని థియేటర్లలో మాత్రమే రన్‌ అవుతుంది. అది కూడా రోజుకి ఒక్క షో మాత్రం తిప్పి కొడితే అన్నీ కలిపి 10 థియేటర్లు కూడా లేవు. దీంతో ఇక థియేట్రికల్‌ గా `పెద్ది` క్లోజింగ్‌కి చేరుకుందని చెప్పొచ్చు.

35
పెద్ది మూవీ ఎన్ని కోట్ల నష్టాలు అంటే?
Image Credit : Asianet News

పెద్ది మూవీ ఎన్ని కోట్ల నష్టాలు అంటే?

పెద్ది థియేట్రికల్‌గా 35 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.341 కోట్ల కలెక్షన్లు(సాక్నిల్క్ లెక్కల ప్రకారం) వచ్చాయి. ఇందులో ఇండియా గ్రాస్‌ రూ.288కోట్లు ఉండగా, రూ.243.83కోట్ల నెట్‌ ఉంది. ఓవర్సీస్‌లో ఈ మూవీ రూ.53కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ చిత్రం సుమారుగా రూ.170కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.220కోట్లు రావాలని ట్రేడ్‌ వర్గాల సమాచారం. హిట్‌ అవ్వాలంటే ఇంకా రూ.50కోట్లు రావాలి. మొత్తంగా ఈ మూవీ యాభై కోట్ల నష్టాలతో ముగుస్తుందని చెప్పొచ్చు.

45
రామ్‌ చరణ్‌ జాతీయ అవార్డు స్థాయి నటన
Image Credit : X/@vriddhicinemas

రామ్‌ చరణ్‌ జాతీయ అవార్డు స్థాయి నటన

ప్రస్తుతం కొన్ని థియేటర్లో రన్‌ అవుతుంది. అయితే ఆ కలెక్షన్లు కేవలం థియేటర్‌ ఖర్చులకే సరిపోవు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లని దాటుకొని నిర్మాతకు వచ్చేది సున్నా. మొత్తంగా ఈ సినిమా రూ.50కోట్ల నష్టాలతో ముగుస్తుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. `పెద్ది` బ్లాక్‌ బస్టర్‌ గా టీమ్‌ చెబుతూ వచ్చింది. కానీ నిర్మాత మాత్రం గట్టిగానే లాస్‌ అయ్యాడని సమాచారం. అయితే ఈ మూవీలో రామ్‌ చరణ్‌ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు స్థాయి పర్‌ఫెర్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. మరి అవార్డు వస్తుందా అనేది చూడాలి.

55
 సమంత మూవీ లాభాలు, రామ్‌ చరణ్‌ మూవీ నష్టాలు సేమ్‌
Image Credit : Asianet News

సమంత మూవీ లాభాలు, రామ్‌ చరణ్‌ మూవీ నష్టాలు సేమ్‌

అయితే సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ థియేటర్లో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి రూ.90కోట్లకుపైగానే వసూళ్లు వచ్చాయి. రిలీజ్‌కి ముందే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. రూ.5 కోట్ల లాభాలు వచ్చాయి. ఇక థియేట్రికల్‌గా వచ్చిందంటే లాభమే. ఈ లెక్కన ఈ మూవీకి థియేట్రికల్‌గా  రూ.45కోట్ల షేర్‌ వచ్చింది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూపంలో మరో ఐదు కోట్లు లాభాలు ఇలా మొత్తంగా సమంతకి `మా ఇంటి బంగారం` మూవీ ద్వారా రూ.50కోట్లు లాభాలు రావడం విశేషం. ఇలా రామ్‌ చరణ్‌ మూవీ నష్టాలు, సమంత మూవీ లాభాలు ఈక్వల్‌గా ఉండటం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
సమంత రూత్ ప్రభు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image2
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Recommended image3
NTR మార్ఫింగ్ వీడియో వివాదం.. సెలబ్రిటీలదే తప్పు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Recommended image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved