పరారీలో మోహన్ బాబు.. పోలీసుల గాలింపు, ఆ హీరో ఇంట్లో ఉన్నాడా.. నిజమెంత..?
కేసుల విషయంలో భయపడి మోహన్ బాబు పరారీలో ఉన్నారా..? బెయిల్ వచ్చేవరకూ కనిపించకుండా తప్పించుకుంటున్నారా..? మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంత..?
టాలీవుడ్ లో సినిమా కుటుంబాలలో మంచువారి కుటుంబం ఒకటి. ఈ ఫ్యామిలీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఎక్కువగా ట్రోలింగ్ కు గురైన కుటుంబం మంచువారి కుటుంబం. మంజు మనోజ్ తప్పించి అందరిపై ఏదో ఒక రకంగా జోకులు పేలుతుంటాయి. సోషల్ మీడియాలో. ఈక్రమంలో ఎప్పుడు క్రమశిక్షణ అంటూ గట్టిగా నొక్కిచెప్పే మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలతో వీధిన పడటంతో అందరు ఆశ్చర్యపోయారు.
ఈ విషయం అటు ఇండస్ట్రీలో, ఇటు రాజకీయంగా కూడా వైరల్ అయ్యింది. పెద్ద చర్చకు దారితీసింది. మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఎప్పటినుంచో గొడవలు ఉన్నాయ కాని అవి నాలుగు గోడల మధ్య జరిగాయి. అవి కాస్త ముదిరి పాకానపడి... అందరూ రోడ్డుకెక్కడంతో రచ్చ రచ్చ జరిగింది. ఈవిషయంలో మంచువారిపై విమర్శలు రావడం.. మోహాన్ బాబుపై కూడావిమర్శలతో పరువుకాస్త పోయింది.
ఇక ఈగొడవలు ఇంట్లో వరకూ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కాని అవి కాస్తా వీధిన పడటంతోనే మీడియా కూడా కవర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈక్రమంలోనే జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటిదగ్గర విషయం కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ముఖంపై మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ నేపథ్యంలోనే బాధితులు మోహన్ బాబు నుండి తమకు ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
అటు జర్నలిస్టు సంఘాలు కూడా మోహన్ బాబు పై మండిపడ్డాయి. ధర్నాలు చేశారు. కంప్లైంట్ చేశారు. ఇక దీంతో జర్నలిస్టును గాయపరిచిన నేపథ్యంలో సెక్షన్ 118 BNS కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో కోర్ట్ లో బెయిల్ కోసం మోహన్ బాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకూ పోలీసులకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
తాజాగా ఆయనను అరెస్టు చేయాలని వెళ్లిన పోలీసులకు మోహన్ బాబు కనిపించలేదు. ప్రస్తుతం మోహన్ బాబు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు మోహన్ బాబు కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మోహన్ బాబు జాడ తెలియలేదు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే మోహన్ బాబు పరారీలో లేరని.. ఆయన గచ్చిబౌలిలోని మంచు విష్ణు ఇంట్లో ఉన్నట్టు తెలుస్తోంది. జల్ పల్లి ఇంట్లో మనోజ్ తో పాటు ఆయన భార్య ఉండటంతో.. మళ్లీ గొడవలు కాకుండా.. సెటిల్ మెంట్ చేసుకునే వరకూ మంచు విష్ణు ఇంట్లో ఉండాలని మోహన్ బాబు డిసైడ్ అయ్యారట.
మరి మోహన్ బాబు పరారీలో ఉన్నాడా... లేక విష్ణు ఇంట్లో ఉన్నాడా..? నిజం ఏంటో తెలియాల్సి ఉంది. మరి ఈ వివాదం ప్రస్తుతానికి సర్ధుమణిగిందా లేదా.. అనేదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.