పూనమ్ పాండే నటించిన ఒకే ఒక తెలుగు సినిమా... హీరో ఎవరంటే?
పూనమ్ పాండే మరణం ఊహించని పరిణామం. చిన్న వయసులో ఆమె కన్నుమూశారు. మోడల్ గా సంచలనాలు చేసిన పూనమ్ పాండే తెలుగులో ఒక సినిమా చేయడం విశేషం.
పూనమ్ పాండే అంటే తెలియని గ్లామర్ ప్రియులు ఉండరు. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన పూనమ్ పాండే నటిగా కొన్ని చిత్రాలు చేశారు. పూనమ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే పూర్తి నగ్నంగా కనిపిస్తానని బీసీసీఐ కి లేఖ రాసింది. ఇది అత్యంత వివాదాస్పదం అయ్యింది. పూనమ్ పాండే పై బీసీసీఐ మండిపడింది. అడల్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ యాప్ లాంచ్ చేసింది. దాన్ని ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలగించింది.
2020లో కోవిడ్ ఆంక్షల మధ్య మిత్రుడు సామ్ బాంబేను వివాహం చేసుకుంది. పెళ్ళై నెల రోజులు గడవక ముందే అతడి మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది. గోవా పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పూనమ్ పాండే జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి.
కాగా పూనమ్ హిందీ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించారు. ప్రతి సినిమాలో ఆమె బోల్డ్ రోల్ చేయడమైంది. తెలుగులో పూనమ్ పాండే 'మాలినీ అండ్ కో' టైటిల్ ఒక చిత్రం చేసింది. ఈ మూవీలో సామ్రాట్ హీరోగా నటించాడు.
మాలినీ అండ్ కో మూవీ 2015లో విడుదలైంది. కానీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా జనాలకు తెలియదు. తర్వాత మరలా తెలుగులో పూనమ్ పాండే మూవీ చేయలేదు.
2018లో ఆమె నటించిన ది జర్నీ ఆఫ్ కర్మ అనే చిత్రం విడుదలైంది. పూనమ్ పాండే నటించిన చివరి చిత్రం ఇదే. కంగనా రనౌత్ హోస్ట్ గా ఓటీటీలో ప్రసారమైన లాక్ అప్ రియాలిటీ షోలో పూనమ్ పాండే కంటెస్టెంట్ చేసింది. ఇది 2022లో ప్రసారం అయ్యింది.
Poonam Pandey
అనూహ్యంగా నేడు ఆమె కన్నుమూశారు. పూనమ్ పాండే వయసు కేవలం 32 ఏళ్ళు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే కన్నుమూసినట్లు ఆమె టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పూనమ్ పాండే మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.