- Home
- Entertainment
- మిస్ వరల్డ్ 2025 విజేత ధరించే కిరీటం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎలా తయారు చేస్తారు? దాని ధర ఎంతంటే?
మిస్ వరల్డ్ 2025 విజేత ధరించే కిరీటం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎలా తయారు చేస్తారు? దాని ధర ఎంతంటే?
మిస్ వరల్డ్ 2025 ఫైనల్‌కి ఇంకా మూడు రోజులే ఉంది. ప్రపంచ అందగత్తెలంతా కిరీటం కోసం పోటీపడుతున్నారు. మరి ఈ కిరీటం ప్రత్యేకత ఏంటో ఓ సారి చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మూడు రోజుల్లోనే `మిస్ వరల్డ్ 2025` ఫైనల్
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మే 12న ప్రారంభమైన ఈ మిస్ వరల్డ్ పోటీలు ఒక్కో దశను దాటుకుంటూ ఇప్పుడు ఫైనల్‌కి చేరుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లోనే ఈ పోటీలు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఈ సారి ఎవరు విన్నర్ అనే ఉత్కంఠ నెలకొంది. ఇండియా నుంచి నందిని గుప్తా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె టాప్ కంటెస్టెంట్‌గానూ ఎంపికైంది. అయితే మరో మూడు దశలు దాటుకుని ఆమె ఫైనల్‌కి వెళ్లాల్సి ఉంది. మరి ఆ స్థానానికి చేరుతుందా, కిరీటం దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఎవరు తయారు చేస్తారు?
ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేది విన్నర్‌కి తొడిగే కిరీటం. అదే ఈ పోటీల్లో ప్రత్యేకం. మరి ఈ కిరీటం ప్రత్యేకత ఏంటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? ధర ఎంత ఉంటుందనేది చూస్తే, ఈ కిరీటాన్ని జపాన్‌కి చెందిన `మికిమోటో` అనే జ్యూవెల్లరీ కంపెనీ తయారు చేస్తుంది. 2017లో చివరి సారిగా దీన్ని తయారు చేశారు. అప్పటి నుంచి ఆ కిరీటాన్నే విన్నర్స్ కి ధరిస్తున్నారు.
మిస్ వరల్డ్ కిరీటం ఎలా తయారు చేస్తారు? అందులో ఏముంటుంది?
ఈ కిరీటం ఎలా తయారు చేస్తారనేది చూస్తే, 1951లో ఈ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాగా, అప్పట్నుంచి ఈ కంపెనీనే ఈ కిరీటాలను తయారు చేస్తుంది. దీనికంటే ముందు మూడు కిరీటాలు తయారు చేసింది. ఇప్పుడు నాల్గో కిరీటం వాడుతున్నారు. ఈ కిరీటం మధ్యలో రింగ్ షేప్‌లో నీలం రంగ్ గ్లోబ్ ఉంటుంది. ఇది ప్రపంచాన్ని సూచిస్తుంది. దాని చుట్టూ ఆరు తెల్ల బంగారు కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములు భూభాగాలను సూచిస్తాయి. ఈ కొమ్ములను ముత్యాలు, వజ్రాలతో అలంకరిస్తారు. నీలం, తెలుపు రంగులో ఈ ముత్యాలు, వజ్రాలు ఉంటాయి. ఇవి శాంతి, ఐక్యత, మహిళా సాధికారతను చాటి చెబుతాయి.
మిస్ వరల్డ్ కిరీటం ధర ఎంతంటే?
మిస్ వరల్డ్ విన్నర్‌కి అందించే ఈ కిరీటం ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. దీని విలువ లక్ష డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.84లక్షలు. అయితే ఈ కిరీటం విన్నర్ దగ్గరే ఉండదు, ఏడాది పాటు మాత్రమే ఆమె క్యారీ చేస్తుంది. ఆ తర్వాత కొత్తగా విన్నర్‌గా నిలిచిన వారికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో గత విన్నర్‌కి అలాంటిదే ఒక కిరీట ప్రతిమని మిస్ వరల్డ్ నిర్వాహకులు గిఫ్ట్ గా అందిస్తారు.
మిస్ వరల్డ్ విన్నర్ ప్రైజ్ మనీ
ఇక మిస్ వరల్డ్ విన్నర్ కి దక్కే ప్రైజ్ మనీ కూడా గట్టిగానే ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏకంగా ఎనిమిదన్నర కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఒక్కసారి మిస్ వరల్డ్ విన్నర్ అయితే లైఫ్ సెట్ అయిపోయినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఏడాదిపాటు ప్రపంచ పర్యటనకు సంబంధించిన అన్ని ఖర్చులు నిర్వాహకులే భరిస్తారు. వీరు అనేక సేవా కార్యక్రమాలు, ఫండ్ రైజింగ్ ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిపాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌కి అధికారిక బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు.
మిస్ వరల్డ్ విన్నర్ కి యాడ్సే యాడ్స్
ఒక్కసారి మిస్ వరల్డ్ విన్నర్ అయితే కమర్షియల్ యాడ్స్ కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఒక్కో యాడ్‌కి పారితోషికం లక్షల నుంచి, కోట్ల వరకు ఉంటుంది. మిస్ వరల్డ్ విన్నర్ ప్రపంచ సెలబ్రిటీ హోదా పొందడంతో వీరి క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే కార్పొరేట్ కంపెనీలు వీరి వెంటపడుతుంటాయి. వారి ఇమేజ్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వీటితోపాటు సినిమా అవకాశాలు కూడా వరిస్తుంటాయి. సినిమాల్లో క్లిక్ అయితే వారి లైఫ్ బిందాస్. ఇలా మిస్ వరల్డ్ విన్నర్‌గా నిలిచిన ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.