- Home
- Entertainment
- ఫోన్ చేసి డైరెక్ట్ గా అడిగాడు, గుడ్డలూడదీసి కొడతా అని చెప్పా..కాస్టింగ్ కౌచ్ పై మిర్చి మాధవి షాకింగ్ కామెంట్స్
ఫోన్ చేసి డైరెక్ట్ గా అడిగాడు, గుడ్డలూడదీసి కొడతా అని చెప్పా..కాస్టింగ్ కౌచ్ పై మిర్చి మాధవి షాకింగ్ కామెంట్స్
మిర్చి మాధవి టాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. మిర్చి చిత్రంలో నటించడంతో ఆమెని మిర్చి మాధవి అని పిలవడం ప్రారంభించారు.

టాలీవుడ్ లో తరచుగా కాస్టింగ్ కౌచ్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు పలువురు నటీమణులు కాస్టింగ్ కౌచ్ పై గళం విప్పారు. కానీ ఆ తరహా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మిర్చి మాధవి కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది.
మిర్చి మాధవి టాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. మిర్చి చిత్రంలో నటించడంతో ఆమెని మిర్చి మాధవి అని పిలవడం ప్రారంభించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో మిర్చి మాధవి కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
నాకు ఒక్కసారే కాస్టింగ్ కౌచ్ సంఘటన ఎదురైంది. ఒక చిత్రంలో నన్ను ఎంపిక చేశారు. డైరెక్టర్ కి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేసి.. మీకు ఈ చిత్రంలో పాత్ర ఉండాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి. మొత్తం 5 మంది ఉన్నాం అని అన్నాడు. ఇంకోక్కసారి ఫోన్ చేస్తే గుడ్డలూడదీసి కొడతా అని అరిచేశా. వెంటనే ఫోన్ పెట్టేశాడు.
ఆ తర్వాత తనని ఎవరూ కమిట్మెంట్ అడగలేదని మిర్చి మాధవి తెలిపింది. అప్పుడు కొంపంలో తిట్టేశా. కానీ ఇప్పుడు ఎవరైనా అలా అడిగితే.. ఫోన్ పెట్టారా బాబు నాకు చాలా పని ఉంది అని ఊరుకుంటా. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందని మిర్చి మాధవి అన్నారు.
కాస్టింగ్ కౌచ్ అనేది ఒకవైపే ఉండదు అని మాధవి అన్నారు. మనకి ఇష్టం లేకుంటే ఎవరూ టచ్ చేయరు. మనం చనువు ఇస్తేనే అవతలి వాడి రెచ్చిపోతాడు అని ఆమె తెలిపారు.
ఇక తనకి టాలీవుడ్ లో పెద్ద పాత్రలు వస్తాయనే నమ్మకం లేదని మాధవి అన్నారు. తాను మంచి పాత్రలు ఇవ్వమని ఎవ్వరిని అడగను. వస్తే ఒకే.. రాకున్నా మంచిదే అని మిర్చి మాధవి పేర్కొంది.