- Home
- Entertainment
- NTR: ఎన్టీఆర్‌పై మంత్రి పేర్నినాని షాకింగ్ కామెంట్స్.. మీకు పడి ఏడుస్తున్నాడంటూ వ్యాఖ్యలు.. నెట్టింట దుమారం
NTR: ఎన్టీఆర్‌పై మంత్రి పేర్నినాని షాకింగ్ కామెంట్స్.. మీకు పడి ఏడుస్తున్నాడంటూ వ్యాఖ్యలు.. నెట్టింట దుమారం
`మీ కుటుంబానికి పడి ఏడుస్తున్నాడు కదా. జూ.ఎన్టీఆర్ సినిమాలకు ఎప్పుడైనా బాగుందని ప్రశంసించారా. ఆయన సినిమాలను చూడాలని ఉందని ఎప్పుడైనా ట్వీట్లు చేశారా?` అంటూ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఎన్టీఆర్(Ntr)పై షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబుని ఉద్దేశిస్తూ శుక్రవారం తాడెపల్లిలో మాట్లాడిన ఆయన తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్.. చంద్రబాబు(CBN) ఫ్యామిలీలో పడి ఏడుస్తున్న హీరో అంటూ వ్యాఖ్యానించారు. ఆయన సినిమాలకు ఎప్పుడైన బాగుందని ట్వీట్లు చేశారా అంటూ ప్రశ్నించారు మంత్రి పేర్నినాని.
`మీ కుటుంబానికి పడి ఏడుస్తున్నాడు కదా. జూ.ఎన్టీఆర్ సినిమాలకు ఎప్పుడైనా బాగుందని ప్రశంసించారా. ఆయన సినిమాలను చూడాలని ఉందని ఎప్పుడైనా ట్వీట్లు చేశారా?. ఇప్పుడు పవన్ సినిమా కోసం పడి ఏడుస్తున్నారు తండ్రీ కొడుకులు(చంద్రబాబు, లోకేష్). NTr సినిమా చూడాలని ఉందని ఏ రోజైనా మాట్లాడారా? వాళ్లు, వారి ఫ్యాన్స్ చొక్కాలు చించుకుని మీ జెండా మోస్తున్నారు కదా. ఎన్టీఆర్ సినిమా చూడాలని ఉందని, హిట్ అవుతుందనిగానీ ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు మంత్రి పేర్నినాని.
పవన్ కళ్యాణ్‌తో ఈ కపట ప్రేమ ఎందుకని మంత్రి ప్రశ్నించారు. అంతేకాదు ఏ రోజైనా చిరంజీవి సినిమాకి ట్వీట్ చేశారు. ప్రభాస్, మహేష్‌బాబు సినిమాలు విడుదలైనప్పుడు సినిమా బాగుందని, చూడాలని ఉందని, పెద్ద హిట్ కావాలని ట్వీట్లు చేశారా? అంటూ చంద్రబాబుని, లోకేష్‌ని ప్రశ్నించారు మంత్రి నాని. పవన్ కళ్యాణ్ తన సినిమాని ఫ్రీగా చూపిస్తానని అవాకులు, చవాకులు నరికారు. ఇప్పుడు బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని ప్రశ్నించారు మంత్రి నాని.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ని చులకని చేసి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులను కించపరిచేలా ఉన్నాయంటే మండిపడుతున్నారు. తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మంత్రిని ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల సినీ పెద్దలతో ఏపీ సీఎం జగన్‌తో చర్చలకు సంబంధించి ఎన్టీఆర్‌కి కూడా ఆహ్వానం ఉండగా, ఆయన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మంత్రి.. ఎన్టీఆర్‌ని తక్కువ చేసిన మాట్లాడటం హాట్ టాపిక్ అవుతుంది. మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టయ్యింద
పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే పది గంటలకు ముందే సినిమా విడుదల అనుమతి లేదంటూ ఏపీ ప్రభుత్వం థియేటర్ల వద్ద భారీ భద్రత పెట్టింది. రెవిన్యూ అధికారులు, పోలీసులు కాపలా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ప్రజా సమస్యలు వదిలేసి `భీమ్లా నాయక్` సినిమాపై ఈ కక్ష్య సాధింపు చర్యలేంటి అంటూ నిలదీశారు. ఉక్రేయిన్‌లో ఇరుక్కున్న తెలుగు వారిని తీసుకు రావాల్సింది పోయి సినిమాపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని, `భీమ్లా నాయక్` సినిమాపై నిబంధనలు సరికాదని చెబుతూ ట్వీట్లు చేశారు చంద్రబాబు. అలాగే `భీమ్లా నాయక్` సినిమా బాగుందుని, చూడాలని ఆతృతగా ఉందని లోకేష్ సైతం చెప్పడంతో దీనికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉంటే మంత్రి ఇంకా మాట్లాడుతూ, టికెట్ల రేట్లకి సంబంధించిన సినిమా పెద్దలు వచ్చి మాట్లాడారు. దాన్ని పరిష్కారం కోసం మేం చర్యలు చేపడుతున్నామని, టికెట్ రేట్లకి సంబంధించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని లా స్కూటి చేశామని,ఈ నెల 23, 24నగానీ జీవో విడుదల కావాల్సి ఉందని, కానీ మంత్రి గౌతంరెడ్డి చనిపోవడం వల్ల ఆలస్యమైందన్నారు. మంత్రి చనిపోయినందుకు `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని రెండు రోజులు వాయిదా వేసుకున్నారు. మరి అలానే సినిమాని ఎందుకు వాయిదా వేసుకోలేదని ప్రశ్నించారు. జీవో వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా సినిమా రిలీజ్ చేసుకుని ఈ నాటకాలేంటన్నారు మంత్రి.
సినిమా బాగుంటే జనం ఇరగబడి చూస్తారని, ఇటీవల విడుదలైన `పుష్ప` సినిమాని అలానే చూశారని, మహేష్ నటించిన `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` చిత్రాలను చూశారని, ఇటీవల చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త కుర్రాడి `ఉప్పెన` సినిమాని, అలాగే ముగ్గురు చిన్న కుర్రాళ్లు సరదాగా నటించిన (జాతిరత్నాలు) సినిమాని కూడా ఇరగబడి చూశారని తెలిపారు. నాగార్జున ఇద్దరు కుమారుల సినిమాలను కూడా గట్టిగా చూశారని చెప్పారు. అలానే పవన్ కళ్యాణ్ సినిమాని చూస్తారని తెలిపారు. అది `గబ్బర్ సింగ్ 2` అయితే సాయంత్రానికి ఎవరూ రారని, `అత్తారింటికి దారేది` లా ఉంటే జనం బాగా చూస్తారని పవన్‌కి చురకలంటించారు మంత్రి పేర్నినాని.