ట్రెడిషనల్ లుక్ లో వరుణ్ తేజ్ హీరోయిన్ మెరుపులు.. క్యూట్ ఫోజులతో కట్టిపడేస్తున్న మెహ్రీన్ పిర్జాదా
‘ఎఫ్2’ బ్యూటీ మెహ్రీన్ వరుసగా ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
బ్యూటీఫుల్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) నేచురల్ స్టార్ నాని సరసన తన తొలిచిత్రం ‘కృష్ణ గాడి వీరప్రేమగాధ’లో నటించింది. టాలీవుడ్ తో పాటు తన కెరీర్ లోనూ ఇదే మొదటి సినిమా. ఫస్ట్ మూవీతోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు దక్కించుకుంది.
అందం, నటన పరంగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా మెహ్రీన్ కు టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశం దక్కింది. ‘మహానుభావులు’, ‘రాజా ది గ్రేట్’, ‘పంతం’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
కానీ ‘ఎఫ్2’ చిత్రంలోని హానీ బేబీ పాత్రతో ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయ్యింది. వరుణ్ తేజ్ సరసన ధీటు పెర్ఫామెన్స్ తో అదరగొట్టడంతో టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఈ బ్యూటీ తమిళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.
రీసెంట్ గా ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ లో సంజనగా నటించింది. ఏకంగా బోల్డ్ సీన్లలో పెర్ఫామ్ చేసి మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది.
ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తోంది. పద్ధతిగా దర్శనమిచ్చి కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా బ్యూటీఫుల్ చుడీదార్ లో కనిపించింది. ఈ సందర్భంగా ఫ్లడ్ లైట్ వెలుతురులో క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది.
మొహాన్ని చిరునవ్వుతో వెలిగిస్తూ... క్యూట్ క్యూట్ అందాలతో ఆకట్టుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. ట్రెడిషనల్ వేర్ లో తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ కట్టిడేస్తోంది. ఇక మెహ్రీన్ ప్రస్తుతం ‘స్పార్క్’, ‘నీ సిగూవరేగు’ అనే చిత్రాల్లో నటిస్తోంది.