MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాబోయే భర్తతో వెళ్లి సూపర్ స్టార్ రజనీని పెళ్ళికి ఇన్వైట్ చేసిన నితిన్ హీరోయిన్, ఫోటోలు ఇవే

కాబోయే భర్తతో వెళ్లి సూపర్ స్టార్ రజనీని పెళ్ళికి ఇన్వైట్ చేసిన నితిన్ హీరోయిన్, ఫోటోలు ఇవే

నటి మేఘా ఆకాష్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వితన ప్రియుడిని వివాహం చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిసి పెళ్లికి ఇన్వైట్ చేసింది.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 25 2024, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేఘా ఆకాష్, సాయి విష్ణు

మేఘా ఆకాష్, సాయి విష్ణు

కోలీవుడ్‌లో యువ నటిగా రాణిస్తున్నారు మేఘా ఆకాష్. ఆమె తమిళంలో ఎన్నై నోకి పాయుమ్ తోటా, పేట, యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్ వంటి చిత్రాల్లో నటించారు. ఆమె తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఆమె గత ఆరు సంవత్సరాలుగా సాయి విష్ణు అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. ఆమె సీక్రెట్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు బయటపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రజినీని కలిసిన మేఘా ఆకాష్

రజినీని కలిసిన మేఘా ఆకాష్

మేఘా ఆకాష్ ప్రియుడు మరెవరో కాదు, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తిరునవుక్కరసు కుమారుడు సాయి విష్ణు. వీరిద్దరికీ 9 ఏళ్లుగా పరిచయం ఉంది. మొదట స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ గత 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి సిద్ధమవుతున్నారు.

 

34
రజినీకి ఆహ్వానం

రజినీకి ఆహ్వానం

మేఘా ఆకాష్ - సాయి విష్ణుల వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరగనుంది. వీరి వివాహ ఏర్పాట్లు ప్రస్తుతం ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి మేఘా ఆకాష్ తన కాబోయే భర్తతో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఆయన నివాసంలో కలిసి వివాహ ఆహ్వానం అందజేశారు.

44
మేఘా, సాయిలతో రజినీ

మేఘా, సాయిలతో రజినీ

 మేఘా ఆకాష్ - సాయి విష్ణు జంటను ఆశీర్వదించిన రజినీకాంత్ వారితో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం కాసేపు వారితో ముచ్చటించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. రజినీతో పేట సినిమాలో నటించిన మేఘా ఆకాష్ తాను ఎప్పటికీ రజినీ అభిమానినని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తెలుగులో మేఘా ఆకాష్ నితిన్ తో కలసి లై, చల్ మోహన్ రంగ అనే చిత్రంలో నటించింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaishnavi Sony: ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న తెలంగాణ పిల్ల, మరో నాగదుర్గ కానుందా?
Recommended image2
Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Recommended image3
Toxic Release Date: ఆడియెన్స్ కి టాక్సిక్‌ టీమ్‌ కండీషన్స్.. వీళ్లు సినిమా చూడకూడదు, వీడియో మైండ్ బ్లోయింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved