మెగా ఫ్యాన్స్ కి షాక్, విశ్వంభర ఇప్పట్లో రాదా..చిరంజీవి కూతురి వల్లే ఇదంతా ?
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాల విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 చిత్రం ఉగాది సందర్భంగా నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాల విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 చిత్రం ఉగాది సందర్భంగా నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది. విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరై ముహూర్తపు షాట్ పై క్లాప్ ఇచ్చారు. రాఘవేంద్ర రావు, సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
Mega 157
చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రాన్ని చిరు 157 చిత్రంగా అనౌన్స్ చేసారు. దీనితో కాస్త గందరగోళం నెలకొంది. గతంలో విశ్వంభర చిత్రాన్ని మెగా 157 అని అనౌన్స్ చేశారు. టైటిల్ రిలీజ్ అయ్యాక విశ్వంభర పేరు వైరల్ గా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ లేట్ కావడంతో ఈ చిత్ర రిలీజ్ కూడా ఆలస్యం అవుతోంది. అయితే విశ్వంభర చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ లేదు. ఇప్పుడు చిరంజీవి అనిల్ రావిపూడి మెగా 157 చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు.
Mega 157
అంటే విశ్వంభర కంటే ముందుగా అనిల్ రావిపూడి చిత్రమే రిలీజ్ అవుతుందా / విశ్వంభర ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టమేనా ? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నంబర్ విషయంలో కన్ఫ్యూజన్ అవసరం లేదు అని అంటున్నారు.
ఎట్టి పరిస్థితిల్లో విశ్వంభర చిత్రం జూలై లేదా ఆగస్టు లో రిలీజ్ అవుతుంది అని ఐదు నెలల గ్యాప్ తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి చిత్రం రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. మరి ఏం జరగబోతోందో చూడాలి. నంబర్ కన్ఫ్యూజన్ మెగా డాటర్ సుస్మిత వల్లే అని కూడా అంటున్నారు. సుష్మిత తన తండ్రితో సినిమా చేయాలని మెగా 156 చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దీనితో విశ్వంభర చిత్రాన్ని 157 అని పిలవాల్సి వచ్చింది. కానీ సుస్మిత నిర్మాణంలో చిరంజీవి చిత్రం ప్రారంభం కాలేదు. ఆ తర్వాత విశ్వంభర మూవీ 157 కాకుండాఆ 156 గా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు అనిల్ రావిపూడి చిత్రం 157 అని వేశారు.