MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమ అడ్డాలో మెగాస్టార్..క్లాసీ లుక్ లో మాస్ వీరయ్య, అన్ లిమిటెడ్ ఫన్ లోడింగ్

సుమ అడ్డాలో మెగాస్టార్..క్లాసీ లుక్ లో మాస్ వీరయ్య, అన్ లిమిటెడ్ ఫన్ లోడింగ్

యాంకర్ సుమ బుల్లితెర కార్యక్రమాలకి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బ్రాండ్ యాంకర్ గా మారిపోయింది. తన సీనియారిటీని అంతా జోడించి సుమ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 07 2023, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాంకర్ సుమ బుల్లితెర కార్యక్రమాలకి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బ్రాండ్ యాంకర్ గా మారిపోయింది. తన సీనియారిటీని అంతా జోడించి సుమ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా సుమ హోస్ట్ గా మరో షో ప్రారంభం అయింది. సుమ అడ్డా పేరుతో సరికొత్త షోని ప్రారంభించబోతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్ లో యువ హీరో సంతోష్ శోభన్ అతిథిగా కనిపించబోతున్నాడు. 

26

అయితే సెకండ్ ఎపిసోడ్ పై అందరి దృష్టి పడింది. రెండవ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. చిరంజీవి ఒక గేమ్ షోకి అతిథిగా హాజరు కానున్నాడనే న్యూస్ ఆసక్తిగా మారింది. వాల్తేరు వీరయ్య చిత్ర ప్రచారం కోసం చిరు ఇలా సుమ షోకి హాజరవుతున్నారు. చిరంజీవి కూడా డైరెక్టర్ బాబీ కూడా ఈ షోలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

36

చిరంజీవి ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న ప్రోమో విడుదల చేశారు. మాస్ వీరయ్య క్లాసీ లుక్ లో ఎంటర్ అయ్యారు. చిరు ఎంట్రీ అదిరిపోయింది. 'క్లాసు మాస్ కలిపితే భయ్యా.. వస్తున్నాడు మన వీరయ్య అంటూ సుమ చిరంజీవికి స్వాగతం పలికింది. 

46

చిరంజీవి కూడా ఫుల్ ఫన్ మూడ్ లో కనిపించారు. 'డోంట్ స్టాప్ లాఫింగ్.. సుమ అడ్డా లోడింగ్ ' అంటూ తనదైన శైలిలో డైలాగ్ కొట్టారు. తనకు మాత్రమే సాధ్యమైన మ్యానరిజమ్స్ చూపించారు. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. 

56

వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిరంజీవి మాస్ ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ చిత్రం చిరంజీవి స్టైల్ లో సాగే మాస్ మూవీ అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో రవితేజ పాత్ర కూడా ఆసక్తికరంగా మారుతోంది. 

66

మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య ఇద్దరూ సంక్రాంతికి సందడి చేయబోతుండడంతో సంక్రాంతి ఫైట్ ఆసక్తిగా మారింది. ఈ రెండు చిత్రాలతోనే వందల కోట్లలో బాక్సాఫీస్ లెక్కలు నమోదు కాబోతున్నట్లు తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్‌ మెయిన్‌ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఛాలెంజ్‌
Recommended image2
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Recommended image3
Ramayana: 4000 కోట్ల 'రామాయణ'లో రాముడిగా రణ్‌బీర్.. కూతురు రాహా అడిగిన ప్రశ్నలకు ఫిదా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved