- Home
- Entertainment
- దేవుడిచ్చిన తమ్ముళ్లు సాధించిన విజయం ఇది.. బేబీ హీరోయిన్ వైష్ణవిని ఆ సీనియర్ నటితో పోల్చిన చిరు
దేవుడిచ్చిన తమ్ముళ్లు సాధించిన విజయం ఇది.. బేబీ హీరోయిన్ వైష్ణవిని ఆ సీనియర్ నటితో పోల్చిన చిరు
బేబీ చిత్ర జైత్ర యాత్ర కొనసాగుతోంది. చిన్న చిత్రం గా విడుదలైన బేబీ మూవీ అతిపెద్ద సంచలనం సృష్టించింది.తాజాగా బేబీ చిత్ర యూనిట్ మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం.

బేబీ చిత్ర జైత్ర యాత్ర కొనసాగుతోంది. చిన్న చిత్రం గా విడుదలైన బేబీ మూవీ అతిపెద్ద సంచలనం సృష్టించింది. యువతని ఆకట్టుకుంటూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు, ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ తో ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తాజాగా బేబీ చిత్ర యూనిట్ మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. ఈ వేడుకలో బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కె ఎన్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన్ని తాము ఎలా ఆదర్శంగా తీసుకున్నామో వివరించారు.
అనంతరం చిరు మాట్లాడుతూ ఇది బేబీ సక్సెస్ వేడుకా లేక తన సన్మాన సభా అని చమత్కరించారు. చిరు మాట్లాడుతూ' పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నా, తోడబుట్టిన తమ్ముళ్లు విజయం సాధిస్తే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో చూశా. ఇప్పుడు నాకు దేవుడిచ్చిన తమ్ముళ్లు నా అభిమానులు విజయం సాధిస్తే ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను.
ఎస్ కె ఎన్, సాయి రాజేష్ లని ముందు నుంచి గమనిస్తున్నా. థియేటర్స్ లో నా సినిమాలు చూడడం దగ్గరే ఆగిపోకుండా కష్టపడి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. నా అభిమానులు ఇంత పెద్ద విజయం సాధించారు కాబట్టి ఇందులో నేను కూడా భాగం అయ్యేందుకు ఈ వేడుకకి వచ్చా.
డైరెక్టర్ మారుతి నా అభిమానిగా వచ్చాడు. ఒకసారి నా పర్సనల్ వీడియో ఒకటి ఇచ్చి దీనికి సౌండ్ మిక్స్ చేసుకునిరా అని చెప్పా. చాలా అద్భుతంగా చేశాడు. నీకు డైరెక్టర్ అయ్యే ట్యాలెంట్ ఉందని ప్రోత్సహించా. ఇప్పుడు పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు.
హృదయ కాలేయం చిత్రం తెరకెక్కించిన సాయి రాజేష్.. ఒక కామెడీ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడిగా మాత్రమే ఆగిపోకుండా బేబీ చిత్రంతో దర్శకుడిగా పూర్తి స్థాయి ప్రతిభ చూపాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ఓ చిత్రం గతంలో చూశా.
కానీ ఈ మూవీలో ఆనంద్ నటనలో ఎంతో మెచ్యూరిటీ కనిపించింది. ముఖ్యంగా హీరోయిన్ వీడియో చూసే సీన్ లో అతడి నటన ఎంతో సెటిల్డ్ గా హృదయాన్ని టచ్ చేసే విధంగా అనిపించింది. వైష్ణవి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ఎంతో సహజంగా నటించింది.
సహజ నటి జయసుధ తర్వాత అంత నేచురల్ గా నటించే నటి నాకు కనిపించలేదు. వైష్ణవిలో ఆ లక్షణాలు ఉన్నాయి అంటూ చిరు ఆమెపై ప్రశంసలు కురిపించారు. అలాగే విరాజ్ నటనని కూడా చిరు అభినందించారు. ఈ చిత్రాన్ని తల్లి దండ్రులు సైబర్ నేరాల విషయంలో పిల్లలని ఎడ్యుకేట్ చేసే విధంగా చూపించాలని చిరు కోరారు.