- Home
- Entertainment
- రైన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు చిరంజీవి ఫీలింగ్ ఏంటి ? డాక్టర్ ప్రశ్నకి మెగాస్టార్ దిమ్మతిరిగే ఆన్సర్
రైన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు చిరంజీవి ఫీలింగ్ ఏంటి ? డాక్టర్ ప్రశ్నకి మెగాస్టార్ దిమ్మతిరిగే ఆన్సర్
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలామంది హీరోయిన్లతో నటించారు. శ్రీదేవి రాధ రాధిక విజయశాంతి లాంటి అగ్ర నటి చిరంజీవి అనేక చిత్రాల్లో నటించారు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి చిరంజీవికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలామంది హీరోయిన్లతో నటించారు. శ్రీదేవి, రాధ, రాధిక, విజయశాంతి లాంటి అగ్ర నటి చిరంజీవి అనేక చిత్రాల్లో నటించారు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి చిరంజీవికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర వృత్తుల్లో కూడా కొన్నిసార్లు మహిళలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. సినిమాల్లో ఐతే హీరోలు హీరోయిన్లతో క్లోజ్ గా మూవ్ అవ్వాల్సి ఉంటుంది.
megastar chiranjeevi
అలాంటి టైంలో మీరు ఎప్పుడైనా హీరోయిన్లతో ప్రేమలో పడ్డారా? పెళ్ళికి ముందు మీకు ఏమైనా లవ్ స్టోరీ లు ఉన్నాయా? అని డాక్టర్ గోపీచంద్ చిరంజీవిని ప్రశ్నించారు.డాక్టర్ గోపీచంద్ చిరంజీవి ఫ్యామిలీకి సన్నిహితులు. గోపీచంద్ ప్రశ్నకు చిరంజీవి వెంటనే నవ్వేశారు. ఆయన ప్రశ్నకు చిరు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో నటీనటులు చాలా బలహీనతలకు లోనవుతారు అనే అపోహ ఉంది.
నేను మాత్రం ఎలాంటి బలహీనతలకు లోను కాలేదు. ఏదైనా బలహీనత ఉంటే మన వృత్తిలో రాణించడం ఎదగడం కష్టం. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే హీరోయిన్లతో కానీ ఇంకెవరితో అయినా కానీ నా సంబంధాలు వృత్తి వరకే పరిమితం అయ్యేవి. రైన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు చిరంజీవి చాలా రొమాంటిక్గా చేస్తున్నాడని ప్రేక్షకులు అనుకోవచ్చు. కానీ షూటింగ్లో అలా ఉండదు.
దర్శకుడు అనుకున్న విధంగా సాంగ్ బాగా వచ్చిందా లేదా? నటీనటులుగా మేము అందంగా కనిపిస్తున్నామా లేదా? ఇలాంటి అంశాలు మాత్రమే కీలకమవుతాయి. సాంగ్స్ లో హీరోయిన్లతో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ అది ఆ సాంగ్ బాగా రావడం కోసం మాత్రమే అని చిరంజీవి అన్నారు.
పైగా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కెరీర్ ఆరంభం నుంచి ఆయన్ని మనసులో తలుచుకునే వాడిని. నా మనసు ఎప్పుడు డీవియేట్ కాకుండా కెరీర్ పైనే ఫోకస్ చేయగలిగాను అని చిరంజీవి అన్నారు. చిరంజీవి తన కెరీర్లో విజయశాంతి, వాణి విశ్వనాథ్, రాధా, రోజా లాంటి హీరోయిన్లతో రెయిన్ సాంగ్స్ చేశారు.