MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమాండ్ ఇస్తే నరుక్కుంటూ వస్తా..వెంకీతో మల్టీస్టారర్ కి స్టోరీ లైన్ ఫిక్స్, చిరంజీవి క్రేజీ కామెంట్స్

కమాండ్ ఇస్తే నరుక్కుంటూ వస్తా..వెంకీతో మల్టీస్టారర్ కి స్టోరీ లైన్ ఫిక్స్, చిరంజీవి క్రేజీ కామెంట్స్

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 01 2024, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

26

జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ నటించని జోనర్ చిత్రం ఇది. దీనితో సైంధవ్ చిత్రం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. 

36

వెంకటేష్ 75 వ చిత్రం కావడంతో సెలబ్రేటింగ్ వెంకీ 75 పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర రావు, మెగాస్టార్ చిరంజీవి లాంటి అతిరథ మహారథులు హాజరైన సంగతి తెలిసిందే. చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో చిరు, వెంకీ మధ్య బాండింగ్ మరోసారి బయట పడింది. 

46

వెంకటేష్ మాట్లాడుతూ చిరంజీవి కనుక సినిమాల్లోకి ఈ ఎంట్రీ ఇవ్వకుంటే తాను హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని అని వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. చిరంజీవి ప్రసంగం కూడా నెమ్మదిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

56

మేమేమిద్దరం కలసి సినిమా చేస్తే బావుంటుందనేది నా కోరికతో పాటు వెంకీ కోరిక కూడా అని చిరంజీవి అన్నారు. వెంకీ నాకు మా ఇద్దరి మల్టీస్టారర్ స్టోరీ లైన్ కూడా చెప్పేసాడు. నువ్వు ముందు ఉండి కమాండ్ ఇవ్వు చాలు.. వెనుక నుంచి నేను నరుక్కుంటూ వస్తా అని చెప్పాడట. తమ చిత్రానికి కథ ఇదే విధంగా ఉండాలని వెంకీ చెప్పాడట. 

66

వీలైనంత త్వరగా మా ఇద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం రావాలని కోరుకుంటున్నట్లు చిరు తెలిపారు. విక్టరీ వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Recommended image2
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved