చిరంజీవి కెరీర్ లో పరమ చెత్త సినిమా, దానివల్ల నానా మాటలు పడ్డ మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒక దశలో పట్టిందల్లా బంగారం అయింది. వరుస హిట్ చిత్రాలతో చిరంజీవి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్యాడ్ టైం అంటే 1993 నుంచి 1997 మధ్య కాలం అని చెబుతారు.

megastar chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒక దశలో పట్టిందల్లా బంగారం అయింది. వరుస హిట్ చిత్రాలతో చిరంజీవి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్యాడ్ టైం అంటే 1993 నుంచి 1997 మధ్య కాలం అని చెబుతారు. ఆ టైంలో చిరంజీవి పలు ఫ్లాప్ చిత్రాలు ఎదురయ్యాయి.
Chiranjeevi
ఆ టైంలో చిరంజీవి నటించిన మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరుశురాం, బిగ్ బాస్ లాంటి చిత్రాలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. కొంతకాలం గ్యాప్ తీసుకుని చిరంజీవి హిట్లర్ చిత్రంలో బ్లాక్ బస్టర్ కొట్టారు. చిరంజీవి కెరీర్ లో ఫ్లాప్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. కానీ ఒక హిట్ చిత్రం కూడా మెగాస్టార్ కెరీర్ లో చెత్త మూవీగా మిగిలిపోయింది. ఇది విచిత్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు. సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్. కానీ కంటెంట్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ చిత్రం పేరు అల్లుడా మజాకా. ఈ మూవీ కూడా చిరంజీవికి బ్యాడ్ టైం ఉన్న పీరియడ్ లోనే విడుదలయింది.
దేవి వరప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. అంతకు ముందే దేవి వరప్రసాద్ చిరంజీవి ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి ఘరానా మొగుడు తర్వాత కూడా చిరంజీవితోనే సినిమా చేయాలని దేవి వరప్రసాద్ ప్రయత్నించారు. రాఘవేంద్ర రావుతో కూడా చర్చలు జరిపారు. కానీ చిరంజీవి అప్పటికే వారే వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత చిరంజీవి డేట్లు దేవి వరప్రసాద్ కి దొరికాయి. కానీ ఆ టైంలో రాఘవేంద్ర రావు బిజీ ఉన్నారు. అప్పుడు హలో బ్రదర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈవీవీ సత్యనారాయణ పేరు ఇండస్ట్రీ మొత్తం వినిపించింది.
వెంటనే దేవి వరప్రసాద్ ఈవీవీ, చిరంజీవి కాంబినేషన్ సెట్ చేశారు. ఆ విధంగా అల్లుడా మజాకా చిత్రం సెట్ అయింది. ఈ చిత్రానికి కథ అందించింది ఎవరో కాదు.. నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణమురళి. కథ చెప్పినప్పుడు చిరంజీవికి నచ్చింది. కానీ కొన్ని సన్నివేశాలు కాస్త ఇబ్బంది కరంగా ఉన్నాయి, డైలాగులు కూడా డబుల్ మీనింగ్ ఎక్కువగా ఉన్నాయి అని చిరంజీవి హెచ్చరించారట. అభిమానులు ఇలాంటి ఊర మాస్ నే మీ నుంచి కోరుకుంటారు అని ఈవీవీ కన్విన్స్ చేశారట.
Alluda Majaka
ముందుగా ఈ చిత్రంలో అత్త పాత్రకి వాణిశ్రీని అనుకున్నారు. ఆమె కూడా ఇంట్రెస్ట్ చూపారు. కానీ సన్నివేశాలు మరీ వల్గర్ గా ఉన్నాయని గ్రహించడంతో వాణిశ్రీ చేయనని చెప్పారట. దీనితో ఆ అవకాశం ప్రముఖ నటి లక్ష్మికి వెళ్ళింది. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వయంగా ఈ చిత్ర ఓపెనింగ్ ఈవెంట్ కి హాజరయ్యారు. చిరంజీవి, రమ్యకృష్ణపై ఆయన క్లాప్ ఇచ్చారు. రిలీజ్ కి ముందే ఈ చిత్ర పాటలు సంచలనం సృష్టించాయి. భారీ అంచనాలతో అత్యధిక ప్రింట్స్ తో ఈ చిత్రం విడుదలయింది.
Alluda Majaka
తొలి షో నుంచే అల్లుడా మజాకా చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. చిరంజీవి మాస్ రొమాంటిక్ కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ కి బాగా నచ్చాయి. కొన్నివారాల పాటు కలెక్షన్స్ అదిరిపోయాయి. నిర్మాత సేఫ్. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. ఈ చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగులు, అత్తతో చిరంజీవి చేసే కామెడీ చాలా వల్గర్ గా ఉన్నాయి అంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగారు. అంత పేరున్న చిరంజీవి ఇంత దారుణమైన సినిమాలో నటించడం ఏంటి అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చిరంజీవి ఇలాంటి చీప్ కామెడీ చేయడం అవసరమా అంటూ నిందలు మోయాల్సి వచ్చింది. వివాదం ఎక్కువ కావడంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి మరోసారి సెన్సార్ చేసింది.
Alluda Majaka
అభ్యంతరకర సన్నివేశాలు తొలగించారు. దీనితో స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సినిమాలో ఆందోళన చేయాల్సిన అసభ్యత లేదు. అయినా కూడా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అని చిరంజీవి మీడియా ముఖంగా కోరారు. మొత్తంగా అల్లుడా మజాకా చిత్రం హిట్ అయినప్పటికీ చిరంజీవి కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయింది.