- Home
- Entertainment
- రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన హీరోయిన్ ని పక్కన పెట్టి గుజరాతీ బ్యూటీని తీసుకొచ్చిన చిరు.. సినిమా మటాష్
రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన హీరోయిన్ ని పక్కన పెట్టి గుజరాతీ బ్యూటీని తీసుకొచ్చిన చిరు.. సినిమా మటాష్
హీరోయిన్ సెలక్షన్ విషయంలో చిరంజీవి పెద్ద మిస్టేక్ చేశారు. రెండు సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన హీరోయిన్ ని పక్కన పెట్టి గుజరాతీ బ్యూటీని ఎంపిక చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన చాలా మంది హీరోయిన్లు ఆయతో పోటీగా డ్యాన్స్ చేయాలని ప్రయత్నించారు. రమ్యకృష్ణ, రంభ, విజయశాంతి లాంటి హీరోయిన్లు కొంతవరకు చిరుని మ్యాచ్ చేయగలిగారు. ఆ తర్వాత తరం హీరోయిన్లు ఎవరూ చిరంజీవి డ్యాన్స్ కి పోటీ ఇవ్వలేకపోయారు.
Chiranjeevi
సోనాలి బింద్రే , శ్రీయ శరన్, ఆర్తి అగర్వాల్ లాంటి హీరోయిన్లు గ్లామర్ తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. వీరిలో సోనాలి బింద్రే చిరంజీవికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఒక వైపు చిరు మాస్ స్టెప్పులతో అలరిస్తుంటే మరోవైపు సోనాలి బింద్రే గ్లామర్ తో అదరగొట్టింది.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే చిరు శంకర్ దాదా ఎంబిబిఎస్ కి సీక్వెల్ గా నటించిన శంకర్ దాదా జిందాబాద్ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో చిరు కామెడీ టైమింగ్ ఎంత ప్లస్ అయ్యిందో.. సోనాలిబింద్రే తో కెమిస్ట్రీ కూడా అంత బాగా వర్కౌట్ అయింది.
శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రానికి హీరోయిన్ ప్లస్ అయితే.. జిందాబాద్ చిత్రానికి బిగ్ మైనస్ హీరోయిన్. సోనాలి బింద్రేని పక్కన పెట్టి ఎక్కడో లండన్ లో పుట్టి పెరిగిన గుజరాతీ సంతతి మోడల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె పేరు కరిష్మా కోటక్. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం, అదే విధంగా హీరోయిన్ ఇద్దరూ పెద్ద మైనస్ అని ఇప్పటికి అభిమానులు అంటుంటారు.
చిరంజీవి పక్కన కరిష్మా ఏమాత్రం సెట్ కాలేదు. దీనితో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఫ్యాన్స్ సోనాలి బింద్రేని బాగా మిస్ అయ్యారు. కరిష్మా నటన కూడా సోసో గానే సాగింది. ఫలితంగా మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఆమె తండ్రి గుజరాత్ నుంచి లండన్ వెళ్లి సెటిల్ అయ్యారు.
తెలుగులో కరిష్మా ప్రయాణం శంకర్ దాదా జిందాబాద్ చిత్రంతోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. కరిష్మా కోటక్ ఐపీఎల్ లో యాంకర్ గా కూడా కొంతకాలం వ్యవహారించింది. హిందీ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది.