- Home
- Entertainment
- అమెరికన్ టాక్ షోలో రాంచరణ్.. ఫస్ట్ బేబీ గురించి ఫన్నీ డిస్కషన్, రాజమౌళిని ఎవరితో పోల్చాడంటే..
అమెరికన్ టాక్ షోలో రాంచరణ్.. ఫస్ట్ బేబీ గురించి ఫన్నీ డిస్కషన్, రాజమౌళిని ఎవరితో పోల్చాడంటే..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం యుఎస్ లో సందడి చేస్తున్నారు. అందరికీ తెలుసు.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్స్ కి నామినేషన్స్ లో నిలిచింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం యుఎస్ లో సందడి చేస్తున్నారు. అందరికీ తెలుసు.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్స్ కి నామినేషన్స్ లో నిలిచింది. ఇది యావత్ దేశానికీ గర్వకారణంగా మారింది. ఆస్కార్ అవార్డుని కూడా కైవసం చేసుకుంటే.. ఇండియా మొత్తం పులకరించిపోవడం ఖాయం.
మార్చి 12న 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్, అభిమానులు అంతా నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుంది అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాంచరణ్ అమెరికా చేరుకున్నారు. ఫేమస్ అమెరికన్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కింది.
తాజాగా చరణ్ ఈ షోలో పాల్గొన్నాడు. ముగ్గురు యాంకర్లు చరణ్ తో చిట్ చాట్ చేశారు. వీరితో రాంచరణ్ సంభాషణ చాలా ఫన్నీగా సాగింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధానమైనది ఏంటి ఎన్ని యాంకర్స్ ప్రశ్నించగా.. ఫ్రెండ్ షిప్, అన్నదమ్ముల బంధం అని రాంచరణ్ వివరించారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం నా దర్శకుడు రాజమౌళి గారి గొప్ప రచనల్లో ఒకటి. ఆయన్ని మేమెంత ఇండియన్ స్పీల్ బర్గ్ అని పిలుస్తాం అంటూ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జక్కన్నని స్పీల్ బర్గ్ తో పోల్చారు. తన తదుపరి చిత్రంతో రాజమౌళి గ్లోబల్ సినిమాపై కూడా తన మార్క్ ప్రదర్శిస్తారు అని చరణ్ పేర్కొన్నారు.
ఇక నాటు నాటు సాంగ్ డ్యాన్స్, లిరిక్స్ ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ ఐంది అని చరణ్ పేర్కొన్నాడు. 88 ఏళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఇంతలో మరో యాంకర్ కలగజేసుకుని... నువ్వు ఇప్పుడు చాలా బిజీగాఉండి ఉంటావు.. ఎందుకంటే త్వరలో ఫస్ట్ బేబీ రాబోతోంది కదా అని పేర్కొంది.
దీనితో మిగిలిన యాంకర్లు కూడా రాంచరణ్ కి కంగ్రాట్స్ చెప్పారు. తండ్రి కాబోతున్నందుకు ఎలాంటి భయం ఉంది అని అడగగా.. ఇన్నేళ్లు నేను ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు అని ఫన్నీగా చరణ్ సమాధానం ఇచ్చాడు. యాంకర్స్ లో ఒక లేడి యాంకర్ గైనకాలజిస్ట్ అని రాంచరణ్ కి ముందే తెలుసు. నేను మీ నంబర్ తీసుకుంటాను. ఉపాసన నేను అమెరికా వచ్చినప్పుడు అందుబాటులో ఉండండి అని చరణ్ ఫన్నీగా అడిగాడు. దీనితో యాంకర్.. తప్పకుండా.. మీతో కలసి ఎక్కడికైనా ట్రావెల్ చేసేందుకు సిద్ధం అని ఆ యాంకర్ పేర్కొంది.
గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొనడానికి చరణ్ స్టూడియో వెళ్లగా.. బయట పెద్ద సంఖ్యలో అభిమానులు మెగా పవర్ స్టార్ కోసం ఎదురుచూశారు. వారందరికి రాంచరణ్ సెల్ఫీలు ఇచ్చాడు.