MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • సాయం అడిగిన సీనియర్ హీరోయిన్..కుదరదని చెప్పేసిన చిరు, నెగిటివ్ గా ఎలా ప్రచారం చేసిందంటే

సాయం అడిగిన సీనియర్ హీరోయిన్..కుదరదని చెప్పేసిన చిరు, నెగిటివ్ గా ఎలా ప్రచారం చేసిందంటే

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. అందరితో చిరంజీవికి మంచి బాండింగ్ ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 15 2024, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. అందరితో చిరంజీవికి మంచి బాండింగ్ ఉంది. చిరంజీవితో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్లలో రాధా, రాధికా, విజయశాంతి, సుహాసిని లాంటి సీనియర్లు ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వీళ్లంతా చిరంజీవితో స్నేహపూర్వకంగా ఉంటారట. అయితే కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి, సుహాసిని మాత్రం టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవారట. ఈ విషయాన్ని సుహాసిని తెలిపింది. సుహాసిని తన రెండవ చిత్రంలోనే చిరంజీవితో కలసి నటించింది. ఆ చిత్రం మంచు పల్లకి. ఒక చిత్ర షూటింగ్ లో నేను చిరంజీవిని చూశానని సుహాసిని తెలిపింది. అప్పటికి నేను ఇంకా హీరోయిన్ కాలేదు. 

36

అయితే చిరంజీవి అప్పట్లో సైలెంట్ గా ఉండేవారు. నన్ను చూసి ఈ అమ్మాయికి బాగా పొగరెక్కువ అని అనుకున్నారు. మంచు పల్లకి చిత్రంలో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ అమ్మాయిని ఎంపిక చేశారు ఏంట్రా బాబు అని చిరంజీవి అనుకున్నారట. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో చెన్నై నుంచి హైదరాబాద్ కి వస్తున్నాం. నెలరోజుల పాటు హైదరాబాద్ లో షూటింగ్ ఉంది. 

46

ఫ్లైట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు జీవితంలో మరచిపోలేను. మీకు ఏ హోటల్ బుక్ చేసారు అని అడిగారు. హోటల్ పేరు చెప్పాను. మీరు హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉండాలి అని అడిగారు. దాదాపు నెలరోజులు అని చెప్పాను. నాకు హైదరాబాద్ కాస్త కొత్త.. ఏదైనా సాయం కావాలంటే అడుగుతాను అని అన్నట్లుగా చిరంజీవికి చెప్పాను. 

56

ఆయన వెంటనే నన్ను ఎలాంటి సాయం అడగొద్దు.. నేను ఏమి చేయను అని మాట్లాడడం మానేశారు. ఆయన బిహేవియర్ కి షాక్ అయ్యాను అంటూ సుహాసిని నవ్వుతూ చెప్పారు. ఏంటి బాబోయ్ ఇలాంటి క్యారెక్టర్ ఈ వ్యక్తి అని అనుకున్నా. కానీ ఆయన నన్ను ఆటపట్టించడానికి అలా అన్నారు. 

66

అదే టైంలో సుమలత నన్ను కలిసింది. నీకు చిరంజీవితో ఛాన్స్ వచ్చింది అంట కదా అని అడిగింది.. అవును సో వాట్ అని అడిగాను. అదేంటే అలా అంటావు.. తెలుగులో ఆయన త్వరలో సూపర్ స్టార్ కాబోతున్నారు అని అంతా అంటున్నారు అని చెప్పింది. అవునా.. ఆయన ముఖం ఏంటి విలన్ లాగా ఉంటుంది అని వెటకారంగా అన్నాను. అంతే సుమలత వెళ్లి చిరంజీవికి చెప్పేసింది. చిరంజీవి షూటింగ్ కి రాగానే విలన్ తో యాక్ట్ చేసేది ఎవరు అంటూ వెటకారంగా మాట్లాడుతూ వచ్చారు. ఈయనకి ఎలా తెలిసిపోయింది అని అనుకున్నా. సుమలతని అడిగితే అవును నేనే చెప్పా అని చెప్పింది. చిరంజీవి గారు నాపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. నువ్వు హీరోయిన్ నేను విలన్ కదా అని ఆటపట్టిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మేము నెమ్మదిగా మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని సుహాసిని తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image2
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image3
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved