మెగా కోడలు లావణ్య త్రిపాఠి పేరున ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా..? వరుణ్ కు పోటీ ఇస్తోందిగా..?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళి సందడి అయిపోయింది. రిసెప్షెన్ తో మెగా ఇంట పెళ్ళి వేడుకుల ముగిసాయి. అయితే వీరి పెళ్ళి జరగబోతుంది అని తెలిసినప్పటి నుంచీ.. వీరి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి స్టార్ల పెళ్లి వేడుకలు ముగిసిన తరువాత కూడా వారికి సబంధించిన న్యూస్ హైలెట్ అవుతూనే ఉన్నాయి.
మెగా ఫ్యామిలీలో పెళ్లి వేడుకలు ముగిసాయి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది.. ఇక నిన్న (నవంబర్ 6) హైదరాబాద్ లో రిసెప్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహిచారు. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ సినీతారలు క్యూ కట్టారు. అయితే వీరి పెళ్ళి వార్తలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుణ్, లావణ్య గురించి ఏదొ ఒక న్యూస్ హైలెట్ అవుతూ వస్తోంది. తాజాగా లావణ్య త్రిపాఠికి చెందిన వార్త ఒకటి నెట్టింట తెగ తిరిగేస్తోంది.
లావణ్య త్రిపాఠి ఆస్తుల గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి పర్సనల్ గా ఎంత ఆస్త సంపాదించింది, ఫ్యామిలీకి ఎంత ఆస్తి ఉంది.. అనే విషయంలో నెటిజన్లు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. లావణ్య చూడటానికి తెలుగు అమ్మాయిలా ఉంటుంది కాని.. ఆమె నార్త్ ఇండియన్ అని చాలా తక్కువ మందికి తెలుస్తు.
ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లావణ్య.. 2012లో దాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో వరుస అవకాశాలు సాధించింది. కాని కొన్ని సినిమాల విషయంలో లావణ్య తీనసుకున్న నిర్ణయాలు, ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేయకపోవడం, స్కిన్ షోకు.. బెడ్ సీన్స్ , లిప్ లాక్ లకు దూరంగా ఉండటంతో.. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది లావణ్య,
బహుశా.. తను ఇంత స్ట్రిక్ట్ గా ఉండబట్టే.. వరుణ్ ను ఆకర్షించిందేమో.. మెగా కోడలు అవ్వగలిగిందేమో.. అయితే తాజాగా ఆమె ఆస్తులకు సబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. కెరియర్ లో ఎంత బిజీగా గడిపిన లావణ్య.. సినిమాకు 50 లక్షలపైనే రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే లావణ్య త్రిపాఠి సుమారు 20 కోట్ల విలువ చేసే ఆస్తులను కూడా పెట్టారని సమాచారం
అయితే ఇది కేవలం సోషల్ మీడియా సమాచారం ప్రకారం తెలిసిందే. ఈ ఆస్తి తను సినిమాల ద్వారా కష్టపడి సంపాదించిందని.. తనకు ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తి,పూర్వికుల నుంచి వచ్చేది కూడా చాలా ఉందని సమాచారం. ఆమెకు తండ్రి, తాత నుంచి భారీగా ఆస్తులు వస్తాయట. ఈలెక్కన వరుణ్ తేజ్ కు, మెగా ఫ్యామిలీకి ఏమాత్రం తక్కువ కాకుండా ఆమె ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది కేవలం ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించినదని తెలుస్తోంది అయితే ఈమె కుటుంబం మాత్రం బాగా ఉన్నతమైన కుటుంబం అని తెలుస్తుంది. వీరికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు భారీగానే ఉన్నాయట. ఇక ఆస్తుల విషయంలో మెగా కుటుంబానికి ఏమాత్రం తగ్గరని సమాచారం.
వరుణ్ తేజ్ నా ప్రేమించే దాదాపు 6 సంవత్సరాల పాటు ప్రేమ ప్రయాణం కొనసాగించినటువంటి ఈ జంట ఇలా పెద్దల సమక్షంలో ఒకటి అయ్యారు. ఇటలీలో వీరు ప్రపోజ్ చేసుకున్న చోటే.. వీరి వివాహం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్ళిలో మెగా ఫ్యామిలీ మాత్రమే సందడి చేసింది. టాలీవుడ్ నుంచి హీరో నితిన్ మాత్రం వరుణ్ పెళ్ళికి వెళ్లారు.