Varun Tej Pan India Movie: బాలాకోట్ బ్యాక్ డ్రాప్ లో అభినందన్ వర్థమాన్ గా మెగా ప్రిన్స్..?
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) త్వరలో పాన్ ఇండియా మూవీలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా పాకిస్తాన్ తో జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈసినిమాలో వరుణ్ తేజ్ పాత్ర స్పెషల్ కానుంది.
ఈ మధ్య టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. కొంచెం స్టార్ డమ్ ఉంటే చాలు పాన్ ఇండియా వైపు వెళ్తున్నారు.టాలీవుడ్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరగడం ఇందకు కారణం అని చెప్పుకోవచ్చు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కూడా ఇప్పుడు పాన్ ఇండియాను టార్గెట్ చేశారు. ఓ భారీ కథతో వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈవిషయంపై సోషల్ మీడియాలో రూమర్ గట్టిగా చక్కర్లు కొడుతుంది.
మూడేళ్ల క్రితం.. అంటే 2019 జనవరిలో పుల్వామ ధాడిలో 40 మంది భారత జవాన్లు మరణించారు. దాంతో అదే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా ధాడులు చేసి.. గట్టిగా సమాధానం చెప్పింది. ఆటైమ్ లో అభినందన్ వర్దమాన్ (Abhinandan Varthaman) అనే ఎయిర్ వింగ్ కమాండర్ పాకిస్తాన్ పై దాడుల్లో పాల్గోని బోర్డర్ దాటి మరీ.. వీరోచితంగా పోరాడి..పాకిస్తాన్ యుద్దవిమానాన్ని కూల్చి..దొరికిపోయారు. భారత్ సహా అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాక్.. అభినందన్ (Abhinandan Varthaman)ను మనకు అప్పగించక తప్పలేదు.
ఇక ఈ ఇన్ స్పైరింగ్ స్టోరీతో ఓ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కథతో సినిమా చేయాలని చాలా మంది ప్రత్నం చేశారు. కాని అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ రియల్ స్టోరీని వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కించాలని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దీని కోసం చర్చలు కూడా జరుగుతున్నాయట. ఈ మూవీలో అభినందన్ వర్ధమాన్(Abhinandan Varthaman) పాత్రలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నదానిపై కూడాసోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఇలాంటిసినిమాలు చేయడానికి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఘాజీ, అంతరిక్షంలో సినిమాల ఫేమ్ సంకల్ప్ రెడ్డి ( Sankalp Reddy) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని టాక్ విపినిస్తుంది. వరుణ్ తేజ్ (Varun Tej) తో ఆయన ఆల్ రెడీ అంతరిక్షన్ లో సినిమా చేసి..సక్సెస్ సాధించారు.
మరో వైపు గరుడ వేగ లాంటి సక్సెస్ పుల్ సినిమాలు అందించిన ప్రవీణ్ సత్తార్ (Praveen Sattar) పేరు కూడా ఈ సినిమా కోసం వినిపిస్తుంది. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నారు ప్రవీణ్ సత్తారు. ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్ మూవీ చేస్తున్నారు. గతంలోనే వరుణ్ తేజ్(Varun Tej), ప్రవీణ్ సత్తార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ అనే వార్తలు వినిపించాయి.
అటు వరుణ్ తేజ్ (Varun Tej) కూడా ఈ మూవీ కోసం ఆర్ రెడీ మేక్ ఓవర్ అయ్యి ఉన్నాడు. గని సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసిన వరుణ్ తేజ్.. టోన్డ్ బాడీతో.. పక్కాగా ఆర్మీకి సంబంధించిన ఫిట్ నెస్ ను సాధించాడు. ఆరడుగు మెగా హీరో ఈ సినిమాకు పక్కాగా సూట్ అవుతాడు అని మేకర్స్ నమ్ముతున్నారు. అందులోను పాన్ ఇండియ రేంజ్ లో ఈసినిమా పక్కాగా సక్సెస్ అవుతంది అనే నమ్మకం ఉంది.
టాలీవుడ్( Tollywood) నుంచి వస్తున్న సినిమా కావడంతో.. పాన్ ఇండియా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పుకార్లు గట్టిగానే షికారు చేస్తున్నయి. అయితే ఇప్పటి వరకూ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఈ సినిమా కన్ ఫార్మ్ అయితే మాత్రం.. ఫస్ట్ నుంచే అంచనాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.