- Home
- Entertainment
- చిరంజీవి, పవన్ ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుంది..? మెగా ఫ్యాన్స్ అతిపెద్ద బాక్సాఫీస్ యుద్దానికి సిద్ధంకండి!
చిరంజీవి, పవన్ ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుంది..? మెగా ఫ్యాన్స్ అతిపెద్ద బాక్సాఫీస్ యుద్దానికి సిద్ధంకండి!
మెగా స్టార్ పవర్ స్టార్ బాక్సాఫీస్ పోటీకి దిగితే ఎలా ఉంటుంది? మెగా ఫ్యాన్స్ తమ హీరోల చిత్రాల కోసం ఒకేసారి ఎగబడితే ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టంగా ఉన్నప్పటికీ ఇది జరగడం ఖాయమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 2023 సంక్రాంతికి అతిపెద్ద బాక్సాఫీస్ పోరు జరగనుందని అంచనా వేస్తన్నారు.

Pawan Kalyan Chiranjeevi
చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచమైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. తనకంటూ సపరేట్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకొని పెద్ద స్టార్ అయ్యాడు. ఇక పవన్ హీరోగా మారి రెండు దశాబ్దాలు దాటిపోగా చేసింది 27 చిత్రాలు మాత్రమే. పవన్ ఆచితూచి సినిమాలు చేస్తాడు. ఏడాదికి ఒక మూవీ కూడా కష్టమే.
Pawan Kalyan Chiranjeevi
ఈ కారణంగా చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్ చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలు లేవు. కొన్ని సినిమాలు నెలల గ్యాప్ లో విడుదలయ్యాయి. అన్నదమ్ములు కాబట్టి వాళ్ళ మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి ఒకవేళ ఒకే రోజు విడుదల చేయాల్సి వచ్చినా అడ్జస్ట్ చేసుకునేవారు. ఈ కారణంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముఖాముఖి పోటీ పడిన సందర్భం లేకుండా పోయింది.
Pawan Kalyan Chiranjeevi
అయితే రానున్న సంక్రాంతికి ఈ అరుదైన పోరు జరగనుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, చిరంజీవి మెగా 154 చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి అంటున్నారు. దీంతో చిరంజీవి, పవన్ మొదటిసారి బాక్సాఫీస్ ఫైట్ కి దిగే అవకాశం కలదని చెబుతున్నారు.
Pawan Kalyan Chiranjeevi
చిరంజీవి హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్God Father) దసరాకు విడుదల కానుందట. ఇటీవల గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఇది కూడా సెట్స్ పై ఉంది. దర్శకుడు బాబీతో మెగా 154 మూవీ చేస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది.
Pawan Kalyan Chiranjeevi
వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ సంక్రాంతి బరిలో దించాలనేది చిరంజీవి ఆలోచనట. సంక్రాంతికి మెగా 154(Mega 154) , ఉగాదికి భోళా శంకర్... ఇలా రానున్న మూడు పెద్ద పండగలకు చిరంజీవి చిత్రాలు విడుదల కానున్నాయి. మరోవైపు దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
మిగతా భాగాన్ని త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కి సూచించారు. రాజకీయంగా బిజీ కానున్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో పాటు వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu)షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
Pawan Kalyan Chiranjeevi
పవన్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు తెరక్కుతుంది. బడ్జెట్ దాదాపు రూ. 200 కోట్లు వరకు ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల చేయడం ద్వారా భారీ వసూళ్లు రాబట్టొచ్చని ప్రణాళికలు వేస్తున్నారు. కాబట్టి మేకర్స్ అనుకున్నట్లు జరిగితే పవన్, చిరంజీవి సినిమాలు సంక్రాంతి పోరులో నిలవనున్నాయి.
అయితే హరి హర వీరమల్లు షూటింగ్ పవన్ హోల్డ్ లో పెట్టినట్లు కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమా రషెస్ చూసిన పవన్ తన లుక్ తో పాటు కొన్ని విషయాల పట్ల సంతృప్తికరంగా లేడట. హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ భవిష్యత్ అయోమయంలో పడిదంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఓ అరుదైన పోటీని ప్రేక్షకులు కోల్పోనున్నారు.
మరోవైపు రెండు బడా చిత్రాలు సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభాస్(Prabhas) ఆదిపురుష్, విజయ్ (Vijay) వారసుడు చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. మెగా 154, హరి హర వీరమల్లు వీరితో జాయిన్ అయితే నాలుగు పెద్ద చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది.