- Home
- Entertainment
- మెగా ఫ్యామిలీని గట్టెక్కించాల్సింది వాళ్లిద్దరే, వరుసగా 7 ఫ్లాపులు..ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా
మెగా ఫ్యామిలీని గట్టెక్కించాల్సింది వాళ్లిద్దరే, వరుసగా 7 ఫ్లాపులు..ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీకి టైం బాగాలేదు అని. మెగా హీరోలు ఎలాంటి చిత్రం చేసినా వర్కౌట్ కావడం లేదు. 2023 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటి వరకు వరుసగా మెగా హీరోలకు 7 డిజాస్టర్లు ఎదురయ్యాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీకి టైం బాగాలేదు అని. మెగా హీరోలు ఎలాంటి చిత్రం చేసినా వర్కౌట్ కావడం లేదు. 2023 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటి వరకు వరుసగా మెగా హీరోలకు 7 డిజాస్టర్లు ఎదురయ్యాయి. దీనితో మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తోంది అని ఆచి తూచి అడుగులు వేయాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Mega Family
మెగా హీరోల నుంచి చివరగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం విరూపాక్ష. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘనవిజయం అందుకుంది. ఆ తర్వాత బ్రో చిత్రంతో మెగా హీరోలకు ఫ్లాపులు మొదలయ్యాయి. బ్రో మూవీ బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. 70 శాతం మాత్రమే రికవరీ చేయగలింది. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో కలసి నటించారు.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ పెద్ద డిజాస్టర్ అయింది. ఈ చిత్రం చిరంజీవి చేయకుండా ఉండాల్సింది అని మెగా అభిమానులే చర్చించుకున్నారు. కాలం చెల్లిన తమిళ చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేసి తప్పు చేశారు అనే కామెంట్స్ వినిపించాయి. భోళా శంకర్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున చిత్రం విడుదలయింది. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదొక పెద్ద ఫ్లాప్. అక్కడితో అయిపోలేదు.
వరుణ్ తేజ్ ఫ్లాపులకు బ్రేకులు పడడం లేదు. గత ఏడాది వరుణ్ తేజ్ కి మరో రెండు డిజాస్టర్లు ఎదురయ్యాయి. ఆపరేషన్ వాలెంటైన్ ఒకటి కాగా మరొకటి మట్కా చిత్రం. వరుణ్ తేజ్ ఏ జోనర్ ట్రై చేసినా వర్కౌట్ కావడం లేదు. మధ్యలో వైష్ణవ్ తేజ్ కి ఆదికేశవ రూపంలో ఫ్లాప్ పడింది.
చివరగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద నిరాశ ఏంటంటే.. గేమ్ ఛేంజర్ చిత్రం. రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులని బాగా డిసప్పాయింట్ చేసింది. భారీ ఖర్చుతో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంచనాలు అందుకోలేక ఈ చిత్రం చతికిలబడింది. నెక్స్ట్ మెగా ఫ్యామిలీ త్వరలో రిలీజ్ కాబోతున్న చిత్రాలు హరి హర వీరమల్లు, విశ్వంభర ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మార్చి నెలలో రిలీజ్ కావడం ఖాయం. పవన్, చిరు ఎవరో ఒకరు మెగా హీరోల ఫ్లాప్స్ కి బ్రేకులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.