- Home
- Entertainment
- Niharika : పెద్దింటి అమ్మాయిని అయినా డైరెక్టర్ అడిగితే ఇచ్చేస్తా, అది నాకు చాలా ఇష్టం!
Niharika : పెద్దింటి అమ్మాయిని అయినా డైరెక్టర్ అడిగితే ఇచ్చేస్తా, అది నాకు చాలా ఇష్టం!
మెగా డాటర్ నిహారిక కొణిదెల సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచింది. ఆమె నటిగా, నిర్మాతగా బిజీ అవుతుంది. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Niharika Konidela
నిహారిక కొణిదెల కు ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్రేక్ రాలేదు. ఆమె కుటుంబాన్ని ఎదిరించి హీరోయిన్ అయ్యింది. కానీ హిట్ పడలేదు. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో నిహారిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు.
Niharika Konidela
దాంతో పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంది. వైవాహిక జీవితం ఆమెకు కలిసి రాలేదు. పెళ్ళైన రెండేళ్లకు భర్త వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చింది. విడాకుల అనంతరం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన బ్యానర్ లో చిత్రాలు నిర్మించేందుకు ఆఫీస్ ఓపెన్ చేసింది. అలాగే డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది.
Niharika Konidela
ఇటీవల ఓ తమిళ చిత్రానికి నిహారిక సైన్ చేశారు. మంచు మనోజ్ కమ్ బ్యాక్ మూవీ వాట్ ది ఫిష్ లో కూడా నిహారిక ఓ కీలక రోల్ చేస్తున్నారని సమాచారం. నటిగా సక్సెస్ అవ్వాలంటే జనాలకు అందుబాటులో ఉండాలి. అందుకే నిహారిక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Niharika Konidela
నిహారిక మాట్లాడుతూ... నాకు ఈ మధ్య తిండి పిచ్చి ఎక్కువైంది. పప్పుచారు నాకు ఇష్టమైన ఆహారం. సంపాదనలో కొంత సేవ్ చేసుకుని విహారాలకు వెళుతున్నాను. నేను ఏదీ ప్లాన్ చేయను. అప్పటికప్పుడు అనుకున్నది చేసేస్తా. నాకు నటన అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలు అన్నీ నాకు నచ్చాయి.
నాకు కమర్షియల్ రోల్స్ చేసే ఛాన్స్ రాలేదు. ఈ డైరెక్టర్ కమర్షియల్ రోల్స్ కి అడగలేదు. అడిగితే చేసే దాన్ని. నేను పెద్దింటి అమ్మాయిని కాబట్టి ఆడిషన్స్ చేయడం ఏమిటీ... అని నేను అనుకోను. నిజానికి ఆడిషన్స్ ఇవ్వడానికి నేను చాలా ఇష్టపడతాను. ఓ మంచి సినిమాకు దర్శకులు ఆడిషన్ కి పిలిస్తే తప్పక వెళతాను... అని అన్నారు.
Niharika Konidela
టెలివిజన్ హోస్ట్ అవతారం కూడా ఎత్తిన నిహారిక మాస్టర్ చెఫ్ పేరుతో ఆహా లో ఒక షో చేస్తుంది. ఈ షోకి నానమ్మ అంజనాదేవి, పెద్దమ్మ సురేఖ, వదిన ఉపాసనలను పిలవాలని నిహారిక అనుకుంటున్నారట.