మీనాక్షి చౌదరికి కావలసినంత పబ్లిసిటీ, ఒకవైపు మూవీ మరోవైపు ఫేక్ న్యూస్
గత ఏడాది నుంచి మీనాక్షి చౌదరి పేరు మారు మోగుతోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి గుంటూరు కారం, గోట్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో సంచలన విజయం ఖాతాలో వేసుకుంది.

Meenakshi Chaudhary
గత ఏడాది నుంచి మీనాక్షి చౌదరి పేరు మారు మోగుతోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి గుంటూరు కారం, గోట్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో సంచలన విజయం ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Meenakshi Chaudhary
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ రాబట్టిన సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం మీనాక్షి చౌదరి కెరీర్ పీక్ లో ఉంది. ప్రస్తుతం మీనాక్షికి మరిన్ని క్రేజీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరోసారి సంచలనంగా మారింది.
థియేటర్స్ లో అదరగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటిలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. దీనితో మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాలతో వార్తల్లో నిలిచిన మీనాక్షి ఒక ఫేక్ న్యూస్ తో కూడా వార్తల్లో నిలిచారు.
Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో అంతా షాక్ అయ్యారు. సమంత, పూనమ్ కౌర్ లాంటి హీరోయిన్లని ప్రభుత్వాలు గతంలో బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాయి. అదే విధంగా మీనాక్షికి కూడా అవకాశం దక్కింది అంటూ వార్తలు వచ్చాయి. దీనితో మీనాక్షి సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్ గా మారింది. కానీ ఏపీ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తలని ఖండించింది. మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని తేల్చేశారు. మొత్తంగా మీనాక్షికి మాత్రం ఈ ఫేక్ న్యూస్ తో కావాల్సినంత పబ్లిసిటీ లభించింది అని చెప్పొచ్చు.