రెండో పెళ్లిపై మీనా షాకింగ్ రియాక్షన్.. ఈ సారి గట్టిగా ఇచ్చిపడేసిన సీనియర్ బ్యూటీ..
సీనియర్ నటి మీనా భర్త గతేడాది అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె రెండో పెళ్లిపై తరచూ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈ సారి మాత్రం స్ట్రాంగ్‌గా ఇచ్చింది. ఏకంగా ఫ్రెండ్‌కే షాకిచ్చింది.
సీనియర్ అందం మీనా.. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో కలిసి నటించి మెప్పించింది. తెలుగుతోపాటు సౌత్ లాంగ్వేజెస్‌లో నటించి ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆమె ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తుంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తుంది. సెలక్టీవ్‌గా ముందుకెళ్తున్న ఈ అమ్మడు పెళ్లి విషయం తరచూ వార్తల్లో నిలుస్తుంది.
మీనా భర్త విద్యా సాగర్ గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన భర్త మరణంతో పెద్ద షాక్‌కి గురయ్యింది మీనా. చాలా రోజులపాటు ఆమె కోలుకోలేకపోయింది. తాను, తన కూతురు ఒంటరైన ఫీలింగ్‌ని ఫేస్ చేసింది. చాలా రోజులు ఆమె బయటకు కూడా రాలేదు. ఇప్పుడిప్పుడు ఆమె మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ తన జీవితంలో జరిగిన విషాదాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది.
ఇదిలా ఉంటే మీనా రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్ చాలా సార్లు హల్‌చల్ చేస్తున్నాయి. గతంలోనూ ఈ వార్తొచ్చాయి. మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్ నెట్టింట హల్‌చల్ చేసిన నేపథ్యంలో ఆమె స్పందించింది. తాను పెళ్లి చేసుకోవడం లేదని, అలాంటి రూమర్స్ నమ్మవద్దని, తన ప్రైవసీకి ఇబ్బందికి కలిగించొద్దని చెప్పింది. అయితే ఆమెకి ఈ రెండో పెళ్లి మ్యాటర్ స్నేహితురాలి ద్వారే ఎదురయ్యింది. ఆమెకి మీనా ఇచ్చిన రియాక్షన్ మాత్రం షాకింగ్‌లా ఉండటం గమనార్హం.
డాన్సు మాస్టర్ కాలా.. మీనాకి మంచి స్నేహితురాలు. తరచూ మీనాని కలుస్తుంటారు. భర్త చనిపోయినప్పుడు కూడా ఆమెకి అన్ని విధాలుగా కాలా తోడున్నారట. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించింది. విద్యా సాగర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కాలా మీనాతోపాటే ఉన్నారట. కానీ జరగరాని నష్టం జరిగిందని బాధ పడింది. అయితే ఆ విషాదం నుంచి బయటపడుతున్న సమయంలో కాలా.. మీనా వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిందట.
రెండో పెళ్లి చేసుకోవడంపై తాను సలహా ఇచ్చిందట. అందుకు మీనా సీరియస్‌గా స్పందించిందని చెప్పింది. సెకండ్ మ్యారేజ్‌కి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆమె అస్సలు ఒప్పుకోలేదని, అంతేకాదు తనపై సీరియస్ అయ్యిందని చెప్పింది. ఇలాంటి విషయాలు నీకు అనవసరం అని చెప్పింది. నా పెళ్లి గురించి అయితే ఇకపై తనతో మాట్లాడవద్దని మండిపడిందట. తనకు కూతురు ఉందని, ఆమె బాధ్యత తన భుజాలపై ఉందని, పాపని చూసుకుంటూ అలా ఉండిపోతానని మీనా స్పష్టం చేసినట్టు కాలా వెల్లడించారు. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా మీనాకి సపోర్టింగ్‌గా నిలుస్తున్నారు.
మీనా ఇటీవల మలయాళంలో `బ్రో డాడీ` చిత్రంలో నటించింది. మోహన్‌లాల్‌కి జోడీ కట్టింది. అంతకు ముందు తెలుగులో `దృశ్యం 2`లో నటించింది. ఇటీవల ఆమె `ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు` సినిమా చేసింది. ప్రస్తుతం `రౌడీ బేబీ` చిత్రంలో నటిస్తుంది మీనా.