- Home
- Entertainment
- Mastan Sai Arrest: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్? మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్క్ లో ప్రైవేట్ వీడియోలు ?
Mastan Sai Arrest: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్? మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్క్ లో ప్రైవేట్ వీడియోలు ?
Mastan Sai Arrest: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్ అయ్యిందా? ఆయన ఫోన్ లో ఉన్న ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యాయా? మస్తాన్ సాయి అరెస్ట్ వెనుక షాకిస్తున్న కథనాలు.

Mastan Sai Arrest
Mastan Sai Arrest: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్ అయ్యిందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన ఫోన్‌లో ఉన్న ప్రైవేట్ వీడియోలు లీక్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి అంతటికి యూట్యూబర్ మస్తాన్ సాయి కారణమని తెలుస్తుంది. తాజాగా ఆయన్ని అరెస్ట్ చేశారు. గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు.
Mastan Sai Arrest
హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం మొన్నటి వరకు నడిచిన విషయం తెలిసిందే. తామిద్దరం విడిపోవడానికి, రాజ్ తరుణ్ తనని దూరం పెట్టడానికి మస్తాన్ సాయినే కారణమని లావణ్య పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాజాగా సోమవారం మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మస్తాన్ సాయిపై పలువురు అమ్మాయిల ప్రైవేట్(నగ్న) వీడియోలు చిత్రీకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మస్తాన్ సాయి వద్ద ఉన్న సుమారు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 300లకుపైగా వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో నిగ్న వీడియోలు ఉన్నట్టు తెలుస్తుంది.
డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి గతంలోనే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరోసారి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో ప్రముఖులు ప్రైవేట్ వీడియోలు ఉన్నాయట. అందులో హీరో నిఖిల్ ఫోన్‌ని కూడా హ్యాక్ చేసినట్టు, ఆయనకు సంబంధించిన వీడియోలు,
అలాగే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే దీనిపై మస్తాన్ సాయి స్పందిస్తూ, తన వద్ద ఎలాంటి వీడియోలు లేవని తెలిపారు. లావణ్య తనని కావాలని ఇరికించిందంటున్నారు. మస్తాన్ సాయిని కోర్టు లో హాజరు పర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది.
Mastan Sai Arrest
ఈ ఘటనతో మరోసారి రాజ్ తరుణ్, లావణ్య ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు మూడు నెలల క్రితమే వీరి వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మరో అమ్మాయి(హీరోయిన్) కోసం తనని దూరం పెడుతున్నాడని, ఆమె మాయ చేసిందని లావణ్య ఆరోపించింది. తనకు రాజ్ తరుణ్ కావాలని ఆమె డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో రాజ్ తరుణ్‌పై కూడా కేసు పెట్టింది లావణ్య. ఇది పెద్ద రచ్చ అయ్యింది. ఆ వివాదం సర్దుమనిగిందని అంతా భావించిన తరుణంలో మస్తాన్ సాయి రూపంలో మరోసారి తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయిపై డ్రగ్స్ స్మగ్లింగ్, అమ్మాయిలను వేధించడం, ప్రేమ, పెళ్లి పేరుతో లోబరుచుకునేవాడనే ఆరోపణలున్నాయి.
read more: Vishal Love: 33 ఏళ్ల హీరోయిన్ తో విశాల్ లవ్?, మరోసారి గుప్పుమన్న పుకార్లు
also read: Rajasekhar: యంగ్ హీరోకి తండ్రిగా రాజశేఖర్.. యాంగ్రీ హీరోకి ఏమైంది? భారీ రెమ్యూనరేషన్