మాస్ మహారాజ్ జోడీగా.. నేషనల్ క్రష్, రవితేజ-రష్మిక జోడీ పై జోరుగా రూమర్స్..
టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్లు, సర్ ప్రైజింగ్ కాంబినేషన్లు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అందులో ఎవరూ ఊహించని విధంగా మాస్ మహారాజ్ రవితేజ, నేషనల్ క్రష్ రష్మిక జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బిజీ హీరోయిన్లలో ముందు వరసలో ఉంది రష్మిక మందన్న. సౌత్.. నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ... పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది బ్యూటీ. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ స్టార్ గా వెలుగు వెలుగుతోంది బ్యూటీ.
ఇప్పుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ జోడీగా యానిమల్ సినిమా చేస్తోన్న రష్మిక మందననా.. ఇటు టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 లో కూడా మెరవబోతోంది. ఇక యానిమల్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుండగా.. పుష్ప మాత్రం వచ్చే ఏడాది అగస్ట్ లో రిలీజ్ అంటూ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
యానిమల్, పుష్ప2 తో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘రెయిన్‌బో’ సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. అయితే ఇంత బిజీగా ఉన్న రష్మికకు సబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ లో తెగ షికారు చేస్తోంది. ఇంత బిజీగా ఉన్న రష్మిక టాలీవుడ్ నుంచి మరో సినిమాల మెరవబోతున్నట్టు తెలుస్తోంది.
తెలుగులో మరో సినిమాకు రష్మిక గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. అది కూడా సాదాసీదా సినిమాకాదు. రవితేజ, మలినేని గోపీచంద్‌ల సినిమా. డాన్‌శీను, బలుపు, క్రాక్ సినిమాలతో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న కాంబినేషన్ ఇది. మరి వీరిద్దరి నాలుగో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు వీరిద్దరికి తోడు రష్మిక కూడా వీరితో చేయికలిపినట్టు తెలుస్తోంది. రవితేజ, రష్మిక కాంబినేషన్ లో సినిమా అంటే.. అది ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఇద్దరు తారలు జోరు.. హుషారు వేరు. . ఇద్దరి ఎనర్జీ లెవల్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇక క్రాక్ సినిమా మాదిరి రియల్ లైఫ్ వాస్తవ సంఘనల ఆధారంగా ఈ కథను తయారు చేశారట మలినేని.
ప్రస్తుతం రష్మిక, రవితేజ్ కాంబినేషన్ న్యూస్ వైరల్ అవుతోంది. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల తరువాత ఈ కాంబోకు సాయిమాధవ్ బుర్రా ప్రస్తుతం మరోసారి ఈ సినిమాకి సంభాషణలు అందిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి మొదలుకానున్నట్టు తెలిసింది.