రవితేజని చూడాలనుకున్నది ఇలానే కదా.. `మాస్ జాతర` గ్లింప్స్ ఎలా ఉందంటే?
రవితేజ తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న `మాస్ జాతర` మూవీ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో వింటేజ్ రవితేజని చూపించడం విశేషం. మరి గ్లింప్స్ ఎలా ఉందంటే?

మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే కామెడీ, యాక్షన్, రొమాన్స్ మేళవింపుగా ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు కథని బట్టి యాడ్ అవుతుంటాయి. కొంత సెంటిమెంట్ కూడా తోడవుతుంది. ఇలా ఫుల్ మీల్స్ పెడుతుంటారు రవితేజ. ప్రధానంగా ఎంటర్టైన్‌మెంట్, మాస్ ఎలిమెంట్లకి కొదవ ఉండదు. అలా వచ్చిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్ అయ్యాయి.
కానీ ఇటీవల ట్రాక్ తప్పాడు రవితేజ. యాక్షన్ సినిమాల వెంట పరిగెడుతున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ని వదిలేసి విభిన్న మైన సినిమాలు చేస్తూ వచ్చాయి. కానీ అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.
ఈ క్రమంలో ఇప్పుడు రైట్ ట్రాక్‌లో పడినట్టు అనిపిస్తుంది. తాజాగా ఆయన నటించిన `మాస్ జాతర` చిత్ర గ్లింప్స్ విడుదలైంది. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, నేడు ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో పోలీస్‌గా కనిపించాడు రవితేజ.
అల్లరి మొగుడుగా, క్రేజీ పోలీస్ అధికారికగా ఆయన కనిపిస్తున్నట్టు ఈ గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది. ప్రారంభంలో రవితేజ తన లుక్‌ని చూసుకుంటూ, మీసాలు మెలేస్తూ, మాస్ వార్నింగ్‌లు ఇస్తూ, యాక్షన్ సీన్లతో రెచ్చిపోయాడు. అద్దంలో చూసుకుంటూ తనని తాను తిట్టుకునే సన్నివేశంతో వింటేజ్ రవితేజని పరిచయం చేశారు.
రవితేజ సినీ ప్రస్థానంలో `మనదే ఇదంతా` అనే డైలాగ్ ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్లింప్స్ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా 'మాస్ జాతర' గ్లింప్స్ ను మలిచారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్ కు ప్రధాన బలంగా ఉంది.
ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి గతంలో 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో 'మాస్ జాతర' రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
read more: భారతరత్న కాలుగోటితో సమానం, బాలకృష్ణ వీడియో హల్‌చల్.. పద్మభూషణ్ అవార్డు ప్రకటన వేళ రచ్చ
also read: `లూసిఫర్ 2` టీజర్ హైలైట్స్.. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబో మూవీ టీజర్ ఎలా ఉందంటే?