మార్కో, ప్రేమలు, మంజుమేల్ బాయ్స్, ఆవేశం.. 100 కోట్లతో సంచలనాలు సృష్టించిన 6 మలయాళ చిత్రాలు
తెలుగు సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే, మలయాళంలో చిన్న చిత్రాలు ఏకంగా వంద కోట్లతో దుమ్ములేపుతున్నాయి. మరి ఇటీవల వచ్చిన(2024) ఆ మూవీస్ ఏంటో చూద్దాం.
100 కోట్లు వసూలు చేసిన మలయాళ చిత్రాలు
గత సంవత్సరం మలయాళ చిత్ర పరిశ్రమ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది.చిన్న చిత్రాలు మ్యాజిక్ చేశాయి. `ఆవేశం`, `ప్రేమలు`, `మంజుమ్మెల్ బాయ్స్` వంటి చిత్రాలు కేరళలోనే కాకుండా తమిళం, తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా `మంజుమ్మెల్ బాయ్స్` తమిళనాడులో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో మలయాళంలో మొత్తం 6 చిత్రాలు 100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఆ చిత్రాలేంటో చూద్దాం.
మంజుమ్మెల్ బాయ్స్
మంజుమ్మెల్ బాయ్స్
చిదంబరం దర్శకత్వంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన చిత్రం `మంజుమ్మెల్ బాయ్స్`. కొడైకెనాల్‌లోని గుణా గుహలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.239.6 కోట్లు వసూలు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలో 200 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది. ఇది తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది.
ఆడుజీవితం
ఆడుజీవితం
బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం `గోట్ లైఫ్`(ఆడుజీవితం). ఇందులో పృథ్వీరాజ్‌కు జంటగా అమల పాల్ నటించారు. ఇది కూడా నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం స్లోగా ఉందనే విమర్శలు ఎదుర్కొన్నా బాక్సాఫీస్ వద్ద రూ.156.8 కోట్లు వసూలు చేసింది. తెలుగులో పెద్దగా ఆడలేదు.
ఆవేశం
ఆవేశం
`పుష్ప 2`లో భన్వర్‌సింగ్ షేకావత్‌గా మెప్పించిన ఫహద్ ఫాజిల్ నటించిన మూవీ `ఆవేశం`. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేరళతో పాటు తమిళనాడులో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.154.1 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో ఉంది. దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రేమలు
ప్రేమలు
2024లో విడుదలై దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రశంసలు పొందిన చిత్రాలలో `ప్రేమలు` ఒకటి. ఈ చిత్రం తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో విజయవంతమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.136.8 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి రెండో భాగం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. హైదరాబాద్ బేస్డ్ స్టోరీ కావడంతో తెలుగులోనూ ఇది విశేష ఆదరణ పొందింది. సుమారు రూ.17కోట్ల షేర్ సాధించింది.
ఏఆర్ఎమ్
ఏ.ఆర్.ఎమ్
టొవినో థామస్ నటించిన ఈ చిత్రం గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైంది. ఫాంటసీ చిత్రమైన ఇది కేరళలో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.101.8 కోట్లు వసూలు చేసింది. తెలుగులో డిజాస్టర్ అయ్యింది.
మార్కో
మార్కో
100 కోట్ల క్లబ్‌లో ఆలస్యంగా చేరిన చిత్రం `మార్కో`. ఉన్ని ముకుందన్ నటించిన ఈ యాక్షన్ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. శృతి మించిన వాయిలెన్స్ తెలుగులో పెద్ద దెబ్బ పడింది. కానీ యాక్షన్ ని ఇష్టపడే ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.