MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆమె పేరు చెప్తేనే స్టార్ హీరోల గుండెల్లో దడ,వణుకు,నమస్కారం పెట్టేస్తున్నారు

ఆమె పేరు చెప్తేనే స్టార్ హీరోల గుండెల్లో దడ,వణుకు,నమస్కారం పెట్టేస్తున్నారు

17 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన భారతదేశం నుండి ఆరవ ప్రతినిధిగా నిలిచింది.ఆ తర్వాత 2022లో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో వెండితెరకి పరిచయమైంది మానుషి.  

4 Min read
Surya Prakash
Published : Apr 15 2024, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112


ఫామ్ లో ఉన్న హీరోయిన్ తో చేయాలని ఎప్పుడూ స్టార్ హీరోలు ఉత్సాహం చూపుతూంటారు. దర్శ,నిర్మాతలకు వాళ్లని రికమెండ్ చేస్తూంటారు. అయితే ఏ హీరోతో చేస్తే ఆ హీరోకు డిజాస్టర్ సినిమా అయ్యిపోతుంటే ఎంతకని సరిపెట్టుకుంటారు. వరస నాలుగు డిజాస్టర్స్ తో దూసుకుపోతున్న ఓ ముద్దగుమ్మని అడిగి తమ సినిమాల్లో పెట్టించుకున్న హీరోలే ఆమెను తలుచుకుని గజగజా వణికిపోతున్నారు. ఆమె మరెవరో కాదు మానిషి చిల్లర్.

212


మానిషి  గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2017లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలిచింది. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుంది. 17 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన భారతదేశం నుండి ఆరవ ప్రతినిధిగా నిలిచింది.ఆ తర్వాత 2022లో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో వెండితెరకి పరిచయమైంది మానుషి.  

312


మానుషి చిల్లర్ మొదట హిస్టారికల్ డ్రామా ఫిల్మ్  సామ్రాట్ పృథ్వీరాజ్ లో సంయోగిత పాత్రతో తన నటనను ప్రారంభించింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఆమె తొలి చిత్రం. జూన్ 3, 2022 న రిలీజన ఈ సినిమా 300 కోట్లు బడ్జెట్ తో తీస్తే సగం కూడా రికవరీ కాలేదు. దాంతో ఆ నిర్మాతలు మునిగిపోయారు.

412

విక్కీ కౌశ‌ల్ రీసెంట్‌గా న‌టించిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ’ (The Great Indian Family ). మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ (Maanushi Chillar) ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 22వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కాగా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టర్‌గా
నిలిచింది. యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Flims) బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా (Aditya Chopra) ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. ధూమ్ త్రీ (Dhoom 3), థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ (Thugs Of Hindustan) చిత్రాల ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య (Vijay krishna Acharya) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

512


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' . శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా మార్చి 1న థియేటర్లో విడుదలై సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది.  ఈ సినిమా ఎంత డిజాస్టర్ అంటే ..థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం.   

612


సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, సందీప్ ముద్దా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సినిమాకి సంగీతం అందించారు. మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. పుల్వామా అటాక్, బాలాకోట్ వైమానిక దాడులు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్ తేజ్ అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా సినిమా ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున నిర్వహించారు. కానీ చిత్రం మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. 

712


అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ ప్రధాన పాత్రల్లో, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియా ఛోటే మియా. ఈ చిత్రం ఈ వారం  వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.   వాషు భగ్నాని, జాకీ భగ్నాని, అలీ అబ్బాస్ జాఫర్, దీప్శిఖా దేశ్‌ముఖ్, హిమాన్షు కిషన్ మెహ్రా లు నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ మిశ్రా సంగీతం అందించారు. మార్సిన్ లాస్కావిక్ సినిమాటోగ్రాఫర్ గా, స్టీవెన్ బెర్నార్డ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కూడా కలెక్షన్స్ లేక డిజాస్టర్ జాబితాలో కలుస్తోంది.

812

 ఆ తర్వాత  2023లో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. 2024లో ఆపరేషన్ వాలెంటైన్ లో  కనిపించింది. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది ఈ అందాల తార. తన మాతృభాష అయిన హర్యాన్వితో పాటు హిందీ, ఇంగ్లీషులో కూడా అనర్గళంగా మాట్లాడగలదు ఈ ముద్దుగుమ్మ. రాజా, రాధా రెడ్డిల కూచిపూడిలో  వద్ద శిక్షణ పొందింది ఈ వయ్యారి భామ. 2022 నుంచి నటనలో కెరీర్ మొదలుపెట్టింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగులో తొలిసారి నటించింది.

 

912

హీరోయిన్ గా  ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈమె.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా చెమటలు పట్టిస్తోంది..   మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ హాట్   డ్రెస్సులో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1012


బడే మియాన్ చోటే మియాన్ తాజా పాటలో అక్షయ్ కుమార్ మానుషి చిల్లర్ రొమాన్స్   యూత్ కి నచ్చటం లేదు.  ఇందులో ప్రధాన జోడీలు, అక్షయ్-మానుషి .. టైగర్- అలయ జంట‌లు హాట్ అవతార్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. నలుగురూ తమ డ్యాన్స్ మూవ్‌లను సెన్సావల్ ట్రాక్‌లో అద‌ర‌గొట్టారు. అయితే అక్షయ్ -మానుషి మ‌ధ్య కెమిస్ట్రీ కోఆర్డినేషన్ దృష్టిని ఆకర్షించింది. ఈ జంట‌ గతంలో సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంలో క‌లిసి న‌టించారు. అయితే 30 ఏళ్ల చిన్న వయసులో ఉన్న మానుషి చిల్లర్‌తో రొమాన్స్ చేసినందుకు నెటిజన్లు అక్షయ్ కుమార్‌ను నెటిజ‌నులు నిందిస్తూనే ఉన్నారు. ఇది సిగ్గుచేటు అని కొంద‌రు వ్యాఖ్యానించారు.

1112


ఏదైమైనా  మానుషి చిల్ల‌ర్ కి బాలీవుడ్ లో అదృష్టం దక్కలేదు. త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ఈ బ్యూటీ క్వీన్ చాలా కాలంగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇప్పుడు బ‌డే మియాన్ చోటే మియాన్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. సోష‌ల్ మీడియాల్లో వీలున్నంత వ‌ర‌కూ త‌న‌వంతు ప్ర‌చారం చేస్తూనే ఉంది.  అయితేనేం టైమ్ కలసి రాలేదు. మరో డిజాస్టర్ ఆమె ఖాతాలో నమోదు అయ్యింది. 

1212


సామ్రాట్‌ పృథ్వీరాజ్ సినిమా తో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన మానుషి చిల్లర్ కి కమర్షియల్‌ గా హిట్ దక్కకపోయినా ఆఫర్స్ కు కొదవలేదు. నటనపరంగా మంచి హీరోయిన్‌ గా  గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు అయిదు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అంతేకాకుండా  సోషల్‌ మీడియా ద్వారా మానుషి చిల్లర్ రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా తన ఫాలోవర్స్ కు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంది. ఆరున్నర  మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న మానుషి  తనకు ఎదురేలేదన్నట్లు బాలీవుడ్ లో ముందుకు వెళ్తోంది. 
 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Recommended image2
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
Recommended image3
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved