MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న మాన్సీ.. ఆర్యకు అను దొరికినట్లేనా?

Prema Entha Madhuram: చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న మాన్సీ.. ఆర్యకు అను దొరికినట్లేనా?

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భర్త ప్రాణాల కోసం పిల్లలతో సహా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : May 29 2023, 07:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

 ఎపిసోడ్ ప్రారంభంలో గుడికి వస్తే నీ భార్య పిల్లలు దొరికే అవకాశం ఉందేమో ఎవరికి తెలుసు ఈ ఒక్కసారికి నా మాట విను గుడికి రా అని ఆర్య కి నచ్చచెప్తుంది శారదమ్మ. సరే నీ ఇష్టం అంటూ వెళ్ళిపోతాడు ఆర్య. గుడికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయమని జెండేకి చెప్తుంది శారదమ్మ. సీన్ కట్ చేస్తే కూరగాయలు అమ్ముకొని ఇంటికి వస్తుంది అను. వస్తూనే పాప ఇబ్బంది పెట్టిందా అని ముసలమ్మని అడుగుతుంది.
 

29

 లేదమ్మా పాపతో నాకు బాగా కాలక్షేపం అయింది. ఈ వయసులో పిల్లలు తల్లి స్పర్శ లేకపోతే ఏడుస్తారు కానీ నీ కూతురు చాలా నిబ్బరంగా ఉంది. అసలు ఏడవనే లేదు. పెద్దయ్యాక ఏ సమస్య అయినా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యవంతురాలు అవుతుంది అని చెప్తుంది ముసలమ్మ. కూతుర్ని ఎత్తుకొని ముద్దులాడుతుంది అను. కూరగాయలు అమ్మిన డబ్బు ముసలమ్మ చేతిలో పెట్టి వంట చేయటానికి వెళ్తుంది.
 

39

 ఆమెకి ఎడం కన్ను అదరడంతో  కంగారుపడుతుంది. ఏం జరిగింది కూరగాయలు అమ్మినందుకు నీరసంగా ఉందా అంటుంది ముసలమ్మ. ఏం లేదు బామ్మా ఎందుకో ఎడమ కన్ను గట్టిగా కొట్టుకుంటుంది అంటుంది అను. ఆడవాళ్ళకి ఎడమ కన్ను కొట్టుకుంటే ఏదో గొప్ప శుభం జరుగుతుంది. రేపు ఒకసారి గుడికి వెళ్దాము. పిల్లల పేరున అర్చన చేయించినట్లుగా ఉంటుంది నీకు కొంచెం మనశ్శాంతిగా కూడా ఉంటుంది అంటుంది ముసలమ్మ.
 

49

 నీ ఇష్టం బామ్మ అంటుంది  అను. మరుసటి రోజు గుడికి వస్తారు అను వాళ్ళు. గుడిలోకి రాకుండా బయటే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అను. ఆలోచనలన్నీ పక్కనపెట్టి దేవుడి మీద నమ్మకంతో గుడిలో అడుగు పెట్టు అమ్మవారు నీకు అంతా మంచే చేస్తుంది  అంటుంది ముసలమ్మ. దేవుడు లాంటి నా భర్త దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నాను ఇంకేం నమ్మకంతో అమ్మవారిని పూజిస్తాను అనుకుంటుంది అను.
 

59

 మరి ఏమి ఆలోచించకు కాళ్లు కడుక్కుని గుడిలోకి వెళ్దాము అంటుంది మసలమ్మ. కాళ్లు కడుక్కొని గుడిలోకి వెళ్ళిపోతారు అనువాళ్ళు. సరిగ్గా అదే సమయానికి ఆర్య వాళ్ళు వస్తారు. గుడికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆర్య వాళ్ళని ఆహ్వానిస్తారు. ఆర్య వాళ్ళు కూడా కాళ్లు కడుక్కుంటూ ఉంటే బేబీ ఏడుపు వినిపిస్తుంది ఆర్య కి. ఆ ఏడుపునే ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు. ఏడుపు ఆగిపోవడంతో ఆర్య కూడా గుమ్మం బయటే ఆగిపోతాడు.
 

69

 ఇక్కడే ఆగిపోయావేమి నాన్న పదా లోపలికి వెళ్దాం అంటుంది శారదమ్మ. నా మనసు ఏమి బాగోలేదు మీరు వెళ్ళండి అంటాడు ఆర్య. దైవకార్యాన్ని పక్కన పెట్టకూడదు నాన్న.. పూజ చేయిద్దాము పద అంటుంది శారదమ్మ. నా భార్య పిల్లలు దూరమయ్యారు. అను పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతుందో? ఇంకా ఏ ఆశతో పూజ చేయమంటావమ్మా అంటాడు ఆర్య. పూజ ఆశతో కాదు బాబు నమ్మకంతో చేయాలి అంటూ ఆర్యని ఒప్పించి గుడిలోకి తీసుకు వెళ్తుంది శారదమ్మ.
 

79

 ఆ తరువాత ఆర్యదంపతుల పేరుమీద నీరజ్   దంపతుల పేరు మీద అర్చన చేస్తారు పంతులుగారు. మరోవైపు మాన్సీ గుడి మేనేజర్ ని పక్కకు పిలిచి పూజ చేయాలంటే పక్కన భార్య ఉండాలి మా బావగారికి భార్య లేదు ఆ ప్లేస్లో నేను మా ఆయన కూర్చునేలాగా చూడండి. ఎన్నాళ్ళని ఇంకా మేనేజర్ గా ఉంటారు ఈవో అవ్వాలని లేదా అంటూ మేనేజర్ ని మానిప్యులేట్  చేస్తుంది మాన్సీ.
 

89

ఆ డీలింగ్ కి మేనేజర్ కూడా ఒప్పుకుంటాడు. పూజలో నువ్వు కూర్చునే అంత సీను లేదు అని మాన్సీ కి చెప్పి గుడి మేనేజర్ ని అక్కడ నుంచి పంపించేస్తుంది అంజలి. సడన్ గా అక్కడికి వచ్చిన అంజలిని చూసి షాక్ అవుతుంది మాన్సీ. నువ్వు ఇంక మారవా.. గుడిలో కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా. అయినా అను లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు ఆర్య సార్ గుండెల్లో, ఊపిరిలో అను ఉంది. వాళ్ల మధ్య ఉన్న దూరం శాశ్వతం కాదు.రాముడు బంగారు సీతమ్మని పక్కన పెట్టుకొని యాగం చేశాడంట.. ఆంటీ చెప్పారు.
 

99

అలాగే ఆర్య సార్ కూడా బంగారం లాంటి అనుని గుండెల్లో పెట్టుకొని పూజ చేస్తారు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అంజలి. వాళ్ళిద్దరినీ ఈ జన్మలో కలవనివ్వును అనుకుంటుంది మాన్సీ. మరోవైపు గుడిలో ఆర్య వాళ్లకి పూజ జరుగుతూ ఉంటుంది అదే సమయంలో అను బేబీ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?
Recommended image3
రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved