MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Jetlee Review: జెట్లీ మూవీ రివ్యూ.. కమెడియన్ సత్య ఫస్ట్ టైం హీరోగా చెసిన సినిమా వర్కౌట్ అయ్యిందా ?

Jetlee Review: జెట్లీ మూవీ రివ్యూ.. కమెడియన్ సత్య ఫస్ట్ టైం హీరోగా చెసిన సినిమా వర్కౌట్ అయ్యిందా ?

కమెడియన్ సత్య హీరోగా నటించిన జెట్లీ చిత్రం శుక్రవారం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్య తొలిసారి హీరోగా చేసిన ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి. 

3 Min read
Author : Tirumala Dornala
Published : May 01 2026, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జెట్లీ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

జెట్లీ మూవీ రివ్యూ

ఇటీవల టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈచిత్రం ప్రేక్షకులని మెప్పించిందా లేదా ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కథ
Image Credit : Asianet News

కథ

ఓ బ్యాంక్ లో 1500 కోట్ల స్కామ్ జరుగుతుంది. ఆ డబ్బుతో ప్రజాపతి(అజయ్) దుబాయ్ కి పారిపోతాడు. ఓ గ్యాంగ్ ప్రజాపతిని చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రాణ భయంతో ప్రజాపతి లొంగిపోతాడు. అతడిని ఇండియాకి తీసుకువచ్చేందుకు ఏజెంట్ శివాని( రియా సింఘా) తన టీంతో దుబాయ్ వెళుతుంది. ప్రజాపతిని ఇండియాకు తీసుకురావాల్సిన ఫ్లైట్ లో హైజాక్ ప్లాన్ జరుగుతుంది. అదే ఫ్లైట్ లో వేదవ్యాస్( సత్య) ఎందుకు ఉన్నాడు. అతడు తన ఐడెంటిటీని ఎందుకు దాచిపెట్టాడు. బ్యాంక్ స్కామ్ తో హోమ్ మంత్రికి ఉన్న సంబంధం ఏంటి ? ఈ వివరాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

36
విశ్లేషణ
Image Credit : Asianet News

విశ్లేషణ

కమెడియన్ సత్య హీరోగా చేసినా, కమెడియన్ గా చేసినా ఆడియన్స్ అతడి నుంచి ప్రధానంగా ఆశించేది హాస్యమే. సత్య హీరోగా నటించిన మూవీ కాబట్టి ఫన్ తో కూడిన మంచి కథ చూడవచ్చు అని ఆశించి ఆడియన్స్ థియేటర్స్ కి వెళతారు. జెట్లీ చిత్రం సత్య హీరోగా నటించిన ఒక ప్రయత్నంగా మాత్రమే మిగిలిపోయింది. కామెడీ పరంగా, కథ పరంగా పెద్దగా మెరుపులు లేవు. మినిమమ్ కామెడీ ఉంటుంది అని ఆశించిన ఆడియన్స్ కి నిరాశ తప్పదు. కానీ సత్య మాత్రం తన పాత్రలో షైన్ అయ్యాడు. సన్నివేశాల్లో కామెడీ లేనప్పటికీ సత్య చెప్పిన డైలాగ్ డెలివరీ, అతడి బాడీ లాంగ్వేజ్ నవ్వులు పూయించే విధంగా ఉంటుంది.

బ్యాంక్ స్కామ్, మర్డర్ లాంటి అంశాలని దర్శకుడు కథలో రాసుకున్న విధానం అంతగా ఆకట్టుకోలేదు. కథ సింపుల్ గా ఉంటుంది. కానీ దానిని దర్శకుడు డీల్ చేసిన విధానం చాలా రొటీన్ అనే చెప్పాలి. ప్రారంభంలో సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. కానీ ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు రిపీట్ గా వస్తాయి.

ఫస్ట్ హాఫ్ లో స్పూఫ్ కామెడీ సీన్లు కూడా వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో కాస్త చెప్పుకోవడానికి కథ ఉంటుంది. అక్కడక్కడా కామెడీ కూడా మెప్పిస్తుంది. బ్యాంక్ స్కామ్ వెనుక ఏం జరిగింది. సత్య ఎవరు ? వెన్నెలకిషోర్ ఎవరు ? లాంటి ట్విస్ట్ లో సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతాయి.

46
నటీనటులు
Image Credit : Asianet News

నటీనటులు

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తన బలమైన హాస్యం, ఫన్నీ బాడీ లాంగ్వేజ్ తో సత్య కొంత వరకు ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేశాడు. కథలో బలం లేకపోయినప్పటికీ చాలా సన్నివేశాల్లో సత్య పెర్ఫార్మెన్స్ కొంత వరకు కాపాడగలిగింది. కానీ పూర్తి స్థాయిలో కాదు. ఈ కథకి వెన్నెల కిషోర్ పాత్ర మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోయింది.

అమాయకంగా కనిపిస్తూ కిషోర్ బాగా నవ్వించాడు. ముఖ్యంగా సత్య, కిషోర్ మధ్య వచ్చే సీన్లు బావుంటాయి. రియా సింఘాకి ఈ చిత్రంలో మంచి పాత్రే దక్కింది. హర్ష చెముడుని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకుకోలేదు. అజయ్, ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు.

56
టెక్నికల్ గా
Image Credit : Asianet News

టెక్నికల్ గా

కథ కొంచెం యావరేజ్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రంలో ఆ రెండూ మైనస్ అయ్యాయి. సరైన కథ లేదు, తెరకెక్కించిన విధానం కూడా గొప్పగా లేదు. ఈ చిత్రం చూశాక అంత రన్ టైం ఏమాత్రం అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. చాలా సన్నివేశాలు షార్ప్ గా ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉండొచ్చు. కానీ అది జరగలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని అతిపెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాగ్రౌండ్ సంగీత అక్కడక్కడా మెప్పించింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

66
ఫైనల్ గా
Image Credit : Asianet News

ఫైనల్ గా

కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'తో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కథ, కామెడీ ఏదీ ఆకట్టుకునే విధంగా లేదు.

రేటింగ్: 2/5

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
సినిమా సమీక్షలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image3
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Related Stories
Recommended image1
Simran To Rambha: సిమ్రాన్ నుంచి రంభ వరకు..సీనియర్ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా
Recommended image2
Krishna: ఆ మూవీ చూసి ముగ్గురు లెజెండ్స్ కి పిచ్చెక్కిపోయింది, చాలా మంది హీరోలు దెబ్బైపోయారు అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved