Prema Entha Madhuram: చెల్లాచెదురైన ఆర్య కుటుంబం.. కుట్ర వెనుక మాన్సీ హస్తం ఉందా?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అకారణంగా తనని వదిలి వెళ్ళిపోయిన భార్య పిల్లల కోసం తపన పడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నన్ను వదిలి నేను ఉండలేను అని తెలుసు కదా అయినా ఎలా వెళ్ళిపోయావు నన్ను వదిలి వెళ్లిపోవలసినంత అవసరం నీకు ఏం వచ్చింది అంటూ బాధపడతాడు ఆర్య. నాకు తెలుసు సార్ మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము కానీ ఇకమీదట కలిసి ఉండలేము కారణం చెప్పలేను. మన ఇద్దరిదీ బాధ ఒక్కటే కానీ విడివిడిగా బాధపడుతున్నాము అంటూ కన్నీరు పెట్టుకుంటుంది అను.
గుడిలో వదినమ్మ ఎక్కడా లేదు దాదా.. వేరే చోటికి వెళ్లి వెతుకుదాం రండి అంటాడు నీరజ్. జెండే కూడా అదే చెప్తాడు. ఇక తప్పక జెండే, నీరజ్ లతోపాటు బయటికి వస్తాడు ఆర్య. మీరు ఇక్కడే ఉండండి నేను కార్ తీసుకొస్తాను అని చెప్పి జెండే కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో బేబీ ఏడుపు వినిపిస్తుంది. అను గుడిలోనే ఉంది అని ఆర్య వాళ్ళు మళ్లీ గుడిలోకి వచ్చి వెతుకుతారు.
బేబీ ఏడుపుకి కంగారుపడుతుంది అను. ఎక్కడ ఆర్య వాళ్ళకి కనిపించేస్తుందో అని కింద ఉన్న బేబీని అక్కడే ఉంచి చేతిలో ఉన్న బేబీతో వేరే గదిలోకి వెళ్లి దాక్కుంటుంది అను. మళ్లీ వచ్చి వెతికినప్పటికీ అనువాళ్ళు అక్కడ కనిపించరు. లేనిచోట వెతకడం కన్నా మరో ప్లేస్ లో వెతుకుదాం అని జెండే నాకు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆర్య వాళ్ళు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అను బయటకు వచ్చి చూసేసరికి అక్కడ బేబీ కనిపించదు. కంగారుపడిన అను గుడంతా వెతుకుతుంది.అదే సమయంలో ఇంటిదగ్గర శారదమ్మ బాధపడుతూ ఉంటుంది. అంజలి ఆర్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన నీరజ్ వాళ్లని అను దొరికిందా అని అడుగుతుంది శారదమ్మ. లేదు అని చెప్తాడు జెండే. బాధతో కూలబడిపోతుంది శారదమ్మ.
ఇంటికి మహాలక్ష్మి లాగా ఇద్దరు పిల్లలతో ఇంట్లో అడుగుపెడుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి అను మనసు కష్టపెట్టేలాగా ఏ గొడవ జరగలేదు అయినా ఎందుకు వెళ్లిపోయిందో అర్థం కావటం లేదు అంటూ బాధపడుతుంది శారదమ్మ. ఏ విషయంలో మనసు కష్టపెట్టుకొని ఉంటుంది నెమ్మదించిన తర్వాత వచ్చేస్తుంది అంటూ కొడుక్కి నచ్చచెప్తుంది.
ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలిచి పోరాడుతుంది కానీ అను అలా పారిపోయే మనిషి కాదు ఏదో జరిగింది అంటుంది అంజలి. దాదాని వదిలేసి ఒక నిమిషం కూడా వదినమ్మ ఉండలేదు అలాంటిది పిల్లలతో సహా వెళ్లిపోయింది అంటే సంథింగ్ ఇస్ రాంగ్ అంటాడు నీరజ్. ఇదంతా పైనుంచి చూస్తున్న మాన్సీ అను మీకు కనిపించదు ఇకమీదట ఇక్కడికి రాదు అని మనసులో అనుకొని నవ్వుకుంటుంది.
నాకు చిన్నప్పటినుంచి ఏ సమస్య వచ్చినా క్షణంలో నిర్ణయం తీసుకునేవాడిని ఎప్పుడు ఏం చేయాలో అనే పరిస్థితి రాలేదు కానీ ఇప్పుడు ఏంటమ్మా ఇలా జరిగింది. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. పిల్లలు పుట్టాక మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ ఎన్నో కబుర్లు చెప్పింది. ఆఖరికి పిల్లలు పుట్టిన తర్వాత కనీసం కంటి నిండా చూసుకోవడానికి కూడా అవ్వలేదు అంటూ తల్లిని పట్టుకొని ఏడుస్తాడు ఆర్య.
నువ్వు ఆ దేవుని కంటే మంచి వాడివి అందుకే ఆ దేవుడికి కళ్ళు కుట్టినట్లుగా ఉన్నాయి అంటూ శారదమ్మ కూడా కన్నీరు పెట్టుకుంటుంది. నాకు చేసిన అన్యాయానికి మీరంతా అనుభవించి తీరాలి. ఇకమీదట ఈ ఇంట్లో వినిపించేది ఏడుపులే అవి నా కళ్ళతో నేను చూస్తాను అని కసిగా అనుకుంటుంది మాన్సీ. మరోవైపు బేబీ కోసం కంగారుగా వెతుకుతూ ఉంటుంది అను.
గుడిలో కనిపించిన వారందరినీ అడుగుతుంది. ఎవరికి తెలియదు అని చెప్తారు. ఆర్య సార్ వాళ్లు తీసుకెళ్లేరేమో అని అనుమాన పడుతుంది కానీ ఒక బేబీ దొరికితే నాకోసం కచ్చితంగా గుళ్లో ఉండేవారు వాళ్ళు వెళ్ళిపోయారు అంటే కచ్చితంగా బేబీని వాళ్ళు తీసుకెళ్లలేదు అని తనకు తానే సమాధానం చెప్పుకుంటుంది. ఇంతలో కొంచెం దూరంలో ఒక ముసలమ్మ గుడిలో ఈ బాబు దొరికాడు మీ వాడేనా అంటూ అందరినీ అడుగుతూ ఉంటుంది.
ఆనందంగా అక్కడికి వెళ్లి ముసలమ్మ చేతిలో బాబుని తీసుకుంటుంది. నీ బాబేనా ఎందుకు అక్కడ వదిలేసావు. ఇద్దరు పిల్లల్ని పెంచలేక వదిలేసావా మీ ఆయన ఏడి నిన్ను వదిలేసాడా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది ముసలమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.