- Home
- Entertainment
- Prema Entha Madhuram: సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్య.. జలంధర్ ని రంగంలోకి దింపిన మాన్సీ!
Prema Entha Madhuram: సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్య.. జలంధర్ ని రంగంలోకి దింపిన మాన్సీ!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తనకి పిల్లలు లేరు కాబట్టి తోటి కోడలికి కూడా పిల్లలు ఉండకూడదని విశ్వప్రయత్నం చేస్తున్న ఒక మూర్ఖురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

ఎపిసోడ్ ప్రారంభంలో అను నన్ను కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేంటి అని శారదమ్మ ని నిలదీస్తుంది మాన్సీ. తను కాబట్టి చేత్తో కొట్టింది మరొకరు అయితే చెప్పుతో చెప్పేవారు అంటుంది శారదమ్మ. అందరూ ఒకటైపోయి ఇంట్లోని, కంపెనీలోని నాకు విలువ లేకుండా చేస్తున్నారు మీ అందరి సంగతి చూస్తాను.
ఒకేసారి అందరికీ చెక్ పెడతాను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ. మాన్సీ మేడం మాటలు పట్టించుకోకండి ఆవిడ తరుపున నేను క్షమాపణలు చెప్తున్నాను దయచేసి మీరు దీపం వెలిగించండి అనటంతో అంజలి దీపం వెలిగించి పూజ చేస్తుంది. మరోవైపు తన గదిలో పనిచేసుకుంటున్న ఆర్య ని చూసి ఆనందపడతాడు జెండే.
ఏం చూస్తున్నావ్ జెండే అంటాడు ఆర్య. మూడు నెలలు అయింది ఈ ఆఫీసు గోడలు నీ మాటలు విని. ఇప్పుడే నీ గొంతుకు విని ఈ ఆఫీసు ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటుంది. నువ్వు వెళ్లిన దగ్గర నుంచి మళ్లీ ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నాను ఆఖరికి నా కల నిజమైంది అంటాడు జెండే. ఎందుకు అంతలా పొగుడుతున్నావు అంటూ చిన్నగా మందలిస్తాడు ఆర్య.
అంతలోనే నీరజ్ వచ్చి మీ ఫోటో బిజినెస్ మ్యాగ్జన్లో పడింది ద కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ మీ గురించి గొప్పగా రాశారు. ఇప్పుడు మన కంపెనీ షేర్స్ కూడా బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా పరిగెడుతున్నాయి అంటూ ఆనందంగా చెప్తాడు నీరజ్. అదే విషయాన్ని నేను నోటితో చెప్పాను నీరజ్ సార్ సాక్షాలతో చూపించారు అని నవ్వుతాడు జెండే. డాక్టర్ తో మాట్లాడావా అని నీరజ్ ని అడుగుతాడు ఆర్య.
మాట్లాడాను దాదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జెట్ క్యాటగిరి భద్రతలో టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ లు అందరూ వదినమ్మ డెలివరీకి సేవలందిస్తారు అంటాడు నీరజ్. ఎందుకు అంత హడావుడి అంటాడు ఆర్య. పొట్టబోయేది సామాన్యుడి కాదు వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసుడు.. ఆ మాత్రం భద్రత ఉండాలి అంటాడు జెండే.
మరోవైపు అనుకి గోరింటాకు పెడుతూ కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి గోరింటాకు బాగా పండితే ఏంటి అర్థం ఆంటీ అని అడుగుతుంది అంజలి. పండంటి బాబు పుడతాడని అర్థం అంటుంది శారదమ్మ. అను మంచితనం గురించి శారదమ్మకి చెప్తుంది అంజలి. ఈ మాటలు వింటున్న మాన్సీ అసూయతో రగిలిపోతుంది. గోరింటాకు పెట్టేసిన తర్వాత ఈ నిమిషం నీ మనసులో ఏమనుకుంటున్నావో జెన్యూన్ గా చెప్పు అని అడుగుతుంది అంజలి.
గోరింటాకు కడిగేసుకునే లోపు ఆర్య సర్ నా దగ్గర ఉంటే బాగుండు. పండిన నా చేతిని మొదట ఆయన చూస్తే బాగుంటుంది అంటుంది అను. ఆ మాటల్ని వీడియో తీస్తుంది అంజలి. ఇప్పుడు రావటం కష్టం ఆఫీసులో బిజీగా ఉన్నారు అని అనుకి చెప్తుంది అంజలి. ఆ తర్వాత తన గదిలో రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిపోతుంది అను. ఏవో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది.
లేచి చూసేసరికి గోరింటాకు డ్రై అయిపోవడంతో వాష్ రూమ్ లోకి వెళ్లి హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంది. అద్దంలో నుంచి ఆర్య కనిపిస్తాడు. షాక్ అవుతుంది అను. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి మీరు నిజంగానే వచ్చారా అంటూ ఆనందంగా ఆర్య ని అడుగుతుంది. నిజంగానే వచ్చాను కావాలంటే చూడు అంటూ తన చేతులు పట్టుకుంటాడు ఆర్య. మీరు ఎలా వచ్చారు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది అను. అంజలి నువ్వు మాట్లాడిన వీడియో నాకు షేర్ చేసింది అందుకే వచ్చేసాను అంటాడు ఆర్య. హలో పండిన చేతులని ఆర్య కి చూపించి ఆనందపడుతుంది అను.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి కేక్ తో సహా వస్తారు అంజలి శారదమ్మ. ఏంటి మేడం ఇది అంటుంది అను. రేపటికల్లా బేబీ మన ఫ్యామిలీ లోకి వస్తుంది చాలా ఎక్సైటింగ్ గా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటూ కేక్ కట్ చేయమంటుంది అంజలి. అను కేక్ కట్ చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇదంతా చూసిన మాన్సీ అసూయతో రగిలిపోతూ ఉంటుంది. ఫోన్ చేసి నువ్వు జైలు నుంచి బయటపడే టైం వచ్చింది మా బ్రో ఇన్ లా బేబీ బయట ప్రపంచాన్ని చూడకూడదు.
నా పగ నీ ప్రతీకారం తీరటానికి ఇదే కరెక్ట్ టైం అంటుంది మాన్సీ. మీరేమి టెన్షన్ పడకండి బేబీ పుట్టిన వెంటనే పైకి పంపించేస్తాను. బేబీ బర్త్ డే నాడే డెత్ డే ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఆర్యవాళ్ళు అంటాడు జలంధర్. వాళ్లు చేస్తున్న పనులు చేస్తుంటే నాకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది.. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రేపటికల్లా అందరూ బేబీ గురించి రిప్ అని మెసేజ్ పెట్టాలి అని ఆర్డర్స్ పాస్ చేస్తుంది మాన్సీ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.