Acharya: మణిశర్మ, కొరటాల మధ్య అంత జరిగిందా.. మ్యూజిక్ బిగ్ ఫెయిల్యూర్..
మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలయింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలయింది. దర్శకుడు కొరటాల శివకి తొలి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, రాంచరణ్ కామ్రేడ్ సోదరులు నటించారు. క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి.
mani sharma
దీనితో కొరటాల శివపై, ఆచార్య చిత్రంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మెగా అభిమానులైతే ఈ ఫెయిల్యూర్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆచార్యకి ముందు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని చిత్రాలు సూపర్ హిట్స్. ఆయనకి ఒక్క ఫ్లాపు కూడా లేదు. దీనితో ఆచార్య పక్కా హిట్ అని మెగా ఫాన్స్ రిలీజ్ కి ముందు ఫిక్స్ అయిపోయారు.
కానీ ఆచార్య చిత్రం తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. దీనితో ఆచార్య ఫెయిల్యూర్ కి గల కారణాల గురించి ఫాన్స్ చర్చించుకుంటున్నారు. కొరటాల స్క్రిప్ట్, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి. దీనికి తోడు సంగీతం పరంగా మణిశర్మ పూర్తిగా చేతులెత్తేశారు. చిరంజీవి, మణిశర్మలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్.
కానీ ఆచార్య చిత్రంలో మణిశర్మ పనితీరు ఒక్క చోట కూడా కనిపించలేదు. ఒక్క లాహే లాహే సాంగ్ మాత్రం పర్వాలేదనిపించింది. అందులో కూడా ఎక్కువ క్రెడిట్ లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రికే వెళుతుంది.
మిగిలిన సాంగ్స్ అవుట్ డేటెడ్.. బిజియం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇన్సైడ్ టాక్ ప్రకారం మణిశర్మ మ్యూజిక్ విషయంలో కొరటాల ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నారట. రీరికార్డింగ్ సమయంలో కొన్ని పోర్షన్స్ లో మణిశర్మ ఇచ్చిన బిజియం కొరటాలకి ఏమాత్రం నచ్చలేదట. దీనితో ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు కూడా రిలీజ్ కి ముందు ప్రచారం జరిగింది.
Acharya
ఇప్పుడు ఫ్యాన్స్ ఆ వార్తలు నిజమే అని భావిస్తున్నారు. వాస్తవానికి మణిశర్మ ఇటీవల అంతగా ఫామ్ లో లేరు. కానీ చిరంజీవితో ఆయన ట్రాక్ రికార్డ్ దృష్ట్యా.. బిజియం ఇవ్వడంలో కింగ్ అనే పేరు ఉండడంతో ఆచార్య చిత్రానికి ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. ఏది ఏమైనా ఆచార్య చిత్రానికి ఏ అంశం కూడా కలిసి రాలేదు. రాంచరణ్, చిరంజీవి కలిసి నటించిన పూర్తి స్థాయి చిత్రం కావడంతో మెగా ఫాన్స్ కి ఇది నైట్ మేర్ గా మారింది.