MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వ్యాపారం
  • వీడియోలు
  • Home
  • Entertainment
  • ఇంకా పిల్లలు కావాలంటే వేరే అమ్మాయిని చూసుకో అన్నది.. కుటుంబ నియంత్రణపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌

ఇంకా పిల్లలు కావాలంటే వేరే అమ్మాయిని చూసుకో అన్నది.. కుటుంబ నియంత్రణపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌

Manchu Vishnu: మంచు విష్ణు పిల్లల్ని కనే విషయంలో ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయనకు ఇంకా పిల్లల్ని కనాలని ఉందట. మరి అందుకు తన భార్య రియాక్షన్‌ ఏంటో తెలుసా?
 

Aithagoni Raju | Updated : Mar 22 2025, 08:39 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
manchu vishnu family

manchu vishnu family

Manchu Vishnu: కలెక్షన్‌ కింగ్‌, విలక్షణ నటుడు మోహన్‌ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు మంచు విష్ణు. హీరోగా రాణిస్తున్నాడు. మంచు ఫ్యామిలీకి ఆయనే లీడింగ్‌ సన్‌ అని చెప్పాలి. అయితే మంచు విష్ణు పిల్లల విషయంలో చర్చల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ లేదు,

దాన్ని ఎలా పాటించాలో ప్రజల్లో అవగాహన లేదు. దీంతో ఒక్కో కుటుంబం ఐదు నుంచి పది మంది పిల్లలను కనేవారు. కానీ ఇప్పుడు వైద్యం అందుబాటులో ఉంది. దానిపై అవగాహన వచ్చింది. దీంతో చాలా మంది కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ఇద్దరు ముగ్గురికే పరిమితమవుతున్నారు. 
 

24
manchu family

manchu family

కానీ మంచు విష్ణు అలాంటి నియమాలు పాటించడం లేదు. ఆయన ఇప్పటికే నలుగురుపిల్లల్ని కన్నారు. విష్ణు, విరానిక జంటకి మొదట కవలలు అరియానా, వివియానా జన్మించారు. ఆ తర్వాత  కొడుకు అవ్‌రమ్ జన్మించాడు. చివరగా కూతురు ఐరా విద్యా పుట్టింది.  ఇంకా కనాలని ఉందని అంటున్నారు. తనకు పిల్లలంటే చాలా ఇష్టమట.

ఇంకా కనాలని ఉందని తెలిపారు. తాజాగా ఆయన అంజి టాక్స్ లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. యాంకర్‌ అంజి ఏంటి మీకు కుటుంబ నియంత్రణ అనేది వర్తించదా? దాన్ని పాటించరా అని ప్రశ్నించగా, అది వ్యక్తిగతం. ఎవరి ఇష్టం వాళ్లది అని చెప్పాడు మంచు విష్ణు. 
 

34
manchu vishnu, viranica

manchu vishnu, viranica

అంతటితో ఆగలేదు. మరో క్రేజీ విషయాన్ని బయటపెట్టాడు. తనకు పిల్లలంటే చాలా ఇష్టం. చిన్న పిల్లలతో ఆడుకోవాలని అనిపిస్తుంది. అందుకే నలుగురు పిల్లల్ని కన్నాను. ఇంకా చెప్పాలంటే ఇంకా పిల్లల్ని కనాలని ఉందని చెప్పాడు విష్ణు.

అయితే ఇదే విషయాన్ని ఆయన తన భార్యని అడిగాడట. వామ్మో దెబ్బకి ఆమె బయపడిపోయి క్రేజీ ఆన్సర్‌ ఇచ్చిందట. అయితే వేరే అమ్మాయిని చూసుకో నా వల్ల కాదని చెప్పిందట. చాలా ఫన్నీ వేలో మంచు విష్ణు ఈ విషయాన్ని తెలిపారు. కానీ విషయం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

44
manchu vishnu

manchu vishnu

మంచు విష్ణు ప్రస్తుతం `కన్నప్ప` చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. మోహన్‌ బాబుతోపాటు ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

పౌరాణిక కథ కన్నప్ప జర్నీని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ఈ మూవీ ఏప్రిల్‌ 25న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మంచు విష్ణు. 

read  more: ఆ హీరోయిన్‌ చీర లాగి, బట్టలు చించి చుక్కలు చూపించిన కృష్ణంరాజు.. సెట్‌లో నరకం చూసిన ఆ నటి ఎవరు?

also read: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్ వివాదంలో బాలకృష్ణ.. 80లక్షలు కోల్పోయానంటూ బాధితుడి ఆరోపణలు
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
మంచు మోహన్ బాబు
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories