- Home
- Entertainment
- మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్, కన్నప్ప రిలీజ్ విషయంలో తేడావస్తే ఊరుకునేది లేదన్న హీరో
మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్, కన్నప్ప రిలీజ్ విషయంలో తేడావస్తే ఊరుకునేది లేదన్న హీరో
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీగా ఉంది మంచు విష్ణు కన్నప్ప మూవీ. ఈక్రమంలోనే విష్ణు కొంత మందికి వార్నింగ్ ఇచ్చాడు. తేడా వస్తే ఊరుకునేది లేదు అంటున్నాడు. ఇంతకీ విష్ణు ఎవరికి ఈ వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా నటించిన హిస్టారికల్ పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ శుక్రవారం, జూన్ 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, ధన్య బాలకృష్ణ, మంచు అవ్రామ్, ఐశ్వర్య రాజేష్, కరుణాస్, దేవరాజ్, అర్పిత్ రంకా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ సినీప్రపంచంలో ఉత్కంఠ కలిగించాయి. ఇక విడుదలకు కేవలం రెండు రోజులు మిగిలి ఉండటంతో, మంచు విష్ణు టీమ్ మీడియాతో పాటు సినిమా విమర్శకులకు స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది.అఫీషియల్‌గా రిలీజ్ చేసిన నోట్లో, టీమ్ ఏమంటుందంటే?
“కన్నప్ప సినిమా విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు మేము పొందాము. విమర్శకులు ముందుగా మా సినిమా చూసి, చిత్రంలోని కంటెంట్‌ను గౌరవించాలి. మా సినిమా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. అయితే, ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాను లక్ష్యంగా చేసుకొని నెగిటివ్‌గా రివ్యూలు చేస్తే, వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.”
“భావ ప్రకటన స్వేచ్ఛను మేము గౌరవిస్తాము. కానీ ద్వేషపూరిత విమర్శలు, వ్యక్తిగత దూషణలను తట్టుకోలేం. ఇటీవల కేరళ హైకోర్టు పేర్కొన్నట్లుగా, సృజనాత్మక కళను ఉద్దేశపూర్వకంగా కించపరచడం నేరం.” అలాగే, ఈ సినిమా సంబంధించిన చిత్రాలు, వీడియోలు, సీన్లు వంటి వాటిని సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల్లో అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని తీవ్రంగా నిషేధించారు. “అలా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టంగా తెలియజేశారు.
ఈ హెచ్చరికను మంచు మనోజ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా చాలా మంది యూట్యూబ్ రివ్యూవర్లు, సోషల్ మీడియా విమర్శకులు ఈ అంశంపై ఆలోచనలో పడ్డారు. కన్నప్ప చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఒక హిస్టారికల్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్.