MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెచ్చిపోయిన మోహన్ బాబు, కొడుకు మనోజ్ తో పాటు మీడియా ప్రతినిధులపై దాడి,

రెచ్చిపోయిన మోహన్ బాబు, కొడుకు మనోజ్ తో పాటు మీడియా ప్రతినిధులపై దాడి,

మంచువారి ఇంటి గొడవ వీధికెక్కింది. తండ్రీ కొడుకుల మధ్య గొడవలతో మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగాయి. ఈక్రమంలో మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో విషయం సీరియస్ గా మారింది. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 10 2024, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మంచు మోహన్ బాబు రెచ్చిపోయారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో జరుగుతున్న రచ్చ అందరికి తెలిసిందే. ఈ రచ్చ వీధికెక్కింది. దాంతో జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హై డ్రామా క్రియేట్ అయ్యింది. ఈక్రమంలో మనోజ్ తో పాటు.. ఈ విషయం కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. టీవి9 ప్రతినిధి మోహన్ బాబు వెర్షన్ తీసుకోవాలిన ప్రయత్నం చేశారు. దాంతో అది నచ్చని మోహన్ బాబు మైక్ లాక్కొని మీడియా ప్రతినిధిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు.

 దాంతో అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతిధిని చెవి దగ్గర గాయం అయ్యింది. గత కొంత కాలంగా మంచు ఇంట్లో మంటలు రేగాయి. మనోజ్ తో మెహన్  బాబుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ పెళ్లి విషయం నుంచి ఈ గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.

అయితే ఇంటి గొడవ జరిగినంత వరకూ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కాని ఆ గొడవ రచ్చకెక్కడం మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయించారంటూ ఆయన మీడియా ముందుకు రావడంతో మోహన్ బాబు కూడా పోలీసులకు లేఖ రాశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక  తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులను వారి  వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేశారు. జలపల్లి లోని మంచు టౌన్ దగ్గర మంచు మనోజ్ హంగామా చేశారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై మోహన్ బాబు దాడి చేశారు. టీవీ 9 మైక్ లాక్కొని మీడియా పై దాడి చేశారు మోహన్ బాబు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

 తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. తన కూతురిని ఇంట్లో పెట్టుకుని ఇవ్వడంలేదంటూ మనోజో ఆరోపణలు చేస్తున్నారుు. తమ బిడ్డకోసం  జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. దాంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలి దూసుకుపోయారు. 

35

అడ్డుకున్న సిబ్బంది పై మనోజ్ వాగ్వాదానికి దిగారు. మోహన్ బాబు పై మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్ బాబు ఖచ్చితంగా సారి చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మీడియా సంఘాలు ఆదోళనకు పిలుపు ఇచ్చారు.

మీడియాప్రతినిధిపై దాడి చేయడంతో పాటు అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడటం మరింత వివాదానికి దారి తీసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి. 

ఇక ఈ విషయంలో మోహన్ బాబు ఆడియో బైట్ ను రిలీజ్ చేశారు. మనోజ్ ను అందరికంటే ఎక్కువగా గారాబంగా పెంచామని. మనోజ్ తన భార్య మాటలు వింటూ తాగుడికి అలవాటుపడి ఇంట్లో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని. ఇంట్లో పనివారిని కొడుతున్నాడని.

తాగి మనోజ్ తన భార్య గోల చేస్తున్నారని. మన ఫ్యామిలీ కుల మత బేధం లేకుండా విద్యను అందిస్తున్నాము. పనివాళ్లను కొట్టి ఇబ్బందిపెట్టడంతో పాటు.. చనిపోయే స్టేజ్ కు వస్తే.. కేసు పెట్టకుండా కాపాడాను అని అన్నారు మోహన్ బాబు. ఇకనైనా నువ్వు నీ భార్య మారాలి అంటూ మనోజ్ కు చెప్పే ప్రయత్నం చేశారు. 

45

విద్యాలయాల్లో ఎటువంటి తప్పు జరగలేదని, ఇంట్లో ఖాళీగా ఉంటూ తన విద్యాలయాను తప్పుగా చూసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అన్ననే  కొట్టడం, అన్ననే తిట్టడం లాంటివి చేస్తుంటావు, అన్నను చంపేస్తానంటావు, నువ్వు మారాతావని మీ అమ్మ చెపుతుంటే ఊరుకున్నాను. నిన్ను బయటకు వెళ్ళి ఉండమన్నాను.

ఈ ఇంట్లో నీకు హక్కు లేదు. ఇది నా కష్టార్జితం. నీకు హక్కు లేదు. నీ కష్టార్జితంతో సంపాదించుకున్న ఇంట్లో నువ్వు ఉండు. నేను పిలిస్తే నువ్వు రావాలి. ఆస్తులు నేను రాస్తేనే మీకు వస్తుంది. మీకు ఇస్తానా.. లేక గంగపాలు చేస్తానా అనేది నా ఇష్టం. 

 

55

ముందు తాగు. కాని ఇష్టం వచ్చినట్టు కాదు. నేను కూడా తాగుతాను కాని వన్ ఆర్ 2 పెగ్స్ మాత్రమే తాగుతాను. జర్నలిస్ట్ లకు నాగురించి తెలుసు మిత్రులారా నా గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. నా బిడ్డ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని కంప్లైట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

ఇది ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. నీ బిడ్డ నా దగ్గర ఉంది.. తీసుకెళ్లు.. హ్యాపీగా ఉండండి. తీసుకెళ్ళపోతే చాలా బాగా చూసుకుంటాం నో ప్రాబ్లం. జర్నలిస్ట్ లారా మీకు కుటుంబాలు ఉన్నాయి. మీ గురించి.. మీ యజమానుల కుటుంబాల గురించి మేము పట్టించుకోలేదు. కాని మా ఇంట్లోకి తొంగి చూడకండి అంటూ  మోహన్ బాబు అన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మనోజ్
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved