నా భార్యని గొడవలోకి లాగారు, తనకు ఎవరూ లేరు, అన్నీ నేనే, ఎవరినీ వదిలిపెట్టను.. మంచు మనోజ్ వార్నింగ్
మంచు మనోజ్ మోహన్‌బాబు యూనివర్సిటీ సందర్శన ఉద్రిక్తతంగా మారింది. మనోజ్‌కి పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ఫైర్ అయిన మనోజ్.. మంచు విష్ణుకి, మోహన్‌బాబులకు వార్నింగ్ ఇచ్చారు.
మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్.. మోహన్‌బాబు యూనివర్సిటీ సందర్శించడానికి వెళ్లగా, అడ్డుకున్నారు. పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ వివాదం కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగారు. విద్యార్థులను సందర్శించాల్సి ఉండగా, ఆయన కలవడకుండానే బయటకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అనంతరం మనోజ్.. తన తాత, నానమ్మ, కజిన్ బ్రదర్ ప్రసాద్ మంచు సమాధిని సందర్శించారు. వారిని దెండం పెట్టుకున్నారు. మనసులో ప్రార్థించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ ఎందుకు తనని యూనివర్సిటీ లోపలికి వెళ్లనివడం లేదంటూ ప్రశ్నించారు మనోజ్.
కోర్ట్ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఇప్పుడు జీరాక్స్ చూపించారని, వాళ్లకి ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్ట్ కాపీలు ఇలా బయటకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. తాను దీనిపై పోలీస్ కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు. జరగకూడదు. ఎందుకు జరుగుతున్నాయో పరిష్కారం తెలియాలి. తెలుసుకుంటాను. తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. స్టూడెంట్స్ కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం, ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలను నేను ప్రశ్నించాను, మెసేజ్ చేశాను.
దానికి హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వడం లేదు. నా పిల్లలు ఉండగా కూడా ఇలా చేస్తున్నారు. మా అమ్మగారి బర్త్ డే రోజు ఇంటికొచ్చి చక్కర పోయడం, నేను ఆళ్లగడ్డకి వెళ్లిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి దొంగ సంతకం పెట్టించారు. ఇది ఎంత వరకు దిగజారిదంటే ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇక్కడ ఫ్లెక్సీలు పెడితే వాటిని చించేశారు. రెండు రోజుల క్రితం అదే చేశారు.
మళ్లీ ఈ రోజు తాను వస్తున్నానంటే ఫ్లెక్సీలు పెడితే చించేశారు. ఫ్యాన్స్ ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులో నుంచి ఫ్లెక్సీలు కట్టిస్తే ఇలా చేశారు. పండగ టైమ్‌లో ఇలా చేస్తున్నారని చెబితే వదిలేయండి, గొడవ పెట్టుకోవద్దని చెప్పాను.
కొందరు ఢిల్లీ నుంచి బౌన్సర్లు వచ్చారు. ట్రాక్టర్ పై వెళ్తున్నారు. వారంతా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాగానే పారిపోయారు. ఎందుకు భయపడుతున్నారో? ఎందుకు పారిపోతున్నారో అర్థం కావడం లేదు. నేను గొడవ పడటానికి రాలేదు. రోడ్డుపై పోలీసుల లాఠీలను బౌన్సర్లు పట్టుకుని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండకూడదని కోర్ట్ చెప్పింది. అయినా వాళ్లు ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదు` అని అన్నారు మంచు మనోజ్.
ఆయన ఇంకా మాట్లాడుతూ, తనని ఎందుకు అడ్డుకుంటున్నారు? సమస్య ఏంటో అడుతున్నాను, అది మాత్రం చెప్పడం లేదు. కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నా వినడం లేదు. నాన్నతో ఏదేదో వాయిస్ మెసేజ్‌లు పెట్టిస్తున్నారు. ఈ అన్యాయాలను నాన్నకి చెప్పాలనుకున్నా, ఆయన వద్దకు వెళ్లనివ్వడం లేదు.
అంతే కాదు, ఇంట్లోకి జొరబడి కరెంట్ జెనరేటర్‌లో చెక్కర పోశారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డ్ కి ఫోన్ చేసి కరెంట్ కట్ చేయమని చెప్పారు. ఈ విషయం తెలిసి అమ్మ అదేంటి మేముంటున్నాం కదా అని చెప్పి మళ్లీ సైన్ చేసి వాళ్లకి పంపించింది.
నేను మా నాన్నమీద కూడా కంప్లెయింట్ ఇవ్వలేదు. గుర్తు తెలియని వ్యక్తు నాపై దాడి చేశారనే చెప్పాను. ఇందులో నా భార్యని లాగారు. ఏ సంబంధం లేని ఆమెని లాగడంతో నేను బాగా హర్ట్ అయ్యాను. ఆమెకి అమ్మా నాన్న లేరు, తనకు తల్లైనా, తండ్రి అయినా నేనే. ఇది ఆస్తి గొడవ కాదు. ఆస్తి అడిగినట్టు ఒక్కటి ఫ్రూవ్ చేయండి. ఇక్కడి జనాలకు వద్దకు వెళ్లి అడిగితే నిజాలు తెలుస్తాయి. మనోజ్ నిజం చెబుతున్నాడా? అబద్దం చెబుతున్నాడా? తెలుస్తుంది` అని చెప్పారు మనోజ్.
అన్న మంచు విష్ణుపై మాట్లాడుతూ, తాను ఆరోపణలు చేయగానే భయపడిపోయి నారా లోకేష్‌ని కలిశారు, ఏవేవో మాట్లాడుకున్నారు. తాను కూడా మంత్రి లోకేష్‌ని కలిశాను, కానీ ఈ విషయాలు మాట్లాడుకోలేదని, తాను ఈ విషయంపై తాను ఒక్కడినే పోరాడుతానని, ఎవరి సహాయం తీసుకోను అని, అలాగే ఫ్యాన్స్ కి, ప్రజలకు తెలియజేస్తున్నా మీకు నేనున్నా భయపడవద్దు. మీ కోసం నేను పోరాడతా.
ప్రైవేట్ హాస్టల్స్ లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. ఖాళీ చేయాలంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఇదే విషయంపై కూర్చొని మాట్లాడదామని చెబుతున్నా, వినడం లేదు. నాన్నకు ఇవన్నీ తెలియడం లేదు, ఆయనకు చెప్పాలన్నా అక్కడి వరకు పోనివ్వడం లేదు` అని తెలిపారు మనోజ్. ఆయన మాటలను బట్టి చూస్తే దీని వెనుక అన్న మంచు విష్ణు ఉన్నట్టుగా అర్థమవుతుంది.
also read: మీనా చేయాల్సిన కమల్ `క్షత్రియ పుత్రుడు` ఆఫర్ ఎలా మిస్ అయ్యింది? తెరవెనుక ఏం జరిగింది?